2008-11-21

నవతరంగం: The Bicycle Thief (Italian, 1948)

2008-11-21 11:03 AM
ఇది చాలా పేరు పొందిన క్లాసిక్ సినిమా. ఇటాలియను దర్శకుడు విట్టోరియా డిసికా 1948లో తీశాడు. ఈ సినిమా గురించి (సంక్షిప్త కథ దగ్గర్నించీ లోతైన విశ్లేషణల దాకా) జాలంలో సంచులకొద్దీ సమాచారం ఉంది, కాబట్టి అవన్నీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చెయ్యను. కేవలం, ఒక ప్రేక్షకుడిగా, ఈ సినిమా చూస్తుండగా నాకు కలిగిన భావాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. సినిమా గురించిన కొన్ని మౌలికమైన వివరాలకి కింది సైట్లు చూడచ్చు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ వికీపీడియా రాజర్ ఈబర్ట్ [...]

నవతరంగం: శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్

2008-11-21 11:03 AM
సినిమా కథలకోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని, చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో కథలు దొరుకుతాయని నిరూపించిన కొద్ది సినిమాలలో ‘శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ ఒకటి. ఎనభయ్యో దశకంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా కోస్తా జిల్లాలని, ఊపేసిన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సంస్కృతి ని నేపధ్యంగా తీసుకుని వంశీ తీసిన ఈ సినిమా హాస్య చిత్రాలని ఇష్టపడేవారికి ఓ విందు భోజనం. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ కథకి నేపధ్యమైన [...]

పొద్దు: నవంబరు గడిపై మీ అభిప్రాయాలు

2008-11-21 11:03 AM
నవంబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. 2008 అక్టోబరు గడి, సమాధానాలు 2. 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు 3. 2008 ఆగస్టు గడి, సమాధానాలు 4. 2008 జూలై గడి, సమాధానాలు 5. 2008 జూన్ గడి, సమాధానాలు 6. 2008 మే గడి, సమాధానాలు 7. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు 8. 2008 మార్చి గడి, సమాధానాలు 9. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు 10. 2007 [...]

పొద్దు: దూరం

2008-11-21 11:03 AM
పింగళి శశిధర్ ఆలోచనా తరంగిణి కా ఒడ్డులో నీవు - ఈ ఒడ్డులో నేను - అలల అలజడిలో వెనుకడుగే ఇద్దరిదీ ! కానీ - కాళ్ళ క్రింది ఇసుకొకటే కాలంలా కరిగిపోతూ కలిపే ప్రయత్నం చేస్తోంది ఇద్దర్నీ !?

2008-11-16

ఈమాట: తెలుగు కథల పోటీ

2008-11-16 08:10 AM కిరణ్ ప్రభ
తెలుగు కథ శతవార్షికోత్సవ సందర్భంగా కౌముది వెబ్ మాస పత్రిక, రచన మాస పత్రికలు సంయుక్తంగా కథల పోటీ నిర్వహిస్తున్నాయి.

2008-11-10

ఈమాట: మనకు తెలియని మన త్యాగరాజు - 2

2008-11-10 06:16 PM సాయి బ్రహ్మానందం గొర్తి
రెండు గంటల పాటు జరగాల్సిన కచేరీ దాదాపు ఎనిమిది గంటల వరకూ జరిగింది. త్యాగరాజు సంగీతంలో అందరూ మునిగి పోయి శరభోజి మహారాజు గోష్ఠి గురించి అందరూ మర్చిపోయారు.

2008-11-04

ప్రాణహిత: కురవని చినుకు కోసం

2008-11-04 06:56 AM ప్రాణహిత
- బండ్ల మాధవ రావు కురవని చినుకు కోసం కురవని చినుకు అంచున తలక్రిందులుగా నిలబడి నిరీక్షిస్తున్నాను చినుకు నుండి జారి భూమిలో యింకిపోవాలని

ప్రాణహిత: అసలు దోషి

2008-11-04 06:53 AM ప్రాణహిత
- చైతన్య ప్రకాశ్‌ సిరిసిల్లా కార్గిల్లేక్‌ ముఖద్వారం కట్టుకున్న బట్టే బరిబాతల నిలబెట్టి ‘వర్ధని కుంట’ మీద మర ఫిరంగియై మొరుగుతూ వర్ధిల్లుతుంది ఇక్కడ బట్టా పొట్టే నిర్భంద బలిపీఠం -

ప్రాణహిత: పల్లె పుష్పం

2008-11-04 06:49 AM ప్రాణహిత
- ఎస్‌.ఆర్‌.భల్లం ఏ వీడ్కోలు తప్పనిసరిగా తరుముకొచ్చిందో… నగరం నడిబొడ్డున నలిగిన పల్లెపుష్పం అయ్యాడు.

ప్రాణహిత: ఏదీ మారలేదు

2008-11-04 06:39 AM ప్రాణహిత
- కొండెపోగు.బి. డేవిడ్‌ లివింగ్‌స్టన్‌ ఏదీ మారలేదు కొవ్వు కాస్తయినా కరగలేదు కాలం అభ్యుదయం వైపు తిరగలేదు. మనువు మారు మనస్సు పొందలేదు

ప్రాణహిత: మానేటి పాట

2008-11-04 06:33 AM ప్రాణహిత
- ఆడెపు లక్ష్మణ్‌ నేనెప్పుడూ నిత్యం నడక సాగించే తొవ్వె నేనెప్పుడూ చూస్తున్న గరకపోచలే నిటారుగా నిలబడ్డ గడ్డిపూల మొక్కలను ఎంతగా ఇనుప పాదాలతో నలిపినా-

ప్రాణహిత: అనన్య

2008-11-04 06:32 AM ప్రాణహిత
- హెచ్చార్కె ఇంతింత కళ్ళతో ఏమి చూస్తున్నావు ముడిచిన పిడికిట్లో ఏమి దాస్తున్నావు

ప్రాణహిత: విరసం కథా వర్క్ షాప్‌ కథకులతో ఒక సాయంత్రం

2008-11-04 06:31 AM వేముగంటి మురళి
గత కొంత కాలం నుండి విభిన్న ప్రాంతాల్లో విరసం నిర్వహించిన కథల వర్క్ షాప్‌కు సంబంధించిన సమీక్ష సమావేశం “కథకులతో ఒక సాయంత్రం” అనే కార్యక్రమం అక్టోబర్‌ 19న హైదరాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీ విరసం బాధ్యురాలు డా|| గీతాంజలి గారు అధ్యక్షత వహించారు.

ప్రాణహిత: శిల్పి

2008-11-04 06:30 AM ప్రాణహిత
- రమ్య గీతిక “ఉహూ నావల్ల అయ్యేడిదిగాదులే సార్!” ఆఫీసర్ తో చెపుతూ లేచి నుంచొని చేతిగుడ్డను ఓ సారి దులిపి బుజం మీద వేసుకున్నాడు పెంచలయ్య. “ఇది నీకు కూడా దేశం లోనే గొప్పపేరు సంపాదించిపెట్టే పని. చిన్న చిన్న పనులు ఎంతకాలం చేసుకుంటావ్?” ఎలాగైనా అతన్ని ఒప్పించి తీరాలి అన్నట్లుగా ఉంది ఆఫీసర్ మొహం.

ప్రాణహిత: అధ్యాయం 11: ముట్టడి (రెండో భాగం)

2008-11-04 06:29 AM మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
ఒకరోజు పొద్దున్నే బంకర్లలో వున్న మా సెక్యూరిటీకి కాఫీ తీసుకువెళ్తున్న నామీద కాల్పులు మొదలుపెట్టారు మార్షల్స్ . అపాచీ తెగకు చెందిన కార్లోస్ అనే యువకుడు నా వైపు దూసుకొచ్చి, నన్ను కిందకు తోసి తన శరీరంతో నన్ను కప్పాడు. నేను పొట్టిగా వుంటాను. ఆ అబ్బాయి నాకంటే చిన్నగా వున్నాడు.

ప్రాణహిత: మా నాన్న జ్ఞాపకాలు

2008-11-04 06:24 AM డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
మా నాన్న కుటుంబరావుగారు చనిపోయిన తరవాత టంకసాల అశోక్‌గారి సంపాదకత్వంలో ఆయన గురించిన వ్యాసాల సంకలనం ఒకటి అచ్చయింది. అందులోనే నా తొలి వ్యాసం ప్రచురితం అయింది కూడాను. వ్యక్తిగత జీవితంలో మా నాన్న వైఖరిని గురించి నేనందులో కొంత రాశాను. మరికొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను.

ప్రాణహిత: పసి మెదడు వికాసం, వ్యాయామం

2008-11-04 06:22 AM డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
మనసు, చైతన్యం, స్పృహ మొదలైన పెద్ద పెద్ద భావాలన్నీ ప్రధానంగా మన ఇంద్రియాలు బాహ్య ప్రేరణలకు స్పందించడం మీదనే ఆధారపడతాయి. మనకున్న ఇంద్రియ శక్తులు పూర్తి స్థాయిలో పుట్టుకతోనే వచ్చినవి కావు. అవి మెదడుతో బాటే ఎదుగుతాయి. మెదడు ఎలా వికాసం చెందుతుందో తెలుసుకోవాలంటే పసితనంనుంచీ ఎటువంటి మార్పులు కలుగుతాయో గమనించాలి.

ప్రాణహిత: ఒక సారాంశం కోసం

2008-11-04 06:20 AM ప్రాణహిత
- డా||బి.వి. ఎన్‌.స్వామి రెండు దశాబ్దాలుగా కరీంనగర్‌లో సాహితీ గౌతమి (సాహితీ సంస్థల సమాఖ్య) సాహితీ సేవ చేస్తుంది. అనేక కార్యక్రమాలకు తోడు సినారె కవితా పురస్కారాన్ని ఆర్గనైజ్‌ చేస్తుంది. కరీంనగర్‌ జిల్లాలో పుట్టి విశ్వవిఖ్యాతుడై జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న డా|| సి. నారాయణ రెడ్డి పై మమకారంతో ఆయన పేరు మీద ప్రతీ ఏటా ఒకరికి పురస్కారం ప్రదానం జరుగుతుంది.

ప్రాణహిత: ‘ప్రజల మనిషి’ ప్రస్థానం

2008-11-04 06:06 AM ప్రాణహిత
- నందిని సిధారెడ్డి అస్తిత్వ ఉద్యమాల కోణంలోంచి పరిశీలిస్తున్నప్పుడు అనేక విషయాలు కొత్తగా ఆవిష్కరించబడతాయి. చరిత్రలో అనేక కారణాల వల్ల నిర్లక్ష్యానికి, విస్మృతికి లోనై పక్కకు నెట్టబడి అప్రధానంగా ఉండిపోయిన అంశాలు విశేష ప్రాధాన్యతను సంతరించుకొని చర్చకెక్కి ఆశ్చర్యపరుస్తాయి. స్థిరపడిన అధికార కేంద్రాలు చరిత్ర రచనలో,సాహిత్య విమర్శలో తమ అవసర కోణం స్థిర పరుస్తూ తమ పద్ధతిలో చరిత్రలు మలుస్తున్న వైనాన్ని బాధిత సమూహాలు స్పష్టంగా గుర్తిస్తున్నాయి.

ప్రాణహిత: ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి నాయకులు ఎవరూ?

2008-11-04 06:00 AM ప్రాణహిత
- రమణ నేను తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చిన వాణ్ణికాను. కె.సి.ఆర్, గౌడులు గురించి ఎలాంటి అభిప్రాయం వున్నా, ఏ చెట్టూ లేని చోట – పురుగులు పట్టిన – ఆముదం మొక్కల్లా కనబడుతున్న ప్రస్తుత ప్రత్యేక ఉద్యమ నాయకత్వాన్ని, ‘వాళ్ళ కారణాలు ఏమైనా కనీసం వాళ్ళైనా ప్రత్యేక రాష్ట్రం గురించి కృషి చేస్తున్నారు’ కదా అన్న కారణంతో బహిరంగంగా శపించకుండా వుండాల్సిన ఆబ్లిగేషన్ తెలంగాణా సోదరులకి వున్నట్టుగా నాకు లేదు.

భూమిక: ఓ విధ్వంస దృశ్యం

2008-11-04 04:30 AM భూమిక
సంపాదకీయం రాద్ధామనుకుని కూర్చున్నప్పుడు నా మనస్సు అల్లకల్లోలంగా వుంది. కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఎన్నడూ ఎరగని ఓ భయం నన్ను ఆవహించింది. గుండె రగులుతున్న  కొలిమిలా వుంది. రాత్రంతా నిద్రలేక కళ్ళు ఎర్రబడి మండుతున్నాయి. కళ్ళు మూసిన కాసేపటిలోను పీడకలలు. విధ్వంశ దృశ్యాలు. గాజు కళ్ళ తల్లులు బారులు కట్టి కన్నీరు మున్నీరవుతున్న విషాద దృశ్యాలు. ఎటుపోతున్నాం? మనమేం చేస్తున్నాం? మానవ సంబంధాలెందుకింతగా దిగజారిపోతున్నాయి? మనుష్యులుగా కాక మర బొమ్మల్లా ఎందుకు తయరవుతున్నాం? మార్కెట్‌ను [...]

భూమిక: “ఎవరెష్ట్ మీద కురిసిన పండు వెన్నెల” మా నేపాల్ ట్రిప్

2008-11-04 04:28 AM భూమిక
కె.హేమంత   మా శ్రీవారి ఉద్యోగరీత్యా రెండు నెలలు నేపాల్‌లో గడిపే అవకాశం లభించింది.  మొదటిచూపులో మనం పరాయి దేశంలో అడుగుపెట్టాం అన్న భావనే కలుగదు.  దానికి తగ్గట్టుగానే వారు భారత్‌ను బిగ్ బ్రదర్‌ (పెద్దన్న) గా వ్యవహరిస్తారు.  అక్కడి మనుషులు, వాతావరణం, జీవనశైలి, ఆహారపుటలవాట్లు ఇలా అన్నీ ఉత్తర భారతంలోని నగరంలా అనిపిస్తాయి.  దాదాపు అందరు హిందీ మాట్లాడగలరు.  నేపాలీ భాష కూడా హిందీ బెంగాలీ కలిసినట్లుగా వుంటుంది. స్వతహాగా నేపాలీలు నెమ్మదస్తులు, శాంతి ప్రియులు, సర్దుకుపోయే మనస్తత్వం [...]

భూమిక: ఆత్మాన్వేషణ

2008-11-04 04:03 AM భూమిక
జ్వలిత పొద్దునే హడావిడిగా బస్సెక్కాం. ‘’స్నేహానికన్న మిన్న లోకాన లేదురా'’ ఎఫ్‌.ఎమ్‌ రేడియె బస్‌లో కూడా వినిపిస్తోంది. ఈ మధ్య ఆర్‌.టి.సి వాళ్ళు ఇదొక మంచి పనిచేశారు. పాట అయి పోయింది ఉత్సాహంగా… ఉల్లాసంగా… అంటూ తుళ్ళిపడుతోంది. రేడియె జాకీ కంఠం తరువాత ‘’స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం'’ పాట మొదలయింది. ఈరోజు పాటలన్నీ స్నేహం మీద వేస్తున్నారు అనుకున్నాను. నిజమే స్నేహం మధురమయినది, శాశ్వతమయినది, పవిత్రమయినది. కానీ ఈ మధ్య స్నేహానికి చెదలుపడుతున్నాయి. స్నేహమంటే భయపడే రోజులొచ్చాయి. ఈ ఆలోచనల్లో [...]

భూమిక: ఓప్రా విన్‌ ఫ్రీ

2008-11-04 04:00 AM భూమిక
పి. సత్యవతి బాల్యంలో కట్టుకోవడానికి సరైన బట్టలు లేక బంగాళా దుంపలొచ్చిన గోతాలతో కుట్టిన గౌన్లేసుకున్న ఒక నల్ల పిల్ల, తొమ్మిదేళ్ల వయసులో బంధువుల చేతనే అత్యాచారానికి గురైన పిల్ల, ఇంట్లో ఉండలేక పారిపోయి, 14 ఏళ్లకి గర్భం తెచ్చుకున్న అమాయకప్పిల్ల, ఇవ్వాళ అమెరికాలోనే కాక ప్రపంచం అంతా గొప్పగా వెలిగిపోవడం. అంటే దాన్ని అదృష్టం అంటే వొప్పు కోకూడదు. ఆమె లోని ప్రజ్ఞ, మేధ, పట్టుదల, అంటే అవుననాలి మనం….చింకి పాతల్లోంచీ ఒక మీడియ మొగల్‌గా ఎదిగి, [...]

భూమిక: బరువైన వీధి మలుపు

2008-11-04 03:52 AM భూమిక
డా. జరీనా బేగం నేనా వీధి మలుపు దగ్గరకు వెళ్ళగానే అనుకోకుండా నా చేతులు బ్రేకులు మీద పడి బండి కదలనంటుంది బలవంతంగా బండిని కదిలించి నా ఇంటి దారిన బయలుదేరినా బరువైన నా మనసు బలవంతంగా రాలిపోయిన నా స్నేహపు జ్ఞాపకాల నుండి కదలనంటుంది ఎంత ధైర్యం తన మాటల్లో ఎంత ఓదార్పు తన స్నేహంలో ఎంత పరిపక్వత తన ఆలోచనల్లో ఎంతటి తపన మార్పు కోసం ఎంతటి త్యాగం మాట కోసం ఎంతటి ఎదురుచూపు కొత్తదనం కోసం కొత్త పాత ఆలోచనా మార్పుల ఒరవడిలో రగులుతూ పోరాడుతూ రాలిపోయింది నా స్నేహం బతుకుబాటలో మిగిల్చి ఓ ఆరని జ్యోతిగా ఆలోచించే ప్రతి మనసులో నిత్యం రగులుతున్న ఓ [...]

భూమిక: పానోపాఖ్యానము

2008-11-04 03:51 AM భూమిక
తమ్మెర రాధిక పండగ పూట భుక్తాయసం మూలంగా పాన్‌ తెచ్చాడు మా ఆయన. టీవీలో కవితాగోష్ఠి చూస్త పాన్‌ నములుత ఎర్రని ఉమ్మిని వికారంగా ఊస్తూ పండగ మాధుర్యాన్ని కకావికలు చేస్తున్నారు పాన్‌ ఫటు గొంతులోకి దిగుతున్నప్పుడు చారులో మిరియాలు లేవని నామీద నూరిన కారాలు గుర్తొచ్చాయి తమలపాకుల మందం గురించి చెప్తూ కర్వేపాకుల అందం ఆరోగ్యం ఎలా వుంటుందో పప్పులో వెయ్యని నా వెనకబాటుతనాన్ని వ్యంగ్యాస్త్ర భాణాలతో ఛేదిస్తున్నప్పుడు పాన్‌ తినకూడదని శపథం పట్టాను. వక్కపలుకులు చిన్న సన్న ములుకొలుకులట అన్నంలో వచ్చే పలుకు రాయికి సమానమట. చీకట్లో బియ్యం ఏరని ఖర్మకి, పానొక్కలు ఆకులు రాసిన సున్నం - కాచులా [...]

భూమిక: ఆ కాలంలో…

2008-11-04 03:49 AM భూమిక
  మంచికంటి భర్తల్లేని కాలాన్ని స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు హద్దులు చెరిపేసిన ఆకాశంగా ప్రకటించండి తిని తాగి పైనబడి రక్కీ కొట్టి హింసల్లోనే సుఖాలు వెతుక్కునే పురుష పుంగవులకి ఏ రోజూ మీ చల్లని చూపులు సోకకుండా తెల్లవారదు నిద్రలో కూడా కలవరింతలతో పొద్దు పుచ్చే మీకు మెలుకువలోన ఎన్ని దుష్టస్వప్నాలో బెదిరింపుల బుజ్జగింపుల లాలింపుల ఆదరింపుల్లోన ఎన్ని దాష్టీకాలో భర్తలు వొదిలేసిన కాలాన్ని చల్లని వాయు సమీరాల్ని కురులు విప్పార్చుకుని ఆనందాశ్రువులుగా రాల్చండి భర్తలు తరిమేసిన కాలానికి నిప్పు ముట్టించి వీథి వీధి దివిటీలు పట్టుకు తిరగండి కొంతకాలమైనా స్వేచ్ఛను ప్రసాదించినందుకు కోటి కాంతుల హారతుల్ని నీరాజనాలుగా ఇవ్వండి వొదిలేసినా  కాలాల్నీ తరిమేసిన లోకాల్నీ కాసింత కసిదీరా [...]

భూమిక: అది ఒక శిలాఖండం

2008-11-04 03:47 AM భూమిక
తమిళ మూలం : వైరముత్తు అనువాదం : ఆర్‌ శాంతసుందరి అమ్మా అహల్యా ఎప్పుడే నువ్వు ఆడదానిగా మారేది?  ఈ మగరాముళ్లు  అందరు  రాయిగా నువ్వు పడి ఉండకముందు చూసిందంతా   దాచిపెట్టి  తమ పాదాలని దాచుకుని   పల్లకీల్లోకి ఎక్కి   ప్రయణం చేస్తుంటే…. అమ్మా అహల్యా ఎప్పుడే నువ్వు ఆడదానిగా మారేది?  అడవిలో  ఆనాడు కథాశిలలా  పడుండిన నువ్వు  సంఘమనే సంతలో  ఈనాడు  శరీర శిలగా పడున్నావ్‌! కలత చెందకమ్మా, రాయిగా మారినది నువ్వేనని అనుకుంటున్నావా? ఆ కాషాయధారి గౌతమముని మనసే రాయి కాదా!  ఒకలా చూస్తే   నీ కష్టాలు కష్టాలు కావనే అనాలి!  శిలగా మారటం చేత   నీకే బాధలు లేవు! చడమ్మా అహల్యా నా భారత పుత్రికలు ఏదో ఒక దాని కోసం రాత్రి స్త్రీగా మారటానికి  పగటి జీవితమంతా  పాడుబడ్డ [...]

భూమిక: లవ్‌స్టోరీ

2008-11-04 03:41 AM భూమిక
కొండేపూడి నిర్మల మూడేళ్ళ పాపే పాకిస్తాన్‌ ఏజెంటా..? …. ఘనమైన పురపాలక సంస్థ అత్యంత ప్రేమగా తవ్విన గోతుల మీదుగా, గొప్పలమీదుగా ఒక కాలం చెల్లిన ఆర్టిసీ బస్సు వెడుతోంది. మలుపు తిరిగినప్పుడల్లా మరలో కలియదిరిగే కంకర మాదిరి జనం నలిగిపోతున్నారు. పాతికేళ్ల గిల్లేశ్వరావూ అదే బస్సులో వున్నాడు. పక్కనున్న భూదేవిని లైన్లో పెట్టడానికి అరగంటనుంచీ ఒకటే ప్రయత్నం. ఇకిలించాడు, సకిలించాడు. వీపు గోకాడు, మెడమీదుగా ముందుకు వొంగి, ‘’స్వప్నా, బావున్నావా..'’ అన్నాడు.  స్వప్నా ఎవరు- అని చూసె సరికి, ‘’సారీ, నువ్వు స్వప్ప కాదా, [...]

భూమిక: కవయిత్రుల నానీలు - స్త్రీ హృదయ సంవేదన

2008-11-04 03:40 AM భూమిక
డా సి. భవానీదేవి కవిత్వం నిత్యనూతనమైనది.  నిత్యపరిణామశీలం కూడా.  వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం అనేక రుపాలను మార్చుకుంటూ దేశ కాల పరిస్థితులను బట్టి సమాజ హితానికి అక్షరవర్గ దర్శనం చేస్తున్నది.  గురజాడ ముత్యాల స్వరాల తర్వాత అంతగా ప్రాచుర్యం పొందిన కవితారూపం నానీలే!  నానీల రూపశిల్పి కూడా ఆశ్చర్యపడే విధంగా సీనియర్‌ కవయిత్రుల కవిత్వాన్ని ప్రభావితం చేయటంతో పాటు యువతను కవితామార్గం పట్టించిన ఈ వినూత్న కవితా రూపాన్ని అందుకున్న వారిలో కవయిత్రుల సంఖ్య చాలా ఉంది.  నానీల సంపుటులు [...]

భూమిక: నక్షత్రాల చుట్టూ నిశ్శబ్దాన్ని మీటుతూ…రౌద్రి

2008-11-04 03:37 AM భూమిక
డా.శిలాలోలిత రౌద్రి కలం పేరు. అసలు పేరు లలిత. ఒకటి శరీరానికిచ్చిన పేరైతే, ఒకటి మనసుకు పెట్టుకున్న పేరు. ఈ రోజు రౌద్రి మన మధ్యన లేదు. లేదు అన్నది భౌతిక ప్రపంచానికి మాత్రమే. అక్షర శరీరాన్ని తొడుక్కున్న రౌద్రి మన మధ్యనే వుంది. మనలోనే వుంది. కాకపోతే చూడడానికి మనసు కళ్ళు తొడుక్కోవాలంతే. లలిత అమ్మ, రచయిత్రి కె. రామలక్ష్మి. నాన్న కవీ విమర్శకులైన ఆరుద్ర. ఆ సాహిత్యపు తోటలో పూచిన పువ్వు లలిత. 1987లో ‘నిద్రపోని పాట’ కవిత్వ [...]

భూమిక: నేటి మహిళలకు ఆదర్శం ఇందిరాజైసింగు

2008-11-04 03:33 AM భూమిక
 లింగభత్తిని మల్లయ్య ఇందిరా జైసింగు మనదేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు.  భారతీయ మహిళాలోకంలో ఆమెకంటూ ఒక ప్రత్యేకత ఉంది.  సంఘసేవలో అంకితం కావడమే ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.  ‘’ప్రజా ప్రయొజనాల కోసం ఆమె చేసిన న్యాయపోరాటమే'’ ఆమెకు వన్నె తెచ్చింది.  మహిళల సమస్యలు, మహిళలపై సాగుతున్న వివక్ష, మహిళా హక్కుల సాధికారత, భోపాల్‌ గ్యాస్‌ బాధితుల కోసం, పర్యావరణ సమతుల్యానికి కాటకాలవుతున్న ఫ్యాక్టరీల మీద, శ్రామికుల హక్కుల కోసం న్యాయపోరాటం వంటివన్నీ ఆమె న్యాయసేవలో కొన్ని మైలురాళ్లు. ఇందిరా జైసింగు 1940లో ముంబాయిలో పుట్టారు.  [...]

భూమిక: సీరెలు సింపి రైకలు గుంజి….

2008-11-04 03:30 AM భూమిక
జూపాక సుభద్ర నెలరోజుల్నించి జ్వరం యిసంపురు గోలె పట్టుకొని యిడుస్తలేదు. వస్తాదుల సోంటి మందులోల్లను గూడ మసిజేసి పారేస్తంది. రెట్టించిన బలంతో జ్వరం తన పని తాను చక్క బెట్టుకుంట నన్ను యిడ్చి మంచాన బడేసింది. నా పనుల్ని పడావు బెట్టింది. యీ మొండి జ్వరాన్ని జయించనీకి ‘నిమ్స్‌’ అనే బీమార్ల రణనిలయానికి బోయి షరీకైన. షరీకైన పొద్దునుంచి ఒక్క వర్కర్‌ కనబల్లే… రూములల్ల నర్సులు డాక్టర్లే అటిటు తిరుగుతుండ్రు. ొరూములు, బాత్రూములు కంపు కంపు గున్నయి. ఏమైంది ఎందుకో తెలువదు. [...]

భూమిక: చేనేతక్క(చేనేత మహిళల జీవన చిత్రం)

2008-11-04 03:26 AM భూమిక
పులుగుజ్జు సురేష్‌, ఎస్‌.వి. శివరంజని పేగులు కాలుతున్నా పోగులు అతుకుతుంటారు. కడుపులు మాడుతున్నా ఖరీదైన చీరలు నేస్తుంటారు. జానెడు పొట్ట కోసం బారుల కొద్దీ బట్టలు నేస్తుంటారు. ఆర్థికంగా వెనుకబడినా ఆధునిక డిజైనులు నేయుటలో వారిది అందెవేసిన చేయి. ఇ వారు లేనిదే చీర తయారు కాదంటే అతిశయెక్తి కాదు. అందుకే మగ్గం నేయలేని మహిళ ఇల్లాలుకానేరదని మన జాతిపిత మహాత్మాగాంధీ ఆనాడే అన్నాడు. అక్షరాలు నేర్వకపోయినా గడ్డిపరకల కలయికను చూసి పడుగు పేకలు కలిపి మానవ ప్రపంచానికి బట్టలు నేసిన మహిళా చేనేతక్కల గాధ ఇది. ఇ మహిళల [...]

భూమిక: పడగ నీడ

2008-11-04 03:23 AM భూమిక
శారద అబ్బ! ఎంత పెద్ద పామొ! అది వమూలు పామే, అయినా కొండచిలువంత లావుంది. మెలికలు తిరుగుతూ, గబుక్కున నా చిన్నారి శ్రీలతని చుట్టేసింది. గబగబా దాన్ని చుట్టేసి, ఉక్కిరిబిక్కిరయేలా ఒడిసిపట్టుకుంది. మింగటానికని నోరు తెరిచింది. బిడ్డ ఆశ్చర్యంతో, భయంతో కేకలు వేయటం కూడా లేదు. అరె, ఇదేమిటి! మింగటానికని నోరు తెరిచిన కొండచిలువకి ఇన్ని తలలున్నాయేమిటి? ఎన్ని పడగలు! ఆ పడగల కళ్ళల్లో క్రౌర్యం! నాల్కల్లో విషం. దాని కౌగిట్లో చిక్కినవారెవ్వరూ ప్రాణాలతో బయటపడలేరు. నా బిడ్డను మింగేస్తు౦ది… కెవ్వున [...]

భూమిక: తెలంగాణ దళితులపై ఎందుకీ వివక్ష?

2008-11-04 03:21 AM భూమిక
కృపాకర్‌ మాదిగ పొనుగోటి కంచికచర్ల, కారంచేడు, నీరుకొండ, చుండూరు, పిప్పర, దొంతలి, పోలేపల్లి, వాకపల్లి - దళితులపై జరిగిన అత్యాచార సంఘటనలన్నీ కోస్తా ప్రాంతానికి సంబంధించినవే.  నాయకులంతా కోస్తా ప్రాంతానికి చెందినవారే.  ఉద్యమాల కోస్తావే.  ప్రచారమిచ్చిన మీడియ యజమాన్యాల కోస్తావే.  దళితులపై అత్యాచారాలను వెలికితియ్యడంలోన, బాధితులకు కొద్దిమేరకైనా న్యాయం జరగడంలోన, ప్రారతం వివక్ష, నాయకుల వివక్ష, పోలీసుల వివక్ష, ప్రభుత్వాల వివక్ష జాగ్రత్తగా గమనిస్తే కొట్టొచ్చినట్టు తేడాలు స్పష్టమౌతాయి. నిజానికి తెలంగాణాలో అంటరానితనం, అత్యాచారాలు, మాదిగలపై, ఆదివాసులపై, దళితులపై నిత్యం [...]

2008-11-02

ఈమాట: ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం!

2008-11-02 07:32 AM సంపాదకులు
ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! ఈ సందర్భంగా ఈమాటకు మీ సహాయ సహకారాలు కలకాలం ఉంటాయని ఆశిస్తూ, ఈ సంచికను మీ ముందుకు తెస్తున్నాం.

ఈమాట: బాలమురళీకృష్ణ సంగీతం

2008-11-02 06:37 AM కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
సంప్రదాయం అనే పేరుతో ఎవరికి తోచినది వారు పాడుతున్నారనే ఫిర్యాదు కూడా వింటున్నాం. ఈ విషయంలో బాలమురళిగారి అభిప్రాయాలు తీవ్రమైనవి.

ఈమాట: పురూరవ

2008-11-02 06:36 AM గుడిపాటి వేంకటాచలం
చలం రాసిన "పురూరవ" నాటకం ఈ-పుస్తకంగా.

ఈమాట: కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం

2008-11-02 06:20 AM కొడవళ్ళ హనుమంతరావు
అనంతం! మనిషి మనసుని ఇంతగా ప్రభావించిన లోతైన ప్రశ్న మరొకటి లేదు. మానవ మేధని ఇంతగా ఉత్తేజింపచేసిన ఊహ మరొకటి లేదు. అయినా, అనంతం కన్నా స్పష్టం చెయ్యాల్సిన భావన మరొకటి లేదు.

ఈమాట: A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu

2008-11-02 06:19 AM వేలూరి వేంకటేశ్వర రావు
Malathi narrates very powerfully the reluctance of the Telugu Sahitya Academy to accept, acknowledge and reward these writers for almost three decades.

ఈమాట: ఈమాట - నామాట

2008-11-02 06:19 AM వేలూరి వేంకటేశ్వర రావు
పదహారు సంవత్సరాలు నిండితే కానీ జ్ఞానదంతాలు రావు. అయితే, చిన్నతనమేలే అని అశ్రద్ధ చెయ్య కూడదు. రాబోయే ఆరేళ్ళూ ఆ దంతాలు కొక్కిర్లు లేకండా సరిగా పెరిగేట్టు చూసుకోవాలి. జాగ్రత్త పడాలి.

ఈమాట: 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ

2008-11-02 06:19 AM వంగూరి చిట్టెన్‌ రాజు
వంగూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 - 15, 2009 లలో హైదరాబాదులో "తెలుగు కథ శతవార్షికోత్సవం" పేరున సభలు జరపటానికి నిశ్చయించడం జరిగింది.

ఈమాట: సువర్ణభూమిలో …

2008-11-02 06:18 AM తమ్మినేని యదుకులభూషణ్
పరాయి భాషలో పరిశీలకులకు వివరిస్తున్నాడు

ఈమాట: డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష

2008-11-02 06:18 AM జెజ్జాల కృష్ణ మోహన రావు
ఈ సమావేశంలో కవులు, కథా, నవలా రచయితలు, విమర్శకులే కాక సాహిత్యాభిమానులు ఎందరో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ-మెయిలు ద్వారా, రచ్చబండ ద్వారా పరిచితులైన ఎందరో మిత్రులను కలుసుకొని మాట్లాడే భాగ్యం కలిగింది.

ఈమాట: రామా కనవేమిరా!

2008-11-02 06:18 AM కె. వి. గిరిధరరావు
అప్పుడప్పుడు మా ఆవిడ, అబ్బాయిలతో గుడికి వెళ్తుంటా. వాళ్ళ లాగే నేనూ దణ్ణం పెట్టుకుంటా. గుళ్ళో దొరికే ప్రసాదం తింటా. కొన్ని సార్లు దణ్ణం పెట్టుకోడానికి ముందే ప్రసాదం తెచ్చుకుని తింటా.

ఈమాట: సాహిత్య విమర్శ - అక్కడా, ఇక్కడా

2008-11-02 06:17 AM వెల్చేరు నారాయణరావు
ఉపన్యాసాన్ని పాఠాంతరం చేయడంలో అనుకోని ఇబ్బందుల వల్ల ఆలస్యం జరిగింది. ఈ వ్యాసం 15వ తేదీ కల్లా ప్రచురించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆలస్యానికి క్షమాపణలతో - సం.

ఈమాట: 2008 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు

2008-11-02 06:16 AM తమ్మినేని యదుకులభూషణ్
జొన్నగడ్డల వేంకటేశ్వర శాస్త్రికి ఈ ఏడాది బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము. ఇస్మాయిల్ అవార్డుకు పి.మోహన్ కవితా సంకలనం "కిటికీ పిట్ట"ఎంపికైంది.

ఈమాట: మూడు జ్ఞాపకాలు

2008-11-02 06:16 AM విన్నకోట రవిశంకర్
ఇంగ్లీషు న్యూస్ పేపర్లో ఏవో కార్టూన్లు, కామిక్స్ నుంచి చిన్న భాగాలు వేస్తారుగదా. ఈ కార్టూను బొమ్మల్లో ఆరోజు తగిలే నెంబరు రహస్యంగా దాచబడి ఉంటుందని అతని నమ్మకం.

ఈమాట: పదేళ్ళ “ఈమాట” మాట

2008-11-02 06:16 AM కె. వి. ఎస్. రామారావు
ఈ పదేళ్ల కాలగమనం తర్వాత పునఃపరిశీలిస్తే, వీటిలో కొన్ని ఊహలు నిజమయ్యాయి. ఇంకొన్ని అనుకున్న దిశలోనే కదుల్తున్నాయి కాని అనుకున్నంత వేగంగా కదలటం లేదు.
వ్యాఖ్యలు
2008-11-21
2008-11-21 08:36 AM pappu - Comments for నవతరంగం

విశ్వనాథ్ ఆణి ముత్యాల్లో ఇదొక సినిమా..మంచి పరిచయం..ధన్యవాదాలు..

2008-11-21 08:23 AM pappu - Comments for నవతరంగం

రావులపాలెం జంక్షన్ చాల ఫేమస్ “వ్యవహారానికి”, ప.గో నించి తూ.గో కి రావడానికి రావులపాలెమే జంక్షన్..అందుకని రాసాడేమో?

ఏది ఏమయినా భరణి లాంటి రచయిత లోంచి ఒక మంచి నటున్ని బయటకు తీసి పరిచయం చేసాడు వంశీ.

2008-11-21 07:04 AM shree - Comments for నవతరంగం

నాకు చిరాకు పుట్టించిన రెండు సీనులు….
1.ముఖ్య మంత్రి తో మీటింగు…

ముఖ్య మంత్రి అని కాకుండ..ఎ యం యెల్ ఎ అనొ అంటే బాగుండేది..

ముఖ్య మంత్రి మీటింగు… అని చెప్పి…పెల్లిల్లకెసే సెట్టింగ్ వెసారు…

2.ఆటొ పందాలు ….

ఓక్కడు కూడా ఎంజొయ్ చెయలెదు…

నాకు నచిన విషయలు

1.వాస్థవికత: చాలా వరకు realistic గ చూపించ దానికి ప్రయత్నించారు…

2008-11-21 06:42 AM రాజేంద్ర కుమార్ దేవరపల్లి - Comments for నవతరంగం

—-మురళీ గారు,చాలా హృద్యమైన సినిమాని పరిచయం చేసినందుకు థాంక్స్!

నాకు గుర్తున్న చిన్నచిన్న సూచనలు:

వ్యాన్ నడిపే డ్రైవర్ మస్తాన్-అనందమోహన్,చెట్టుకిందప్లీడరు లో రాజేంద్రప్రసాద్ బాడీగార్ద్
సిలోన్ సుబ్బారావు–రాళ్ళపల్లి
జూనియర్ కృష్ణ గా నరేష్ సూట్ కాలేదని — అసలు ఈ సినిమా మొదట అనౌన్స్ చేసినప్పుడు హీరో రాజేంద్రప్రసాద్,మరేమయ్యిందో నరేష్ వచ్చాడు,

ఈ సినిమా లో సీత గా కనిపించిన మాధురి తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు–1992 లో వచ్చిన అంకురం,బావగారు తదితర్ చిత్రాల్లో ఉంది,
ఈ లో-బడ్జెట్ సినిమా అంతగా విజయవంతం కాలేదు–లేడీస్ టైలర్ స్థాయిలో కాకున్నా మంచి లాభాలు,జనాదరణ పొందింది.
ఇక ఈ సినిమాలో పెనుగొండ అబ్బులు మాటమాటకీ,‘అలా రావులపాలెం జంక్షన్ దాకా వెళ్ళొస్తా’నంటాడు ఎందుకో నాకిప్పటికీ తెలీదు,
నిర్మలమ్మ పాపారావుని,నువ్వూ నీ నల్లరంగూ అంటే,నలుపు కాదక్కయ్యా,బూ కిట్టుడి టైప్ అన్న మాట ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వాపుకోలేము,
ఏప్రిల్ ఒకటి విడుదల,చెట్టుకింద ప్లీడరు సినిమాల మీద కూడా రాయగలరు

2008-11-21 06:07 AM shree - Comments for నవతరంగం

సినిమా కథలకోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని, చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో కథలు దొరుకుతాయని…..
Thanks…!!!

2008-11-21 05:55 AM shree - Comments for నవతరంగం

Thanks venkat…!!! Now I got the POINT…!!!

2008-11-21 05:30 AM చావా కిరణ్ కుమూర్ - Comments for పొద్దు

బాగుంది.
కవి మరీ పిసినారిలా ఉన్నాడు :) మరీ నాలుగు లైన్లేనా, ఇలాగే ఇంకొంచెం కవిత్వాన్ని మాకు వడ్డించవచ్చు కదా.
ఆంగ్ల సినిమా ట్రైలర్ లా క్లుప్తంగా, చక్కగా ఉంది.
సినిమా కూడా రిలీజ్ చేస్తే చక్కగా చూసేస్తాం.

2008-11-21 05:26 AM VENKAT - Comments for నవతరంగం

avunandi
muralai garu..e madhya o tv channel chusanu…COmedy movies ante chevulu kosukune na lanati vallu nijama ga `navvula vinde“ ..it was very nice ..

mi anaylysis kuda chala bavundi./..

Venkat Balusupati

2008-11-21 01:39 AM - Comments for ఈమాట

ఇంత అపురూపమైన బహుమతిని అందించిన మీకు , ఈమాటకి ధన్యవాదాలు.

2008-11-20
2008-11-20 10:25 PM - Comments for ఈమాట

అన్నట్టు, అకిలీసు ప్రస్తుతానికి గ్రీకు వనిత అనుకుందాం :), గ్రీకు వీరుడు, అనే కన్నా! (తెలుగులో “చేరుతుంది” అని రాసినందుకు). అయినా Achilles క్రాస్ డ్రెస్సర్ అని ఎక్కడో విన్నట్టు గుర్తు.

విప్లవ్

2008-11-20 09:41 PM gaddeswarup - Comments for నవతరంగం

ఆ రోజుల్లో ‘బూట్ పాలిష్’ కూడ వచ్చింది, కొంతవరకు ఒక ఇటాలీన్ సినిమా Shoeshine ఆధారంగా. దానిని రురించి కూడా ఎప్పుడైనారాస్తారా. ఈ రివ్యూలో చాలా పొగిడారు review from Time magazine.

2008-11-20 09:38 PM పరుచూరి శ్రీనివాస్ - Comments for నవతరంగం

మంచి సినిమాని పరిచయం చేశారు. Thanks!

కొంచెం సొంతడబ్బా: ఈ సినిమా సొంత DVD కాపీ వుంచుకోవాలని నాకో పెద్ద కోరిక. జర్మనీలోనేమో దిగుమతైన డి.వి.డి. లు బోలెడు ఖరీదు. సరే యిప్పుడు ఇంగ్లాండులో వుంటున్నాను కదా, అక్కడ కాస్త చవగ్గా దొరుకుతుందేమో అని చూస్తే అక్కడ classics కింద పెట్టేసి రేటు కొండెక్కించారు. మిత్రులిద్దరు Netలో ఉచితంగా download చేసుకునే మార్గం చెప్తామన్నారు కానీ, ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు. ఏమైతేనేం, ఆగస్టులో ఒక రెండు పుస్తకాలు కొనడం తగ్గించి ఈ సినిమా కొనేశాను.

సరే, ఈ సినిమా ఆధారంగా తెలుగులో ఒక సినిమా వచ్చింది. దాని పేరు చెప్పగలారా! ఇక్కడ వ్యాసాలు రాసే ఒకాయనకు already చెప్పాను. ఆయన జవాబు రాయడానికి అనర్హుడు :-)

అలాగే, ఈ సినిమాకి, షావుకారు సినిమాకి ఏమైనా సంబంధం వుందని యెవరైనా అనుకుంటున్నారా?

– శ్రీనివాస్

2008-11-20 08:41 PM - Comments for ఈమాట

15 వెళ్ళిపోయి ఐదు రోజులయింది. మళ్ళీ ఏ విషయమూ చెప్పారు కాదు కదా?

- పాఠకుడు

2008-11-20 08:32 PM - Comments for ఈమాట

ఇన్ని విషయాలు చెప్పి, ఆ తర్వాత, “నేనొక సాధారణ పాఠకుణ్ణి” అని అంత వినయంగా అనేశారేవిటీ? ఎవరూ నమ్మరు ఆ మాట. “నేనొక అసాధారణ పాఠకుణ్ణి” అని పెట్టాలి పేరు ఈ వ్యాసానికి, ఇందులో వున్న “అసాధారణ విషయాల” వల్ల. అందుకే నా లాంటి పాఠకుడికి ఇదొక పెద్ద సోదిలా అనిపించి, చాలా బోరు కొట్టింది. కాసిన్ని తెలివితేటలుంటేనే గానీ చదివి, హరాయించుకోలేమనిపించింది కూడా. ఈ తప్పు విశ్వనాథ కవిత ప్రకారం అయితే నాదే. వేలూరి గారి మాటల వల్ల అయితే ఆయనదీ. మొత్తానికి చందమామలో రామాయణం సంక్షిప్తంగా ముద్రించినట్టూ, రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం విన్నట్టూ, లేడిలా గెంతుకుంటూ, వాక్యాలు వదిలేస్తూ చదవాల్సి వచ్చింది.
- పాఠకుడు

2008-11-20 08:11 PM విష్ణుభొట్ల లక్ష్మన్న - Comments for నవతరంగం

అయ్యా! కొత్తపాళీ గారూ:

భలే మంచి సినిమా ఎన్నుకున్నారు. జాలంలో ఎంతో సమాచారం ఈ సినిమా పై ఉన్నా, ఇక్కడ అది మీరు తెలుగు రాస్తే మేం మళ్ళీ జాలంలో వెతకనక్క లేదు కదా!

పథేర్‌పాంచాలి సినిమాకి ఈ సినిమాకి ఉన్న సంబంధం చెప్పాలి. అది 1950 సంవత్సరం. సత్యజిత్ రాయ్ అప్పటికి ఇంకా సినిమాల్లోకి రాలేదు. అప్పటికి తను పని చేస్తున్న అడ్వటైజ్‌మెంటు కంపెనీ పని మీద, భార్యతో కలిసి మూడు వారాలు ఓడలో ప్రయాణం చేసి, లండన్ చేరుకున్నాడు. లండన్ వెళ్ళిన మూడు రోజుల తరవాత, “బైస్కిల్ థీవ్స్” సినిమా చూసాడు. ఎప్పటికైనా పథేర్‌పాంచాలి సినిమా తీస్తే, బైసికిల్ థీవ్స్ లాగా సహజంగా ఉండే లొకేషన్స్‌తోపాటు ఎవ్వరికీ అంతగా తెలియని నటీనటులతో తియ్యాలని నిర్ణయించుకున్నాడు.

ఆరు నెలలు పాటు రాయ్ లండన్లో ఉన్న కాలమంతా బైసికిల్ థీవ్స్ సినిమా చాలా బలమైన ముద్ర రాయ్ మీద వేసింది. అప్పటి ఉద్యోగానికి స్వస్తి పలకటానికీ, రాయ్ సినిమాల్లోకి రావటనికి ప్రేరణ ఈ సినిమా!

లక్ష్మన్న

2008-11-20 06:36 PM - Comments for ఈమాట

“ద్విభాజక విరోధాభాస” తెలుగు అవొచ్చేమో అనుకుంటే నవ్వొచ్చింది.

కామేశ్వర రావు గారు రాసింది:
{అలానే “అసత్యం కాదు” అని నిరూపించినా “సత్యమే”}

నాకు తెలిసి, ఇది మాత్రం కరెక్టు కాదు. అట్లా అనిపిస్తుందేమో, కాని కాదు. Do you remember, “Good Scientific Hypotheses Can NOT Be Proven Correct!” ఇది నాది కాదు, ఒక ఫిజిసిస్ట్ ఉవాచ :).

కొడవళ్ళ గారి వ్యాసం చదవాలంటే భయమేసి ఆగాను. కానీ ఈ చర్చ మాత్రం చదివాను. Please Continue.

అన్నట్టు కామేశ్వర రావు గారూ:

ఒకవేళ తాబేలు తానున్న చోటు నుండి అసలు కదలదు మెదలదు అనుకుందాం (కాలం అనే ఒక డైమెన్షన్ దాన్ని ఒక చోట ఉండనీయదు అనుకోండి.) “అకిలీసు” ఒక వేళ పడీ పడీ ఎంతో వేగంగా తిరుగుతుందే అనుకుందాం. అప్పుడు కూడా “అకిలీసు” తాబేలు ను దాటుకుని వెళ్ళే ప్రసక్తే ఉండదు. కాంతి (కాలం) వేగంతో పోటీ పడితే తప్ప అకిలీసు తాబేలును దాటే ప్రసక్తే ఉండదు. ఒక వేళ కాంతి వేగాన్ని గనుక అనుకరిస్తే అకిలీసు తమ మధ్య ఉన్న దూరాన్ని పెరక్కుండా చూసుకోగలదేమో. లేకపోతే తాబేలెప్పుడూ ముందే :) –[”ఎక్కడో ఒక చోట” లాంటి కండీషన్స్ వేరే చెప్పాలా!].

పార్వతి వినాయకుడిని తన చుట్టూ తిరిగి పందెం గెలవమనటానికి ఏదో ఒక కారణం ఉండి ఉండాలి, అవిడకి లెక్కలు వచ్చినా రాకపోయినా! Somehow, Indian Economists are vindicated against their western counterparts who argued in favor of a rapid pace in reforms comes to my mind too.

“ఏ రకంగా చూసినా అకిలీసు తాబేలుని చేరుతుందన్నది స్పష్టం.”

అన్నట్టు, ఇది అసత్యం అని ప్రూవ్ చేసినంత మాత్రాన నేను చెప్పిందే సత్యం అవదు కదా! ;)

విప్లవ్
P.S. పదేళ్ళ “ఈ మాట” ప్రజల బుర్రలకు పని పెట్టే యాగాన్ని కొనసాగించాలని కోరుకునే వాళ్ళలో నేనూ ఒకడిని.

2008-11-20 06:10 PM - Comments for ఈమాట

కామేశ్వర్రావు గారూ,

మీరు హనుమంతరావు గారు రాసిందే మళ్ళీ రాశారు. కొత్త పాయింటు రాయలేదు.

మీరు, ” రేసు మొదలయ్యాక, అకిలీసు Aనుంచి Bకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది కదా. ఈ సమయంలో తాబేలు కొంత దూరం పరిగెడుతుంది.” అని రాశారు. అకిలీసు A నించి B కి వెళ్ళాలి అని మొదలు పెట్టారు. దాని బదులు అకిలీసు C అనే చోటుకి వెళ్ళాలి అని మొదలు పెట్టండి. C అనేది B1 ని దాటి వుంది అని కూడా అనండి. అప్పుడూ అకిలీసు తాబేలుని చక్కగా దాటొచ్చు. మీరు ఎప్పుడూ తాబేలు వున్న పాత చోటుని ధ్యేయంగా తీసుకుంటున్నారు. అలా కాకుండా తాబేలు వుండబోయే కొత్త చోటుని ధ్యేయంగా తీసుకోండి. అప్పుడు అకిలీసు తప్పకుండా తాబేలుని చేరుకుంటాడు. ఈ సమస్యలో కావల్సినంత గందరగోళం తప్ప కావాల్సిన తర్కం కనిపించడం లేదు.

అయినా ఈ లెక్కలకి అసలు సిద్ధాంతం - “కొంత దూరం వెళ్ళాలంటే, ముందు అందులో సగం దూరం వెళ్ళాలి” అన్న దాంట్లోంచే ఈ గందరగోళం అంతా. అందుకే అబద్ధం ఆడాలి అని జోక్ చేశాను. ఈ గణితం ప్రకారం 50+25+12.25+… అన్నది ఎప్పుడూ 100 కాదు. 100 ని చేరుతుంది (అప్రోచెస్) మాత్రమే. మిగిలిన పాయింట్ల గురించి వేరే కామెంట్లో రాశాను.

మీ చిక్కు ప్రశ్న: అనంతాలని పోల్చకూడదని హనుమంతరావు గారు రాశారు కదా? మరి మీరు మమ్మల్ని పోల్చమంటారేం?

2008-11-20 05:21 PM - Comments for ఈమాట

సూర్యం గారికి,

ప్రతి నిర్దుష్టమైన భావనా, నిజమో కాదో అయిండాలి, మధ్యే మార్గం లేదు. ఇది అరిస్టాటిల్ సంఖ్యలకే కాదు, మానవ వివేచనకే మౌలికమని చెప్పాడు. ఉదాహరణకి, “సోక్రటీస్ మనిషి,” అన్న భావన నిజమో కాదో అయిండాలి. అటూ ఇటూ కాకుండా మధ్యన మరేదో కాలేదు. దీనిని law of excluded middle అంటారు.

అయితే దీనిని మీరన్నట్లే అందరూ అన్నివేళలా అంగీకరించరు. కేంటర్ సిద్ధాంతాలని ఖండించినది అందుకే. దీని గురించి వచ్చే సంచికలో వివరిస్తాను.

కొడవళ్ళ హనుమంతరావు

2008-11-20 04:29 PM dhavala - Comments for పొద్దు

Very nice story! Commendable job. ఎవరో చెయ్యి తిరిగిన రచయిత అనుకున్నాను కానీ, చివరలో చూసేసరికి, తొమ్మిదో తరగతి అమ్మాయి ఇంత చక్కగా రాయడం వాహ్, వాహ్, మీ నాన్నగారికి కూడా అభినందనలు…

[ఈ వ్యాఖ్యలోని వాక్యాలు RTS నుంచి తెలుగులోనికి మార్చబడ్డాయి. -సం.]

2008-11-20 04:09 PM - Comments for ఈమాట

హనుమంతరావు గారూ,

మీరు చెప్పిందంతా మీరు రాసిన వ్యాసం లోంచే అర్థం అయింది. ఇక్కడ అసలు ప్రశ్న ఇది:
“ఒక ఊహ తప్పు అని రుజువు చేస్తే, దానికి వ్యతిరేకం సరి అయినది అని ఊహించుకోవడం కరెక్టా అని”

ఇది అన్ని వేళలా సరి పోతుందా? ఇంతకీ సున్నా ప్రధాన సంఖ్యో, అప్రధాన సంఖ్యో చెప్పలేదు మీరు. సున్న కూడా ఒక సహజ సంఖ్యే కదా?

సున్నాని వదిలేసినా, మీరు ఇచ్చిన ఉదాహరణ సంఖ్యలకి సరిపోతుంది. కానీ ఈ పద్ధతి అన్ని విషయాల్లోనూ కరెక్టుగా వుంటుందా? అన్నింటిలోనూ, ఒక విషయమూ, దాని వ్యతిరేకమూ మాత్రమే వుంటాయా? ఒక విషయానికి మూడు విలువలు ఎప్పుడూ వుండవా? అలా వున్నప్పుడు, ఒక ఊహ తప్పు అని రుజువు చేస్తే, దాని వ్యతిరేకం కరెక్టు ఎలా అవుతుంది?

ఇదీ నా అసలు ప్రశ్న.

- సూర్యం

2008-11-20 12:59 PM - Comments for ఈమాట

సూర్యం గారు,
విరోధాభాసలు అర్థం లేనివిగా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. వీటిని నా మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తాను (హనుమంతరావుగారికి అభ్యంతరం ఉండదనే ధైర్యంతో).
మొదట అకిలీసు తాబేలు విషయం తీసుకుందాం. మీరు చెప్పినట్టు చూస్తే కచ్చితంగా అకిలీసు తాబేలుని దాటుతుంది, సందేహం లేదు (ఇది మనందరికీ ప్రత్యక్షమైన విషయం కూడాను).
అయితే, మీరు చెప్పినట్టు కాకుండా వేరే రకంగా (ఈ వ్యాసంలో చెప్పినట్టు) ఆలోచిద్దాం. అకిలీసు తాబేలు కన్నా వెనకన ఉంది (అకిలీసు A అన్న చోట, తాబేలు B అన్న చోట). రేసు మొదలయ్యాక, అకిలీసు Aనుంచి Bకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది కదా. ఈ సమయంలో తాబేలు కొంత దూరం పరిగెడుతుంది. అప్పుడు తాబేలు B1 దగ్గరకు చేరిందనుకుందాం. అకిలీసు మళ్ళీ Bనుంచి B1కి వెళ్ళాలి. దీనికి మళ్ళీ కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో మళ్ళీ తాబేలు B1నుంచి B2కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అకిలీసు B1నుంచి B2కి వచ్చేసరికి తాబేలు B2నుంచి B3కి, అకిలీసు B2నుంచి B3కి వచ్చేసరికల్లా తాబేలు B3నించి B4కి… ఇలా సాగుతునే ఉంటుంది. అంచేత అకిలీసు తాబేలుని అసలు చేరుకోలేదు కదా!
ఒకలా చూస్తే సాధ్యమై, మరోలా చూస్తే సాధ్యం కాదనీ అనిపించడమే విరోధాభాస. అంటే వైరుధ్యమున్నట్టు కనిపిస్తుంది, నిజంగా ఉండదు, ఉండడానికి వీల్లేదు. ఈ విరోధాభాస కలగడానికి రెండు కారణాలు: ఒకటి, మన లాజిక్కుకి ఆధారంగా మనం నమ్మిన సూత్రాలు(axioms) తప్పు కావచ్చు. రెండు మన లాజిక్కులో పొరపాటో (లేదా కీలకమైన విషయాన్ని విస్మరించడమో) ఉండవచ్చు.
యీ ఉదాహరణలో, మనం గుర్తించాల్సిన కీలకమైన విషయం B1నుంచి B2కి, B2నుంచి B3కి ఆ శ్రేణీలో వెళ్ళే కొద్దీ, వాటి మధ్యనున్న దూరం తగ్గుతూ పోతుంది. అంతే కాదు, కొంత సేపయ్యాక ఆ దూరం సున్నకి అతిదగ్గరగా వస్తుంది కూడా. అది మనం కొలవలేనంతగా సున్నకి ఎప్పుడైతే దగ్గరవుతుందో, అప్పుడు అకిలీసు తాబేలుని చేరుకుంటుందని మనం గుర్తిస్తాం. ఇప్పుడు ఏ రకంగా చూసినా అకిలీసు తాబేలుని చేరుతుందన్నది స్పష్టం. కాబట్టి వైరుధ్యం తొలిగిపోయింది. ఇది గణిత పరంగా ఈ విరోధాభాసకి పరిష్కారం. దీనికి మరోలా (తార్కికంగా) కూడా కొంతమంది పరిష్కారం చెప్పారు. అది ప్రస్తుతానికి అనవసరం.

రెండో విరోధాభాస కూడా ఇలాటిదే. అక్కడ కీలకం 50+25+12.25+6.125+3.625+… అన్నది 100కి సమానం అన్న విషయం. కాబట్టి ఆ రకంగా గెంతుతూ ప్రయాణించినా 100 మీటర్లు చేరుకుంటాం.

Proof by contradiction గురించి హనుమంతరావు గారు మళ్ళీ వివరించారు, అర్థమయ్యే ఉంటుంది. ఇందులోని గుర్తుంచుకోవలసిన కీలకమైన అంశం ఏవిటంటే, మన ప్రతిపాదన “సత్య”మైనా అవ్వాలి “అసత్య”మైనా అవ్వాలి. కాబట్టి “సత్యం కాదు” అని నిరూపించినా, “అసత్యం” అని నిరూపించినా ఒకటే. అలానే “అసత్యం కాదు” అని నిరూపించినా “సత్యమే” అని నిరూపించినా ఒకటే.

ఈ వ్యాసం పాఠకులందరికీ ఒక చిక్కు ప్రశ్న :)
పూర్ణ సంఖ్యల(Integers) సమితి సైజు వర్గ సంఖ్యల సమితి సైజు కన్నా చిన్నదా పెద్దదా సమానమా?

2008-11-20 12:42 PM దైవానిక - Comments for పొద్దు

కత్తి కంటే కలం పదును కదా అని “అతితెలివిగా” అలోచించాను అని ఇప్పుడు అర్థం అయ్యింది :) కచ్చితంగా క్షమార్హుడిని కాదు

2008-11-20 10:00 AM - Comments for ఈమాట

కధల పోటీకో, కవితల పోటీకో రాసేవాళ్ళ మనసుల్లో మొదట, ఆ పోటీ నడిపేవాళ్ళు ప్రకటించిన బహుమతులే మెదులుతూవుంటాయి. బహుమతి వొచ్చిన కధలు/కవితలు ఒక్కోసారి బావున్నా, స్వలాభాపేక్ష లేకుండా, సహజంగా రాసినట్టు పాఠకులకి అనిపిస్తుందా? మామూలుగా వొచ్చే పారితోషికం వేరు, బహుమతి వేరు. ఆశాజీవిగారి కవిత బావుంది అని వూరుకోవడంకన్నా, కవితలో చెప్పినట్టు పాఠకులే పోటీసంస్కృతిని రూపుమాపడానికి క్రుషి చెయ్యాలి. - భూషణ్

2008-11-20 06:43 AM - Comments for ఈమాట

Proof by Contradiction

సూర్యం గారికి,

నా వ్యాసాలు నచ్చాయని చెప్తే నాకు ప్రోత్సాహం కలుగుతంది. అర్థం కాలేదంటే, ముందు ముందన్నా ఎలా వివరించాలా అని ఆలోచన మొదలయి, అదీ ప్రోత్సాహాన్నే ఇస్తుంది. ఏ స్పందనా లేకపోతే, వీటివలన ఉపయోగమేమన్నా ఉందా అన్న సందేహం కలుగుతుంది. కాబట్టి మీరు మీ అభిప్రాయాలు నిష్కర్షగా చెప్తే లాభమే కాని ఏమాత్రం నష్టం లేదు. విరుద్ధ నిరూపణా విధానం అర్థం చేసుకోవడం అత్యవసరం కాబట్టి మరోసారి వివరించడానికి ప్రయత్నిస్తాను.

అసత్య ప్రతిపాదనలు వైరుధ్యాలకి దారి తీస్తే, వాటిని అసత్యాలు కావు అని అనడంలో వున్న ఔచిత్యం అర్థం కాలేదు,” అన్నారు. మళ్ళీ మీరే, “ఒక ప్రతిపాదన సత్యం అని ప్రతిపాదించి, అది వైరుధ్యాలకి దారి తీస్తే, అప్పుడు అది సత్యం కాదు అని అనొచ్చు. అది అర్థం అవుతుంది,” అన్నారు. నిజానికి ఈ రెంటికీ విధానంలో తేడా లేదు! రెండిట్లోనూ ఓ ఊహ (assumption) తో మొదలెట్టి ఓ వైరుధ్యాన్ని చేరుకున్నాం కనుక ఆ ఊహ తప్పు అని తీర్మానిస్తున్నాం. మనం నిరూపించదలచుకున్నదానికి వ్యతిరేకమైనదానిని ఊహ గా తీసుకోవడమే ఈ నిరూపణా విధానం.

దీనికి ఓ మంచి ఉదాహరణ ఇస్తాను. అందరూ, ముఖ్యంగా కవులు:-), చదవాల్సిన పుస్తకం, మన రామానుజన్ ప్రతిభ ప్రపంచానికి వెల్లడి చేసిన GH Hardy రాసిన “A Mathematician’s Apology,” లోనిది. నిరూపించి రెండు వేల ఏళ్ళు దాటినా చెక్కు చెదరని అందం, కొత్తదనం కలిగి, అందరికీ సులభంగా అర్థమయే సిద్ధాంత నిరూపణ అని Hardy దీనిని వర్ణించాడు.

సంఖ్యలు రెండు రకాలు: ప్రధాన సంఖ్యలు (prime numbers), అప్రధాన సంఖ్యలు (non-prime numbers). ప్రధాన సంఖ్యని అదీ, ఒకటీ తప్ప మరే సంఖ్యా నిశ్శేషంగా విభజించలేదు. ఉదాహరణకి 2, 3, 5, 7, 11. ప్రతి అప్రధాన సంఖ్యా (ఒకటిని మినహాయించి) కొన్ని ప్రధాన సంఖ్యలని గుణిస్తే వచ్చే ఫలితమే. ఉదాహరణకి 6 = 2 x 3, 8 = 2 x 2 x 2, 9 = 3 x 3, 10 = 2 x 5. అంటే ప్రతి అప్రధాన సంఖ్యనీ కనీసం ఒక ప్రధాన సంఖ్య అయినా నిశ్శేషంగా విభజిస్తుంది.

ప్రధాన సంఖ్యలు అనంతమా? కాదా? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, … ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. ఈ శ్రేణి అనంతంగా కొనసాగుతుందా? లేక కొన్ని సంఖ్యల తర్వాత అంతమవుతుందా? అనంతం అని ప్రతిపాదిద్దాం. ఇది నిజమో కాదో నిరూపించడం ఎలా?

అనంతం కాదు అనే ఊహతో మొదలెడదాం. అనంతం కాకపోతే, అన్నిటికన్నాపెద్దదైన ప్రధాన సంఖ్య ఒకటుండి తీరాలి. దానిని P అందాం. అంటే ప్రధాన సంఖ్యల శ్రేణి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, … P తో ఆగిపోతుంది. ఇప్పుడో కొత్త సంఖ్య Q ని తయారుచేద్దాం:
Q = (2 x 3 x 5 x 7 x 11 x 13 x 17 x …x P) + 1
అన్ని ప్రధాన సంఖ్యలనీ హెచ్చించి, ఫలితానికి ఒకటి కలిపితే వచ్చే సంఖ్య Q. ఈ కొత్త సంఖ్య P కంటె పెద్దది; కాని P ప్రధాన సంఖ్యలలో కెల్లా పెద్దది కావడాన, Q ప్రధాన సంఖ్య కాదు. అలాగని Q అప్రధాన సంఖ్య కాదు; ఏ ప్రధాన సంఖ్యా దానిని నిశ్శేషంగా విభజించలేదు - శేషం ఒకటి వస్తుంది కనుక! Q ప్రధాన సంఖ్యా కాదు, అప్రధాన సంఖ్యా కాదు! అది వైరుధ్యం. ఈ వైరుధ్యానికి దారి తీసినదేమిటి? ప్రధాన సంఖ్యలు అనంతం కాదు అన్న ఊహ. ఆ ఊహే తప్పు. అంటే ఆ ఊహకి వ్యతిరేకమైనది ఒప్పు. అనగా ప్రధాన సంఖ్యలు అనంతం అన్నది రుజువయింది!

కొడవళ్ళ హనుమంతరావు

2008-11-20 05:28 AM Subrahmanyam Mula - Comments for పొద్దు

చాలా బావుంది. ఈమాటలో ప్రచురితమైన నా కవిత “రెండు తీరాలు” గుర్తొచ్చింది.

2008-11-20 04:29 AM - Comments for ఈమాట

ఆశాజీవి గారూ,

మీ ఆక్రోశం బావుంది. కవితావేదనా నచ్చింది. కథల పోటీల ద్వారా మంచి కథలొస్తాయో లేదో తెలీదు. కొత్త కథకులు పుడతారో లేదో తెలీదు. సాహిత్యానికి ఏం ఒరిగినా, ఒరగక పోయినా పత్రికలకి ఏడాదికి సరిపడా ముడిసరుకు లభిస్తుంది. కథలకోసం ఎవరి వెంటా పడనవసరం లేదు. పాతికేళ్ళ క్రితం నాటి ( 1970 - 80 ల మధ్యకాలం ) నాటి కథలపోటీలకీ, ఇప్పటి కథల పోటీలకీ, కథల పరంగానూ, బహుమతులు పంచే తీరులోనూ చాలా తేడా ఉంది. కథల నాణ్యత పడిపోయినంత వేగంగానూ ఇవన్నీ పడిపోయాయి. చాలా కాలం నాటి మాట. ఆంధ్రప్రభలో చివుకుల పురుషోత్తం ” ఏది పాపం?” నవలకి మొదటి బహుమతి ఇస్తే అది ప్రధమ బహుమతికి ఎంపిక ఎందుకు చేసారో మూడు పేజీల సమీక్ష రాసారు. అదే ఆంధ్రప్రభ ( యాజమాన్యం మారారులెండి ) రెండేళ్ళ క్రితం కథల పోటీలో బహుమతిచ్చిన కథలు నాసిరకం కన్నా హీనంగా ఉన్నాయి. పైగా పేరుమోసిన రచయిత ( త్రు ) లూ (అందులో ఒకరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడా ) ఆ పోటీకి గుణనిర్ణేతలు. వచ్చిన చెత్తలోంచి మంచి చెత్తని ఏరి మనముందు పోసారంతే! ఆ కథల్లో కథనం లేదు. శిల్పం లేదు. పాత్రోచితం అంతకన్నా లేదు. కేవలం వస్తువు ఆధారంగా బహు”మతులు” ఇచ్చారు. దళిత పీడిత కథకొకటీ, స్త్రీల సమస్యలకొకటీ, ప్రాంతీయతత్వానికొకటీ, గ్లోబలైజేషన్ ప్రభావం మీదొకటీ ఇలా అన్ని వస్తువులూ ఏరారు. రాశి తప్ప వాసి లేదంటూ సరిపుచ్చుకున్నారు. ఇలాంటివాటినెవరూ ప్రశ్నించరు! అడిగితే వచ్చే జవాబు తెలుసు. ఆంధ్రభూమి వాళ్ళు ఏటా ఉగాది కథల పోటీ పెడతారు. ఎందుకొచ్చిన పోటీలనీ ఆ పత్రిక సంపాదకులతో అంటే - ఎవరి వెంటా పడనవసరం లేకుండా ఈ పోటీ ద్వారా మాకు ఏడాదికి సరిపడా కథలొస్తాయంటూ నిజాయితీగానే చెప్పారు. మీరు ఓ విషయం్ గమనించారో లేదో తెలీదు. గత అయిదేళ్ళగా కథల పోటీలు చూస్తే అవే రచయితలు అన్ని పోటీల్లోనూ బహుమతులు కొట్టేస్తున్నారు. నిజాయితీ, నిబధ్దతా అందరికీ లోపిస్తోంది. మనం ఎంత గట్టిగా అరిచినా వారి చెవుల్ని చేరదు. ఆ మధ్య విపుల వాళ్ళు కథల పోటీ పెట్టారు. అందులో మొదటి బహుమతొచ్చిన “అతడు మనిషి” అనే కథ నిజంగా మొదటి బహుమతికి అర్హతున్న కథ. మిగతా కధలు షరా మామూలే! ఇలాంటి పోటీల ద్వారా మంచి కథలొస్తాయనుకోడం మన వెర్రితనం అంతే! పత్రికలు పదికాలల పాటూ నడుపుకోడానికిదొక పద్దతి. ఎంతకాదన్నా ప్రస్తుతం జరుగుతున్నదిదే! గొంతు చించుకొని ప్రయోజనం లేదు.

2008-11-20 03:01 AM - Comments for ఈమాట

“అర్థమశాశ్వతమ్ము” అనే ఉత్పలమాల వెయ్యేళ్ళ కింద శిలాశాసనం లో కాక, మూడేళ్ళ కింద “ఈ మాట” లోనో ఇంకో చోటనో ఎవరైనా వ్రాసివుంటే దానికి ఏ మాత్రం ప్రాముఖ్యం వచ్చేది అని సందేహం. శిలపైన కాబట్టి నిలిచింది కాని, జనాల నాలుకపై అది ఇంత పాతది అని చెప్పినా కూడా నిలుస్తుందా అని చెడ్డ అనుమానం. ఏదో మనకూ పాత పద్యాలున్నాయి, vintage wine లాగా అని చెప్పుకోవడానికి తప్ప, ఒక్కరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా దీనిని ఉదహరించి ఉటంకించే అవకాశం ఉంటుందా అని కూడా అనుమానమే.

ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. అటువంటి సందర్భమే వస్తే, పద్యమే చెప్పవలసి వస్తే దీన్ని వదిలి “కారే రాజులు రాజ్యముల్ గెలువరే.. వారేరీ సిరి మూటాగట్టుకొని పోవంజాలిరే..” లాంటి వెన్నో రసవంతమైన, బలవంతమైన వి స్ఫురిస్తాయి కాని ఇది తట్టుతుంది అనే ఆశ మాత్రం లేదు. కాదంటారా?
——-
విధేయుడు
-Srinivas

2008-11-20 01:39 AM సుజాత(మనసులో మాట) - Comments for పొద్దు

చ్చాలా ఖష్ఠంగా ఉందండి సత్యసాయి గారు!

2008-11-20 01:35 AM సుజాత(మనసులో మాట) - Comments for పొద్దు

34 అడ్డం తప్పు అర్థమైంది. దానివల్ల 33 నిలువు కూడా చెడినట్టుంది.నా మిగిలిన మరో తప్పేదో తెలీడం లేదు! అనగా గుర్తు లేదు. సమాధానాలు చూస్తే సరిగ్గా రాశాననే అనిపిస్తోంది. దయచేసి చెప్పగలరు.

2008-11-19
2008-11-19 11:36 PM - Comments for ఈమాట

మీ వ్యాసం చదువుతుంటే, ఎన్నెన్నో సందేహాలు, ఎన్నెన్నో మాటలు.
అన్యధా భావించరనే భావిస్తూ, బుర్రలో అనిపించినవి రాస్తున్నాను మీకు తెలియాలని.

ద్విభాజక విరోధాభాస (ఏం తెలుగు పదాలు బాబూ, నోరు తిరిగటం లేదు సరిగా) గురించి చదివాను. మీరు రాసిన సూత్రం, “చలనంలో ఉన్న వస్తువేదైనా తన గమ్యాన్ని చేరుకోవడానికి గమ్యానికి గల దూరంలో సగం దూరం ముందు ప్రయాణించాలి. ” అర్థమయింది. అలాగే 100 మీటర్లు ప్రయాణించాలంటే వచ్చే అనంత శ్రేణి 50+25+12.25+6.125+3.625+… కూడా అర్థం అయింది. ఇది ఎంత థియరిటికలో కూడా అర్థం అయింది.

దీని ప్రకారం 100 మీటర్లు ఎప్పుడూ చేరలేము. కానీ చేరాల్సిన చోటు 200 మీటర్లు అని మొదట అబద్ధం ఆడాలి. అందులో సగం 100 మీటర్లు పూర్తవగానే, “తూచ్చి” అని చెప్పి ఆగిపోవాలి. ఈ ప్రకారం ఈ థీరీ కూడా కరెక్టే, మనం నిజంగా గమ్యం చేరడం కూడా కరెక్టే. ఒక థీరీ అనేది సరైన చోట సరైన విధంగా అన్వయించకపోతే, ఎంత గందరగోళంగా వుంటుందో అర్థం అవుతోంది.

- సూర్యం

2008-11-19 07:49 PM - Comments for ఈమాట

మీరు “గమన విరోధాభాస” గురించి రాసింది ఏమీ అర్థం కాలేదు. అందులోనూ అకిలీసూ, తాబేలూ వుదాహరణ మరీనూ.

అకిలీసూ, తాబేలూ వేర్వేరు స్థిర వేగాలతో ప్రయాణం చేస్తున్నారనుకుందాం మీరు చెప్పినట్టుగానే. వుదాహరణకి అకిలీసు నిమిషానికి 100 అడుగుల స్థిర వేగంతోనూ, తాబేలు నిమిషానికి 10 అడుగుల స్థిర వేగంతోనూ నడుస్తున్నారనుకుందాం. వారి