2009-01-07
రచన - The Creation: Cobian Backup - డాటా బ్యాక్ అప్ టూల్
2009-01-06
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి (General Knowledge in Telugu on current Events): ఇజ్రాయిల్ (Israel)
తియ్యనితెనుగు: సినిమా హాల్లో జాతీయ గీతం..ఆసాంతం లేచి నిలుచున్న ప్రేక్షకులు..
సినిమా హాల్లో జాతీయ గీతం..ఆసాంతం లేచి నిలుచున్న ప్రేక్షకులు..
స్థలం : పంచ్ శీల్ సినిమా, నాగ్ పూర్, మహారాష్ట్ర
తేది: 6, జనవరి , 2009. 3.00 pm
చిత్రం: రబ్ నే బనాదీ జోడి..
చిత్రం మొదలవ్వటానికి ముందుగానే లోపలికి వెళ్ళి కూర్చున్నాను..
ట్రైలర్ నడుస్తోంది. ఇంకొక ట్రైలర్ మొదలయ్యేటట్లనిపించింది.
National Anthem అని కనిపించగానే అందరూ ఒక్కసారిగా లేచి నిల్చున్నారు.
వెండితెర పై రెపరెపలాడుతున్న త్రివర్ణపతాకం.. వినిపిస్తున్న ‘జన గణ మన” జాతీయగీతం. క్రింద తరగతి నుండి బాల్కనీ దాకా అందరూ, ఆఖరికి చంటి పిల్లలని ఎత్తుకొని కూడ శ్రద్ధగా నిలుచున్న తీరు,ఏ మాత్రం కదలకుండా , జాతీయ గీతం పూర్తి అయిన తరువాతే కూర్చోవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

జాగృతి: విజయవాడ 20 వ పుస్తక ప్రదర్శన లొ ‘e-తెలుగు’ సందడి
'అంతర్యానం': విగతజీవి
రచన - The Creation: ఆడియో క్యాసెట్ టేపులను కంప్యూటర్ లేదా సీడీ లలోకి మార్చటానికి....
2009-01-05
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి (General Knowledge in Telugu on current Events): చెన్నై ఓపెన్ (Chennai Open)
తెలుగురథం: నాదబ్రహ్మయోగి - కాకర్ల త్యాగరాజు వర్థంతి
మీరు చదివారా?: మారకపోతే మరుగున పడతాం!
ఒక పిట్టకథలాంటి కథనం లక్షలాది ప్రతులు అమ్ముడుపోయింద0టే విడ్డూరమే. డాక్టర్ స్పెన్సర్ జాన్సన్ రాసిన చిన్న పుస్తకం ‘హూ మూవ్డ్ మై ఛీజ్?’ ఒక్క అమెరికాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రతి ఆదివారం ప్రచురించే బెస్ట్ సెల్లర్స్ లిస్టులో బిజినెస్ విభాగంలో దాదాపు ఐదేళ్లపాటు నిలిచిందంటే ‘పిచ్చి అమెరికన్లు’ అనుకోగలం. ‘అమెరికా కామెడీ అర్థమైతేనే గాని నవ్వలేం’ అనుకోగలం. కాని చైనాలో కూడా రెండు మిలియన్ కాపీలకు పైగా అమ్ముడుపోయిందంటే అందులో ఎంతో కొంత విషయముందనే అర్థం. నేనేమీ చైనా భక్తుడిని కాను గానీ, ఇదే పుస్తకం ఇండియాలో వెర్మిలియన్ ప్రచురణ సంస్థ కూడా లక్షల ప్రతులు అమ్మిందంటే మనం కూడా ఈ పుస్తకాన్ని సీరియస్ గానే తీసుకోవచ్చు. ఈ వారం “హూ మూవ్డ్ మై ఛీజ్?” పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.
ఛీజ్ అంటే దూడను కన్న కొద్దిరోజులపాటు గేదె లేదా ఆవుపాలతో తయారుచేసే జున్ను. ఈ చిన్న పుస్తకంలో జున్ను ఒక ప్రతీక. మనం పొందాలనుకుంటున్న ఉద్యోగానికి, కొనాలనుకుంటున్న వస్తువులకు, నిలుపుకోవాలనుకుంటున్న సంబంధానికి ప్రతీక. జున్నును పెద్ద ఎత్తున చేసేవారు దానిని జాలీ(మేజ్)ల్లో ఉంచుతారు. ఆ మేజ్ ను అనేక దార్లున్న పజిల్ గా రచయిత ఈ నవలలో చూపిస్తాడు. ఆ మేజ్ మనం ప్రస్తుతమున్న పరిస్థితులకు ప్రతీక. నవలలో వుండే నాలుగు పాత్రలూ మనకు ప్రతీకలు. ఆ నాలుగు పాత్రలూ మనలో ప్రతి ఒక్కరిలోనూ నాలుగు భాగాలుగా వుంటాయి. కొన్ని తత్వాలు కొన్ని పరిస్థితుల్లో బయటపడుతూ వుంటాయి.
స్నిఫ్, స్కరీ అనే రెండు ఎలకలు, హెమ్, హా అనే పేర్లున్న ఇద్దరు లిల్లీపుట్ మనుషుల్లాంటి జీవాలు ఒక పెద్ద మేజ్ లో నివశిస్తుంటాయి. ఎలకలు ఒక గుంపుగా, లిటిల్ పీపుల్ మరో జట్టుగా ఆ చోటులో జున్నుకోసం వెతుకుతుంటాయి. జ్ఞానం పెద్దగాలేని ఎలకలు ఒద్దికగా వచ్చిన దారిని గుర్తుపెట్టుకుంటూ మొత్తానికి జున్నువున్న చోటును పసిగడతాయి. త్వరలోనే హెమ్, హాలు కూడా అక్కడకు చేరుకుంటారు. ఎలకలు పెందలకడనే ఆ ‘ఛీజ్ స్టేషన్ సి’ని చేరుకుని, బూట్లు లేసులతో దగ్గరగా కట్టుకుని మెడలో వేసుకుంటాయి. మిగతా ఇద్దరూ బూట్లు ఎటో విసిరేస్తారు.
ఒకరోజు తెల్లవారి నలుగురూ జున్ను తిందామని వెళ్ళేసరికి జున్ను వుండదు. మాయమైపోతుంది. స్నిఫ్, స్కరీలు పెద్దగా ఆశ్చర్యపోవు. ఈ మధ్య కాలంలో జున్ను పరిమాణం, రుచి తగ్గడం గమనిస్తాయి. ఏదో ఒకరోజు జున్ను లభ్యం కాదని ముందే పసిగట్టి వెంటనే ఇంకెక్కడ జున్ను దొరుకుతుందోనని వేటకు బయల్దేరి వెళ్లిపోతాయి. కానీ తాము రోజూ జున్ను తినే చోట ఖాళీగావుండడం చూసి హెమ్, హాలిద్దరూ నివ్వెరపోతారు. ఇద్దరూ కోపంతో చిందులు తొక్కుతారు. విసుక్కుంటారు. తమ జున్ను ఎవరో దొంగలించారని గట్టిగా అరుస్తారు. ఇక్కడ వుండాల్సిన జున్ను ఎటు పోయిందని ఆందోళన చెందుతారు. మొత్తానికి ఆ రోజంతా ఆకలితోనే గడుపుతారు.
బయటకు వచ్చిన స్నిఫ్, స్కరీలు వెతుక్కుంటూ వెతుక్కుంటూ కొత్త ప్రదేశం ఛీజ్ స్టేషన్ ఎన్ చేరుకుంటాయి. తాజా జున్ను దొరుకుతుంది. కాని, ప్రతిరోజూ జున్ను తినేముందర క్షుణ్ణంగా పరిస్థితులను పరిశీలిస్తుంటాయి. కాని లిటిల్ పీపుల్ ధోరణి మారదు. ఇంకా ఎవరో అదేచోటులో జున్నును పెడతారని ఆశరో ఎదురుచూస్తుంటారు. ఆకలికి తాళలేక హా అక్కడనుంచి బయటపడతానని చెప్తుంది. కాని, అందుకు హెమ్ ఒప్పుకోకపోవడమే గాక భయపెట్టేసరికి హా వెనకడుగేస్తుంది. కొద్ది రోజులు గడిచినా అక్కడికి జున్ను రాదు. ఆకలికి తట్టుకోలేక ధైర్యం తెచ్చుకుని హెమ్ ను విడిచిపెట్టి హా బయల్దేరుతుంది. ఆ మేజ్ లో ఒంటరిగా తిరగడానికి హా భయపడుతుంది. జున్నులేని చోట ఆకలితో పడివుండడం కంటే జున్ను దొరికినా దొరకకపోయినా జున్నుకోసం వెదుకులాట జరపడంలోనే ఆనందం వుందని తెలుసుకుంటుంది. ఒక దగ్గర జున్ను అవశేషాలు హాకు కనిపిస్తాయి. అంటే కొంచెం ముందుగా వస్తే జున్ను దొరికేది కదా అని గింజుకుంటుంది. మరింక ఆపకుండా తన అన్వేషణ కొనసాగిస్తుంది. అయితే మలుపు తిరిగిన ప్రతిచోటా, తన మిత్రుడు హెమ్ వస్తే ఆనవాలు కోసం, గోడలమీద కొన్ని వాక్యలు రాస్తుంది. ప్రతి వాక్యం ఛేంజ్ మేనేజ్ మెంట్ లో ఎంతో విలువైనదిగా, అక్కరకొచ్చేదిగా కనిపిస్తుంది.
రెండు మూడు సార్లు హాకు జున్ను అవశేషాలు దొరుకుతాయి. అందులో కొన్ని మిగులు ముక్కలు పట్టుకుని హెమ్ దగ్గరకు వెళ్లి, తనతోపాటు కొత్త ప్రదేశపు అన్వేషణకు రమ్మంటుంది. ఆ కోరికను హెమ్ తిరస్కరిస్తుంది. దాంతో తిరుగుముఖం పట్టిన హా కొద్ది రోజులకే కొత్త ప్రదేశాన్ని కనుక్కుంటుంది. అక్కడ తాజా జున్ను అపరిమితంగా దొరుకుతుంది. తన అన్వేషణ ఇప్పటికి ఫలించింది. కాస్త జున్ను ఆబగా తిని, ఆకలి తీర్చుకుని, అక్కడ ఎదురుగా కనిపించిన పెద్ద గోడమీద మరికొన్ని వాక్యాలు రాస్తుంది. అవి ఇవీ:
మార్పు తప్పక సంభవిస్తుంది.
వాళ్లు జున్నును మారుస్తూనే వుంటారు.
మార్పును వూహించు.
జున్ను ఏదో ఒకరోజు అదృశ్యమైపోతుందని తెలుసుకో.
మార్పును క్షుణ్ణంగా పరిశీలించు.
అప్పుడప్పుడు జున్ను రుచిలో మార్పు పసిగడితే, పాడైందే లేనిదీ తెలుస్తుంది.
మార్పుకు అనుగుణంగా త్వరగా మారాలి.
పాత జున్ను ఎంత వేగం అయిపోతే, అంత తొందరగా కొత్త జున్ను రుచి చూడొచ్చు.
మారాలి.
జున్ను కోసం కదలాలి.
మార్పును ఆనందంగా అనుభవించాలి.
సాహసం సేయరా డింభకా! రాకుమారి లభించును.
త్వరితంగా మారడానికి సిద్ధపడండి. మళ్లీ మళ్లీ ఆ ఆనందం పొందండి.
వాళ్లి జున్నును మారుస్తూనే వుంటారు.
గత అనుభవం నుంచి పాఠం నేర్చుకున్న హా ప్రతిరోజూ కొత్తగా జున్ను లభించిన ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెడుతుంది. అక్కడ అప్పటికే స్నిఫ్, స్కరీలు వుండడాం చూసి హా ఆశ్ఛర్యపోదు. ఇదిలావుండగా ఒకరోజు అక్కడ ఏదో అలికిడి అవుతుంది. ఎవరో అక్కడకు వస్తున్నట్టు వారికి అనిపిస్తుంది. ఆ వచ్చేది హెమ్ అయితే బావుండునని హా మనస్పూర్తిగా భావిస్తుంది. ఎవరు వచ్చారో రచయిత చెప్పరు. కథ అక్కడితో ఆగిపోతుంది.
ఈ చిన్న పుస్తకంలో మూడు అధ్యాయాలున్నాయి. మొదటి అధ్యాయంలో కథకుడు తన చిన్ననాటి హైస్కూల్ మిత్రులను ఒక చోట కలుసుకుంటాడు. అందరూ తమతమ జీవితాలలో జరిగిన మార్పులను ముచ్చటించుకుంటారు. అతడి స్నేహితులలో ఒకరు ఈ కథ చెప్పడం మొదలుపెడతారు. రెండో అధ్యాయమంతా పైన చెప్పుకున్న కథ వుంటుంది. ఇక మిగిలిన మూడో అధ్యాయంలో మళ్లీ స్నేహితులంతా తమ జీవితంలో మార్పు చెందాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు ఎలా ప్రవర్తించారో గుర్తుకు తెచ్చుకుని తమ స్నేహితులకు చెప్తుంటారు. అంటే ఛీజ్ కనిపించక అదృశ్యమైనప్పుడల్లా ఆ నాలుగు పాత్రలలో దేనిలా ప్రవర్తించారో చర్చించుకుంటారు.
మొదట 1998లో విడుదలైన ఈ పుస్తకం అమ్మకాలలో సంచలనం సృష్టిస్తుండగా రచయిత ఇదే కథను స్వల్ప మార్పులతో పిల్లలకు, యుక్తవయస్సు వారికి రెండు పుస్తకాలు విడిగా రాశాడు. దీనిని ప్రేరణగా తీసుకుని మరికొంతమంది రచయితలు మరెన్నో పుస్తకాలు రాశారు. ఉదాహరణకు మన తెలుగు సినిమాల పేర్ల విషయంలో ఒకసారి దొంగ హిట్టయితే అడవిదొంగ, మంచిదొంగ, జేబుదొంగ, దొంగలకు దొంగ, దొంగమొగుడు లాంటి టైటిల్స్ ఎన్నో వచ్చినట్లు ఛీజ్ టైటిల్స్ కూడా ఈ మధ్య మార్కెట్ ను ముంచెత్తాయి. ఉదాహరణకు ‘కెన్ ఐ మూవ్ యువర్ ఛీజ్?’, ‘నో మోర్ ఛీజ్’, ’హూ డేర్స్ టు మూవ్ మై ఛీజ్?’ లాంటివెన్నో పుస్తకాలొచ్చాయి. ఇక చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించినప్పుడు, కొన్ని విభాగాలు మూసేసినప్పుడు ఈ పుస్తకాన్ని పెద్ద సంఖ్యలో పంచిపెట్టడం, కార్మికులను మానసికంగా సన్నద్ధం చేయడానికి ప్రయత్నించడం వివాదాస్పదమైంది.
ఏది ఏమైనా మార్పునకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోకపోతే మరుగున పడిపోవడం ఖాయమని హెచ్చరించే ఈ పుస్తకం యువతరం తప్పక చదవాల్సిన పుస్తకం. చాలా నెమ్మదిగా చదివినా అరగంటలోపే ముగించగలిగే ఈ పుస్తకం పిడిఎఫ్ ఫైల్ చదవాలనుకునేవారు నా మెయిల్ ఐడికి ఉత్తరం రాసి ఉచితంగా తెప్పించుకోవచ్చు.
“హూ మూవ్డ్ మై ఛీజ్?” (డాక్టర్ స్పెన్సర్ జాన్సన్)
వెర్మిలియన్ ప్రచురణ, పేజీలు 96, వెల రూ. 150.
Posted in నవల
2009-01-04
తెలుగు పద్యం: బెంగుళూరులో శ్రీ గరికిపాటి నరసింహారావుగారి అష్టావధానం
వేణుగానం: మంచి పుస్తకం-Power, Seduction and War (by Robert Greene)
సాధారణంగా ‘లౌక్యం, వ్యవహార దక్షత లాంటి విషయాలనూ, ఎత్తుకు పై ఎత్తు వేసే నైపుణ్యం, వ్యూహ ప్రతివ్యూహాలను పన్నే చాణక్యం.. వంటి విషయాలనూ మాటలలో వివరించడం సాధ్యంకాదు. వాటిని స్వయంగా, అనుభవపూర్వకంగా ఎవరికివారు తెలుసుకోవలసినదే’ అనే అభిప్రాయం ఉన్నది. కానీ రాబర్ట్ గ్రీన్ (Robert Greene) అనే అమెరికన్ రచయిత చాలా నేర్పుగా, అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లుగా ఆ పరిజ్ఞాన్నంతా మనకు బోధించాడు. Power, Seduction, War అంటూ ఈయన ఆ పరిజ్ఞానాన్నంతా మూడు విభాగాలుగా చేశాడు. ఒక్కొక విభాగానికి ఒక్కొక గ్రంథం చొప్పున మూడు గ్రంథాలు రచించాడు.
మొదటి విభాగమైన Power గురించి వివరించడానికి The 48 Laws of Power అనే గ్రంథం రాశాడు. మనం ఎదుటివారి మీద upper hand సాధించడానికి ఏ విధమైన లక్షణాలను కలిగి ఉండాలి, ఏవిధంగా వ్యవహరించాలి అనే విషయాలను మొత్తం 48 సూత్రాల రూపంలో పొందుపరస్తూ ఈ పుస్తకం రాశాడు.
రెండవ గ్రంథం The Art of Seduction. ‘వశీకరణం’- అంటే ఎదుటిమనిషిని లోబరచుకోవడం- గురించి దీనిలో చర్చించాడు. Sex, Wealth, Power or Favor.. ఇలాంటి వాటిని ఎదుటివారి నుండి పొందటం కొరకు ఏ విధమైన పద్దతులను అవలంబించాలో, ఎలా ప్రవర్తించాలో ఇందులో విపులంగా వివరించాడు.
ఇక మూడవ గ్రంథం The 33 Strategies of War . మన ప్రత్యర్థిని అమాయకుడిగా, మన victim గా భావిస్తూ The 48 Laws of Power ను రూపొందించడం జరిగినది. కానీ మన ప్రత్యర్థి మనలాగే Power Player అయిన పక్షంలో అతని మీద మనం ఏ విధంగా upper hand సాధించాలి అనే దాన్ని వివరించడానికి ఈ The 33 Strategies of War అనే గ్రంథం రాశాడు.
ఈ మూడు గ్రంథాలూ సాధారణమైన వ్యక్తిత్వ వికాస గ్రంథాల్లా ఉండవు. పాజిటివ్ యాటిట్యూడ్, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్ ..ఇలా ఉండదు వివరణ. చరిత్రలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడిన నియమాలు, సూత్రాలతో (Laws and Principles) వివరణ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. These all principles are timeless and ruthless.
ఇవి శ్రీరంగ నీతులు అసలేకావు. పైగా అందుకు విరుద్ధమైనవి. సాధారణంగా మంచితనం, మానవత్వం, నిజాయితీ, మర్యాద-మన్నన, సత్యవాక్పరిపాలన, అపకారికి కూడా ఉపకారం చేయడం.. ఇలాంటి “సలక్షణాల”ను మనం ఉన్నత విలువలుగా భావిస్తుంటాం. కానీ ఈ గ్రంథాలు చదివిన తరువాత ఈ లక్షణాలన్నీ మనలను ఏ విధంగా బలహీనులుగా మారుస్తున్నాయో; మనలోని ఈ విధమైన లక్షణాలను ఆసరాగా చేసుకుని కొందరు ఏ విధంగా మన మీద పెత్తనం చెలాయిస్తున్నారో కొందరైతే మనలను ఏ విధంగా అణచివేతకు గురిచేస్తున్నారో, ఏ విధంగా మన వినాశనానికి కారణమౌతున్నారో మనకు బోధపడుతుంది.
రచయిత మనకు బోధించే విషయాలు ఒక్కోసారి కుట్రలు, కుతంత్రాల రూపంలో ఉంటాయి. కానీ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. మనం ఉన్నత విలువలు అని వేటినైతే భావిస్తున్నామో అవి నిస్సందేహంగా ఉన్నతమైనవే. కానీ అవి సత్తెకాలంలో మాత్రమే ఆచరించదగినవి. కుట్రపూరితమైన నేటి కాలంలో అవి మనలను బలి పశువులుగా మార్చడానికి తప్ప దేనికీ పనికిరావు. శ్రీరంగనీతుల నుండి ఒక్కక్షణం బయటపడి వాస్తవికతతో ఆలోచిస్తే మనకు బోధపడే విషయం ఇదే. ముఖ్యంగా సత్తెకాలపు శ్రీరంగనీతులు ఉన్నత విలువలుగా భావించబడే భారతదేశంలో ఈ గ్రంథాల పఠనం అత్యంత ఆవశ్యకం.
గుంటనక్కలు, తోడేళ్ళు సంచరించే ఈ లోకంలో మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇటువంటి మర్మాలేవీ తెలియకుండా అంతా భగవంతుడే చూసుకుంటాడనుకునే భక్తితత్త్వ ధోరణితో అమాయకంగా ఉంటే మంచివాళ్ళం అనిపించుకుంటామేమోగానీ ఆ మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేసేవారికి మనం బలైపోకుండా మనలను ఆ భగవంతుడుకూడా రక్షించలేడు.
The Art of Seduction గ్రంథంలో సాధారణ సభ్య సమాజం అంగీకరించని ఎత్తుగడలను రచయిత చాలా వాటినే వివరిస్తాడు. అయితే మనం ఈ విషయాలన్నింటినీ తెలుసుకునేది వాటిద్వారా అమాయకులను బలితీసుకోవాలని కాదు. స్వయంగా మనం ఈ గుంటనక్కలు, తోడేళ్ళ బారిన పడి బలై పోకుండా డిఫెన్స్ చేసుకోవడం కోసం మాత్రమే. అందుకొరకైనా మనం వాటి గురించిన పరిజ్ఞానం పొందాలి. మనకు ఇంకా అవకాశం ఉంటే మనలను మనం రక్షించుకోవడమే కాకుండా అమాయకులెవరైనా ఈ తోడేళ్ళబారిన పడకుండా రక్షించనూవచ్చు. ఆ విధంగా మనం హీరోగా కూడా మారవచ్చు. అంటే ‘హీరో’ అవాలంటే ముందుగా ‘విలనీ’ ని అధ్యయనం చేయాలి. లేదంటే ఎవరో ఓ విలన్‌కు బలైపోయి మనలను రక్షించే హీరో కోసం ఎదురుచూసే అమాయక, అనామక victim గా మిగిలిపోక తప్పదు.
ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మూడు పుస్తకాలనూ కూడా రచయిత కొన్ని సూత్రాల లేక నియమాల (Laws and Principles) విపులీకరణ రూపంలో రచించాడు. ఆ నియమాలన్నింటినీ సాధారణ చరిత్ర గ్రంథాలలో లభ్యంకాని అనేక సూక్ష్మ చారిత్రక ఘటనల ద్వారా వివరిస్తూ, అనేక మంది చారిత్రక వ్యక్తులను పరిచయంచేస్తూ, వారి గుణగణాలనూ, వారి వ్యూహ ప్రతివ్యూహాలనూ, ఎత్తుగడలనూ, వారు జీవితంలో సాధించిన విజయాలనూ, పొందిన వైఫల్యాలనూ, వాటికి కారణాలనూ అత్యంత ఆసక్తికరంగా విపులీకరించాడు.
Robert Green ఈ గ్రంథాలలో కొంచెం High Standard English వాడాడు. సాధారణ వాడుకలో లేని క్లాసికల్ వర్డ్స్ అక్కడక్కడా కనిపిస్తాయి. నావరకూ నాకు dictionary అవసరమైనది. డిక్షనరీ ఉన్న CD ని PC లో open చేసుకుని ఈ పుస్తకాలు మూడింటినీ నేను చదివాను.
ఒక్కొక్క పుస్తకం షుమారు 450 పేజీలు ఉంటుంది. ఒక్కొక్క దాని ఖరీదు షుమారు Rs.400/- ఉంటుంది. The 48 Laws of Power కు, The Art of Seduction కు concise editions కూడా ఉన్నాయి. వాటి ఖరీదు ఒక్కొక్కటి Rs.125/-
నాకు తెలిసినంతవరకూ ఈ గ్రంథాలకు పైరేటెడ్ కాపీలు లేవు. కనుక పుస్తకాలు కారు చవకగా దొరికే మన అబిడ్స్ సండే మార్కెట్లో ఇవి దొరకక పోవచ్చు. హైదరాబాద్‌లో అయితే హిమాలయా బుక్ షాప్ వంటి చోట్ల దొరుకుతాయి. వైజాగ్ లో అయితే పేజెస్, జ్యోతి, గుప్తా బ్రదర్స్, బుక్ సెంటర్, వాగ్దేవి లాంటి చోట్ల దొరుకుతాయి. ఇవి విశాలాంధ్రలో కూడా దొరుకుతున్నాయి.
ఈ గ్రంథాలను చదవడం ద్వారా తెలుసుకున్న విషయాలతో పోలిస్తే వీటిని కొనడానికి మనం పెట్టిన డబ్బు, చదవడానికి మనం పడిన శ్రమ, కేటాయించిన సమయం చాలా స్వల్పమే అని గ్రహిస్తారు. ఈ పుస్తకాలను చదివిన తరువాత మీరు ఒక చాణక్యుడు, ఒక మాకియవెల్లి, ఒక sun-tzu అయిపోతారంటే నమ్మండి. :b.
Posted in Uncategorized
2009-01-03
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి (General Knowledge in Telugu on current Events): శ్రీలంక (Srilanka)
2009-01-02
గడ్డిపూలు: ఒక్క మాట !
తెలుగురథం: హరికథా పితామహ - ఆదిభట్ల నారాయణదాసు గారు - వర్థంతి
తెలుగురథం: అభ్యుదయ కవితా యుగ ప్రయోక్త - మహాకవి శ్రీ శ్రీ జయంతి
మీరు చదివారా?: పదో వారం చదువు ముచ్చట్లు చావా కిరణ్ కుమార్‌తో…
2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?
3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?
4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?
5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.
6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?
7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?
8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?
9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?
10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

2009-01-01
రచన - The Creation: Google లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ మరియు ట్రాన్స్ లిటెరేషన్ వెబ్ సైట్లు...
క ళా స్పూ ర్తి: బ్రతుకు నావ !
2008-12-31
తెలుగు పద్యం: కూర్మి గూర్చుగాత కొత్త ఏడు!
2008-12-30
ఏటి ఒడ్డున: చిరుజల్లులో పూలు
2008-12-29
తెలుగు పద్యం: కొండ-గోదారి, నేను
మీరు చదివారా?: మన చదువులు చంపేందుకా?… బతికించేందుకా?
‘ఆంధ్రజ్యోతి’ సచిత్ర వారపత్రికగా మూతపడ్డాక రోడ్డున పడిన అనేకమంది జర్నలిస్టులలో నామిని ఒకరు. డయాస్పోరా సాహిత్యాన్ని, నోస్టాల్జియా కొసమెరుపుతో తెలుగు సాహిత్య వినువీధుల్లో ఒక నూతన ట్రెండును సృష్టించిన ఘనుడు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు. నామిని స్కూల్ సంప్రదాయపు తెరలేపిన రచయిత ఉద్యోగంలేని రోజుల్లో పిల్లల చదువులపై దృష్టి కేంద్రీకరించారు. “ఇస్కూలు పిలకాయల కత“, “పిల్లల భాషలో ఆల్జీబ్రా” అనే రెండు పుస్తకాలను ప్రచురించారు. చదువుతున్న చిన్నారులపై సిలబస్ పేరుతో, మార్కులతో, ర్యాంకులపేరుతో ఎంత వత్తిడి మోపుతున్నామో జాగ్రత్తగా పరిశీలించిన నామిని విద్యారంగంపై తన మూడో పుస్తకం “చదువులా? చావులా?”ను ప్రచురించారు. ఆ పుస్తక పరిచయం ఈ వారం…
పిల్లలు తాము ఎదుర్కొంటున్న మానసిక వత్తిడిని భరించలేక అనేక రకాల వ్యాధులబారిన పడుతున్నారు. కొంతమంది యువతీ యువకులు ఈ వత్తిడివల్లే శాడిస్టులుగా మారి తమ ఇళ్లలో తల్లిదండ్రులను, చిన్నపిల్లలను, బయట మిత్రులను అనేక రకాలుగా హింసిస్తున్నారు. మితిమీరిన వత్తిడివల్ల ఏటికేడాది ఎంతోమంది ముక్కుపచ్చలారని బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పదవ తరగతి, ఇంటర్, ఎంసెట్ పరీక్షల ఫలితాలు వస్తున్నాయంటే గుండెదడ పట్టుకుంటోంది. మరునాడు విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు ఎన్ని చదవాల్సి వస్తుందోనన్న బెంగతో. ర్యాంకుల రేసులో కార్పొరేట్ కాలేజీల వికృతాలు పెరిగిపోయిన తరువాత ఇంటర్ చదువులతోనే తనువులు చాలిస్తున్న యుక్తవయస్కు లెందరో. ఇవన్నీ కనీవినీ ఎరిగీ నామిని తన “చదువులా? చావులా?” వ్యాసాలను సంకలనం చేశారు.
చిన్నారులు ఎనిమిదో తరగతి చదువుతుండగానే వారికి ఐఐటి సీట్ల గురించి, ఎంసెట్‌లో రెండంకెల ర్యాంకుల గురించి కలలు కనే తల్లిదండ్రుల నైజాన్ని ‘పిల్లలమీద తల్లిదండ్రుల మోజు‘ అనే మొదటి వ్యాసంలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పదవ తరగతి చదువుతున్న సంధ్యన్న మాట తల్లిదండ్రులందరికీ కనువిప్పు కలిగించాలి. ‘మా అమ్మ సంగతి నాకు బాగా తెలుసంకుల్. నా ప్రాణం తీసేదాకా మా అమ్మ మంచినీళ్లు కూడా ముట్టదు‘. ముత్యాల్లాంటి పిల్లలు బతికుంటేనే కదా, మన జీవనదీపాలను చూసుకుని తరించేది. ఎందుకు వాళ్ల కెరీర్ పట్ల మనమంత ఆతృత పడడం? ఈ పిచ్చి పరుగు ఎటు దారితీస్తుందో కదా!
మనస్తత్వవేత్తలు ఎంత అరిచిగీపెట్టి చెప్పినా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పట్టించుకోని మరో సంగతి - పోల్చడం. తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మంచి ర్యాంకు సంపాదించుకున్న తోటి పిల్లలతోనో, బంధువుల పిల్లలతోనో తమ పిల్లలను పోల్చడం ఎంత హీనమైన పని! ఇతరులతో పోల్చి తమను ఎంత నీచంగా చూసినా, నిరంతరం తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలు మాత్రం అదే పాడుపని చేయరు. ‘ఒక క్లర్కు పిల్లలు ఆఫీసరును చూపించి, ”ఆయనను చూడు ఎంచక్కా ఆఫీసర్. నీవేమో క్లర్కువి. నీకొచ్చే జీతం థూ నాశనం!” అని పలుచన చేస్తారా? ఏ కూతురయినా జయసుధవైపో, రాధికవైపో చూపించి “నువ్వెందుకలా కాలేకపోయావమ్మా?” అని తల్లిని నిలదీస్తారా? అతిశయంతో, మిడిసిపాటుతో వున్న తల్లిదండ్రులు మాత్రం అన్ని విషయాల్లోనూ తమ పిల్లలను ఇతరుల పిల్లలతో పోల్చి చూపడమే కాకుండా - ఘోరంగా మాట్లాడేస్తారు కూడా! ఈ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు బుద్ధి వచ్చేదెన్నడు?
ఇక అమ్మానాన్నలు తమ పిల్లల కెరియర్ పేరుతో సాగిస్తున్న చిత్రహింసకు, కొత్త అడ్మిషన్లకోసం బడిలో ఉపాధ్యాయులు పెట్టే నరకలోకపు రంపపుకోతకు తోడైతే చెప్పేదేముంది? గొడ్డును బాదినట్టు బాదడం అటుంచి, ఆత్మహత్యకు పురికొల్పేలా బూతులు తిట్టడం వరకూ నివారించడం ఎవరి చేతిలోనూ పని. పిల్లవాడి మానసిక, శారీరక సామర్ధ్యాలు ఉపాధ్యాయుడి కనవసరం. కావల్సిందల్లా మార్కులు. పిల్లవాడి సమగ్ర వికాసం అతడి కవసరం లేని విషయం. కావల్సింది ర్యాంకులే. చదువుకాక ఇతర లలిత కళలు, క్రీదలపట్ల పిల్లలకున్న అనురక్తి, అభినివేశాలు టీచర్లకనవసరం. కావల్సిందల్లా మార్కులే. అదీ నూటికి నూరు. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇరవై నాలుగ్గంటలూ పిల్లలను బడిలోనే ఉంచేయగలడు. ఒక్కో ప్రశ్నా చేతులు వాచిపోయేలా కాపీ రాయమనగలడు. గుంజీలు తీయమనగలడు. గోడకుర్చీలు వేయించగలడు. వీపుమీద దబీదబీమని పిడిగుద్దులు గుద్దగలడు. బూతులు తిట్టగలడు. మేష్టారు పోలీసు కాగలడు. పాపం పిల్లవాడు నేరస్తుడు కాగలడా? లేడు.
ఈ పాప పన్నాగంలో తల్లిదండ్రులూ ఉపాధ్యాయులే బాధ్యులు కారు. పిల్లలు చదువుకునే సిలబస్ రూపకర్తలు కూడా భాగస్వాములేనని మరో వ్యాసంలో వివరిస్తారు నామిని. పదిహేను, పదహారేళ్లకు వచ్చిన యుక్త వయసు అమ్మాయిలు, అబ్బాయిలకు తెలియని ద్రోహం చేస్తున్న మరి రెండు విషసర్పాలు సినిమా, టీవీలు. ఇక నామిని ఈ పుస్తకంలో లెక్కలు, భౌతికశాస్త్రం ఎంతబాగా చెప్తారంటే… చిన్న ఉదాహరణ -
“మునక్కాయ ముప్పావలా లెక్కన వొక ముసలవ్వ వీధిలో మునక్కాయలమ్ముతోంది. ఒక బీదరాలు ఆ అవ్వదగ్గర మూడు మునక్కాయల్ని కొనుక్కుంది. ముసలవ్వ చేతిలోకి రెండుంపావలా, బీదరాలి చేతిలోకి మూడు మునక్కాయలూ చేరిపొయ్యాయి. చదువూ సంధ్యాలేని వాళ్లిదరి మధ్యా భిన్నాలకు సంబంధించిన వొక పెద్దలెక్క గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. 3/4*3=2.25 మూడో మనిషికి తెలీకుండా జరిగిపోయిన ఈ లెక్క ఎగురుకుంటూ స్కూలుకు వచ్చిందనుకోండి. ఒక బోర్డూ, చాక్ పీసుల బాక్సూ, వొక పుస్తకమూ, నాలుగు బెత్తాలూ, వొక డిగ్రీ హోల్డరూ… శవంపడిన ఇల్లు మాదిర్తో ఏడుపులూ, పెడబొబ్బలూ..!” ఇన్ని బాధలు పెట్టి మనం సాధించేదేమిటి? పిల్లల్లో నిజంగా ఆ తెలివే వుంటే వారే రాణిస్తారు. అయినా ఈ సువిశాల ప్రపంచంలో రెండే రెండు ప్రొఫెషన్లు వున్నాయా? ఇంజనీరు, డాక్టరు తప్పితే మరి ఉద్యోగాలు లేవా? మరే ఇతర వృత్తులూ, వుద్యోగాలలో ఆదాయం రాదా? సంతృప్తి లభించదా? ఆరు నెలలపాటు మన చుట్టాలదగ్గర మనకు పెద్దగొప్ప - మన పిల్లలకు మంచి ర్యాంకులు వస్తే. ఈ వత్తిడి తట్టుకోలేక వారు చనిపోతే జీవితాంతం కుళ్లికుళ్లి చావాలి. ఈ సంగతి ఎందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభువులు ఆలోచించరు? ఈ పుస్తకాన్ని నామిని ఈ మాటలతో ముగిస్తారు. “మనం చచ్చిపోయాక మనమీదపడి మన బిడ్డలు ఏడిస్తే కదా మన శవాలు సంతోషించేది! ఈలోగానే మనం తొందరపడిపోయి మన కళ్లముందే పిల్లల్ని చంపుకునేసి వాళ్ల శవాలమీద పడి మనం ఏడ్చేయడం తప్పుగదా!“.
ఇంత సీరియస్ సంగతులన్నీ హాయిగా నవ్వించే భాషలో చెప్పుకొచ్చారు నామిని. టామ్ సాయర్ బుక్స్ పేరిట వెలువడిన ఈ ఎనభై పేజీల పుస్తకం లాంటి కనువిప్పు సంగతుల “చదువులా? చావులా?” ఖరీదు ఇరవై రూపాయలే. మరి మీరూ చదువుతారుగా?
Posted in వ్యాసం
2008-12-27
శంఖారావం: తేలిక భాషలో తత్త్వశాస్త్రం--III
శ్రీచరితం: అనంతం.. అసంపూర్ణం!
“ఏంటి.. నిజమేనా” ఒక్క క్షణం ఏం వింటున్నానో కూడా అర్థం కాని అయోమయంలో పడిపోయాను..
“నిజమేరా” మా మావయ్య సమాధానంలో ఏమాత్రం తేడా లేదు.
ఈయనేనా.. వరకట్నాలకు, భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఇతనేనా పైసా కట్నం అక్కర్లేదంటూ ఓ పేద యువతిని తన జీవితంలోకి ఆహ్వానించింది. ఇంత చేసిన ఈయనా ఈ రోజు ఇలాంటి పని చేసింది.
లోపలి నుండి మా అత్తమ్మ ఏడ్పులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
నా దృష్టిలో ఎంతో ఉన్నతుడిగా ఉన్న మా మావయ్య ఒక్కసారిగా పురుగు కంటే హీనమైపోయాడు. మరొక్క క్షణం కూడా అక్కడ నిల్చోలేక, ఆయన వెనుక నుండి పిలుస్తున్నా పరుగులాంటి నడకతో నా గదికి వచ్చేసాను.
వరసకు మావయ్యే కానీ, మాది సోదర బంధాన్ని తలదన్నే ఆత్మీయ బంధం. మా మధ్య దాపరికాలు ఏమీ ఉండవు. వయస్సులో నాకంటే పెద్దవాడైనప్పటికీ, దాదాపు అన్నీ విషయాల్లోనూ నేను ఆయన సలహా తీసుకుంటూ ఉంటాను. అలాగే ఆయన కూడా. ఇద్దరం సాహిత్య ప్రియులమే. ఆయనకేమో చలం ఇష్టం. నాకు శ్రీశ్రీ అంటే అభిమానం. మా ఇద్దరి చర్చల్లో కుటుంబ విషయాల కంటే పుస్తకాలు, సాహితీ విలువల గురించిన ప్రస్తావనలే ఎక్కువ ఉంటాయి.
సహజంగానే మావయ్య అభ్యుదయవాది. చిన్నతనంలోనే ఊరి పెద్దలను ఎదిరించి సహపంక్తి భోజనాలను ప్రోత్సహించాడు. ఆ (అ)కారణంగా ఊరి నుంచి వెలి వేయబడ్డాడు. అందరికీ, అన్నింటికీ దూరమైనప్పటికీ తన అభిప్రాయాలను ఏ మాత్రం మార్చుకోని మా మావయ్యంటే చిన్నప్పటి నుంచి ఓ రకమైన భక్తితో కూడిన ఇష్టం నాకు.
అలాంటి మావయ్య ఈ రోజు మా అత్తమ్మకు అబార్షన్ చేయించాడంటే నేనే కాదు - మా మావయ్యతో పరిచయమున్న ఏ ఒక్కరూ నమ్మలేరు. కానీ, దురదృష్టవశాత్తూ అది నిజమే.
రకరకాల ఆలోచనలతోనే రెండ్రోజులు గడిచిపోయాయి. అసలు ఇలాంటి పనికి ఎందుకు పూనుకున్నాడో ఆయన్నే నేరుగా అ(క)డిగేద్దామని బయల్దేరేంతలో ఆయనే నా గదికి వచ్చాడు. అయితే ఎప్పటిలా చిరునవ్వుతో కాదు.
“అత్తమ్మ ఎలా ఉంది..” నా గొంతులో ఏదో లోపించినట్టు ఉంది.
“ఏరా.. నా గురించి అడగవా..” ఆయన గొంతులో నిష్టూరం ఇసుమంతైనా లేదు.
“నీకేంలే మావయ్యా. చెప్పేవి శ్రీరంగనీతులు అనే సామెతలాగా ….!” నా గొంతులో ఏదో అడ్డు పడింది. అక్కడితో ఆపేశాను.
“ఏరా.. ఆపేసావేం. పూర్తి చెయ్యరా. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కదూ” ఆయన మాటలో ఇప్పటికీ అదే మార్దవం, నన్ను కదిలించేది అదే, కట్టిపడేసేది అదే.
ఏంటిది.. అప్పుడే చీకటి పడుతోందా. గదిలో అంతా మసక మసకగా ఉందేం..
ఓ.. కంట్లో పల్చటి నీటి పొర.
చటుక్కున గోడవైపు తిరిగాను.
“ఏరా.. నా మొహం చూడటం కూడా ఇష్టం లేదా..”
“ఎందుకిలా చేసావ్ మావయ్యా.. ఎందుకింతలా దిగజారిపోయావ్. ఆదర్శాలు, నీతులు ఊరి జనాలకేనా. అసలు అత్తయ్య మొహం ఎలా చూడగలుగుతున్నావ్ నువ్వు. ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురుచూసిందే.. నోచని నోము, ఎక్కని గుడి లేదే. తీరా ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంటే ఎందుకా బిడ్డను కడుపులోనే చంపేసావ్.. కేవలం ఆడపిల్లనేగా.. కట్నాలు, కానుకలు ఇచ్చుకోలేవనేగా.. ఏం.. మేమంతా చచ్చామనుకున్నావా?” ఆవేశం, ఏడుపు కలగలిపిన నా మాటలు నా గది గోడలకే విచిత్రంగా వినిపించాయేమో.
“అయిపోయిందా” ఏంటసలు నాకర్థం కాకుండా ఉంది ఆయన తీరు. అదే స్థిరత్వం, ఎక్కడా తొట్రుపాటు లేకుండా..
“రేయ్ మాధవా.. ఈ నిర్ణయం తీసుకోబోయే ముందు నేనెంత మథనపడ్డానో, నాలో నేను ఎంత నలిగిపోయానో నీకు తెలియదురా.. ”
“ఏమైతేనేంలే మావయ్యా. జరగవలసింది జరిగిపోయిందిగా”
“నీకు సమకాలీన సమస్యల పట్ల అవగాహనే లేదురా”
“ఏంటి.. యాసిడ్ దాడులా.. ఇంకేం మాట్లాడకు మావయ్యా.. ఇంత పిరికివాడివి అనుకోలేదు” మొదటిసారిగా ధిక్కార స్వరం.. తాడో పేడో తేల్చేసుకుందామనే కసి..
“మా నాన్న నా చిన్నతనంలో ఎప్పుడూ ఓ మాట అనేవాడ్రా..
మా అక్కకి, అదే మీ అమ్మకు పెళ్లి కాక ముందు నుంచి అదే వరస. ఆడ బిడ్డకు ఆ మూడు ముళ్ళు వేయించేసానంటే, నా బాధ్యత తీరిపోతుంది. ఇక మగపిల్లలా.. గోచి పెట్టుకు తిరిగినా అడిగే నాథుడు లేడు అనేవాడు. మంచి రోజులు, చెడు రోజులు లేవు. సమయం, సందర్భం లేవు. ఎప్పుడు పడితే అప్పుడు. ఆయన ఆర్థిక పరిస్థితే అందుకు కారణమేమో. పదే పదే మీ అమ్మ పెళ్ళి గురించి ఆలోచించేవాడు. ఎట్టకేలకు ఓ శుభ ముహూర్తంలో ఆ కాస్తా ఘనకార్యం జరిపించేసాడు. ఇక చూడాలి ఆయన ఆనందం. పట్టపగ్గాల్లేవనుకో..”
ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే.. ఎన్నోసార్లు ఈయన చెప్పగా విన్నవే. ఇప్పటి చర్చకు దానికి సంబంధం ఏంటో అర్థం కాకున్నా ఆయన వాక్ప్రవాహానికి అడ్డు రాదల్చుకోలేదు. మళ్ళీ ఆయనే కొనసాగించాడు..
“బాధ్యతలురా మాధవా.. ఆడబిడ్డ అంటేనే బాధ్యతలు, కష్టాలు, కన్నీళ్లు.. బిడ్డ పుట్టిన మరుక్షణం కలిగే ఆనందం దాన్ని ఓ అయ్య చేతిలో పెట్టేవరకేరా. దాన్ని తీరా అత్తారింటికి పంపాక చూడాలి పాట్లు. రేయ్.. అత్తగారింటికి వెళ్లిన కూతురు ఇంటి నుండి ఫోన్ వస్తే చాలు, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని హడలి చచ్చే తల్లిదండ్రులు నాకు తెలుసురా. ఉన్న ఆస్తులు హారతిగా చేసి, వాళ్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చినా ఏదో ఒక నెపంతో బిడ్డను కష్టపెడితే ఏం చేయాల్రా. కాలు కింద పెడితే కందిపోతాయేమోనని భయపడే కన్నతండ్రి తన కూతుర్ని దారుణంగా హింసించే వియ్యంకులను, అల్లుళ్లను ఏం చేయలేక గేటు బయట నుండి నిస్సహాయంగా కన్నీరు కార్చే సంఘటనలు కోకొల్లలురా”
“ఏం.. అందరూ ఒకేలా ఉంటారా ఏం. నువ్వు, మా నాన్న పెళ్ళాలను తన్ని తగలేసిన వారి జాబితాల్లో లేరుగా.. చేసిన తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో పొంతనలేని మాటలు మాట్లాడుతున్నావ్ మావయ్యా..”
“కాస్తా నన్ను మాట్లాడనిస్తావా
తీవ్రవాదుల పుణ్యమా అని రోడ్డెక్కిన వాడు ఇంటికి వస్తాడో లేడో చెప్పలేని పరిస్థితి. గతంలో కేవలం ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం కారణంగా కాలేజీకి వెళ్లిన బిడ్డ ఇంటికి వస్తాడో రాడో తెలియని దుస్థితి. రోడ్ల మీద ఈవ్ టీజింగ్‌ల పుణ్యమాని ముక్కుపచ్చలారని విద్యార్థినులు అమానుష దాడులకు బలి అవుతున్నారు. ఈ రోజుల్లో ఉద్యోగాలకే కాదురా, ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో నాకేమైనా జరిగితే, ఇప్పటికే అవిటిదైన మీ అత్తయ్య ఆడబిడ్డతో ఎలా వేగుతుందిరా.. దానికి తగిన భద్రతను ఎలా ఇస్తుంది.”
“ఎప్పుడో చస్తామనే భయంతో, ఇప్పుడే చచ్చిపోవాలనుకోవడం అవివేకం మావయ్యా. సహజంగా మరణించడం వేరే, బలవన్మరణం వేరే. రెండు పరస్పర భిన్నాభిప్రాయాలను నువ్వు ఒకే గాటిన కట్టేస్తున్నావ్. నువ్వు చనిపోయే పరిస్థితే వస్తే, అత్తయ్యను ఆదుకోవడానికి అయినవారం మేమంతా లేమా” ఆయన చెప్పేది కొంతవరకు నిజమనే అనిపిస్తూ ఉన్నా అంగీకరించలేని నైజం.
“ఎవర్ని ఎవర్రా కాపాడేది. నువ్వు బంధాల గురించి మాట్లాడుతున్నావ్.. నేను వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను.. అలా అని నేను చేసిందే కరెక్ట్ అని నేను వాదించను. కానీ, ఆడబిడ్డను కని, స్కూల్ రోజుల నుండి కాలేజీ రోజుల వరకు, ఆపై పెళ్లయ్యి అత్తవారింటికి వెళ్లాక, కడుపులు, కాన్పులు అంటూ వేగేందుకు నా తాహతు సరిపోదురా”
“నువ్వు చెప్పే ఏ కారణాలతోనూ నేను ఏకీభవించలేకున్నాను మావయ్యా..” అన్యమనస్కంగానే సంభాషణకు ముగింపు చెప్పాలనుకున్నాను..
“సరే.. కొన్నాళ్లాగు.. నిజం నిలకడ మీద తెలుస్తుంది” నా గది నుండి మొదటిసారి తలవంచుకు వెళ్లిపోయాడు మావయ్య..
పగలంతా ఆహారం కోసం తిరిగి అలసిపోయిన పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి..
నేను కూడా నడుము వాల్చాను..
ఐతే..
విశ్రాంతి కోసం కాదు..
నాలోని మరో నేనుతో మరింత విపులమైన సంవాదం కోసం..!
2008-12-26
ఏటి ఒడ్డున: ఆహా
మీరు చదివారా?: తొమ్మిదో వారం చదువు ముచ్చట్లు దేవరపల్లి రాజేంద్రకుమార్‌తో…
నేను బ్లాగావరణంలోకి ప్రవేశించిన తరువాత మొదట పరిచయమైన వ్యక్తి దేవరపల్లి రాజేంద్రకుమార్. విశాఖపట్నంలో రిసెర్చ్ చేస్తున్న అతని స్నేహితుని కంప్యూటరులో కొన్ని కొత్త ఉపకరణాలు వేస్తూ చేగొడియాలు తింటూ… బ్లాగు హడావిడికి కాసులు రాలుతాయా.. అని చర్చించుకుంటూ… గడిపిన సాయంత్రం మర్చిపోలేనిది. విశాఖతీరాన… బ్లాగుతో, నవతరంగం నిర్వాహకునిగా.., దాదాపు అన్ని బ్లాగుల్లో సమాధానాలు రాస్తూ… అందరికీ మంచి మిత్రుడైన రాజేంద్రగారితో ఈ వారం చదువు ముచ్చట్లు…
1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
ఈ ప్రశ్నకు నిర్దిష్టంగా సమాధానం చెప్పటం కష్టం,ఎందుకంటే గొప్ప పుస్తకరచయితలు అన్న బరువుమోస్తున్న చాలా మంది పుస్తకాలు కొన్ని ఇలాగే అనిపించాయి,కొన్ని సార్లు
2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?
కొన్న్ పుస్తకం ఈ మధ్య ఏమీ లేదు,కొన్నాళ్ళ క్రితం విశాలాంధ్రలో ఒక పది దాకా కొన్నాను,చదవటం పూర్తి చేసినవి,శ్రీపాద’ కధలు-గాధలు’ ‘చాసో కధలు,చిక్కవీర రాజేంద్ర(మాస్తి వెంకటేశ అయ్యంగారు) (మరో సారి) మాలపల్లి, వంశీ పసలపూడి కధలు,చక్రపాణీయం,ఇలా చాలా ఉన్నాయి
3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?
ఇదీ చెప్పలేను,కానీ ఇ-బుక్స్ మాత్రం తెలుగు-ఇంగ్లీషు కలసి వందలుంటాయి
4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?
chasing the monk’s shadow-Mishi Saran,Enivironmentalism-A Global History-Ramachandra Guha
5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.
మపాసా అందరికన్నా ముందుంటారు,హెమ్మింగ్ వే,చెకోవ్,మామ్, కొకు,శ్రీపాద,చాసో ఇది అనంతం(జాబితా)
6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?
నేను పుస్తకాలు బహుమతిగా ఎవరికీ ఇవ్వలేదు,ఫలానా పుస్తకం చదవమని మాత్రం సలహాలు ఇచ్చా,ఒక నాలుగైదు నాకు వచ్చాయి
7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?
పత్రికల్లో నచ్చని అంశాలుంటాయి,పత్రిక అచ్చంగా నచ్చక పోవటం లేదు,అన్ని పత్రికలూ చదువుతాను
8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?
నా చదువుకీ జనాభిప్రాయానకీ సంబంధం లేదు,ఆమాటకొస్తే సూపర్ రచనలు అని హోరెత్తించినవి చాలా చదవలేదు నేను
9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?
మహాయాత్రికులు-డాక్టర్.యం.ఆదినారాయణ,ఆంధ్రవిశ్వకళా పరిషత్,
10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?
హెమ్మింగ్ వే ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ,ఆ ముసలాయన లాగా ధైర్యంగా ఉండలేను కానీ మొండితనం మాత్రం కాస్త అలవర్చుకున్నా

'అంతర్యానం': బాధ్యత ఎవరిది?
క ళా స్పూ ర్తి: (శీర్షిక లేదు)
2008-12-25
జీవి ముచ్చట్లు (Gv-Blog): ఇది కాలెండర్ల సమయం
2008-12-23
2008-12-22
గడ్డిపూలు: వార్తలా ? వ్యాపారమా ?
మీరు చదివారా?: అందరికీ ఆర్థిక అక్షరజ్ఞానం
న్యూయార్క్ టైమ్స్ పత్రికలో సుమారుగా రెండేళ్లపాటు ప్రతివారం బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ లో నిల్చున్న అరుదైన పుస్తకం రాబర్ట్ కియోసాకి రాసిన “రిచ్ డాడ్ పూర్ డాడ్”. అమెరికాలో తల్లిదండ్రుల ఆలోచనలను తలకిందులు చేసిందా పుస్తకం. డబ్బు విలువ పిల్లలకు తెలియజెప్పాలని తల్లిదండ్రులందరికీ నిఖార్సయిన హెచ్చరికలు అందజేసిన ఆ విలువైన పుస్తకం ఈ వారం పరిచయం చేసుకందాం.
సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలను బాగా చదువుకోమని చెప్తారు. మంచి మార్కులు తెచ్చుకోమంటారు. దానివల్లనే మంచి ఉద్యోగం వస్తుందంటారు. ఉద్యోగ జీవితంలో కష్టపడి పనిచేయడం ద్వారా పదోన్నతులు సంపాదించి సుఖంగా బతకొచ్చు అంటారు. కానీ, ఇలా కష్టపడి చదివి, ఉద్యోగం సంపాదించుకుని, పదోన్నతులు పొందిన వాళ్లంతా సుఖమనే భ్రమలో మాత్రమే వున్నారు. నిజానికి వీరెవరూ ఆరు నెలలు ద్యోగం లేకపోతే మనుగడ సాగించలేరు. డబ్బుకు కటకటలాడి ఆత్మహత్య చేసుకోవలసిందే. ఉద్యోగ జీవితంలో నానాగడ్డీ కరిచి అంటే అవినీతి మార్గాలద్వారా డబ్బులు సంపాదించి ఆస్తులు కూడబెదితే తప్ప, ప్రభుత్వం లేదా తమ యాజమాన్యం వేతనంగా ఇచ్చిన డబ్బులద్వారా లక్షాధికారులో, కోటీశ్వరులో అవడమంటే దుర్లభమని అందరికీ తెల్సిందే. ఈ “రిచ్ డాడ్ పూర్ డాడ్” పుస్తకంలో రాబర్ట్ కియోసాకి అందరు తల్లి



