2009-01-07

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: 30GB హార్డ్ డిస్క్ కామ్ కోడర్ 22,500

2009-01-07 07:33 AM nallamothusridhar
MiniTape, Mini DVD కామ్ కోడర్ల స్థానంలో ఇటీవలి కాలంలో అంతర్గతంగా హార్డ్ డిస్క్ లను కలిగి ఉండే కామ్ కోడర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. మొదటి రెండు రకాల కామ్ కోడర్లతో పోలిస్తే హార్డ్ డిస్క్ వి ఉత్తమం. కారణం డేటా ఎప్పటికప్పుడు USB కేబుల్ ద్వారా పిసికి ట్రాన్స్ ఫర్ చేసుకుని అంతర్గత హార్డ్ డిస్క్ ని ఖాళీ చేసుకోవచ్చు. హార్డ్ డిస్క్ ఆధారిత కామ్ కోడర్లలో కూడా MPEG2 ఫార్మేట్ లో వీడియోని రికార్డ్ [...]

రాతలు - కోతలు: విశ్వనాథ వారి కిన్నెరసాని-2

2009-01-07 03:31 AM కస్తూరి మురళీకృష్ణ

అక్షరాల కలయిక తో పదాలు ఏర్పడతాయి. ఒక కోణంలోంచి చూస్తే వొంటరిగా అక్షరాలు నిర్జీవాలు. కానీ, ఒకదానితో ఒకటి కలవటంవల్ల అక్షరాలు పదాలుగా మారి ప్రత్యేకార్ధాన్ని సంతరించుకుంటాయి. సజీవమవుతాయి. ఒక భావాన్ని కలిగిస్తాయి. కనులముందు ద్రుశ్యాలను నిలుపుతాయి. అయితే, ప్రతి పదానికి శక్తి వుంటుంది. ఆయా సందర్భాలాలో ఆయా ధ్వనులు కల శక్తి వంటమయిన పదాల వాడకంవల్ల కవి కనులముందు సజీవ దృశ్యాలను నిలుపుతాడు. వ్యక్తి ఊహాత్మక శక్తి రెక్కలిస్తాడు. తన సృజనాత్మక ఆవేశ స్థాయికి పాఠకుడిని పదాల బలంతో ఎదిగిస్తాడు.

అక్షరాల శక్తి తెలిసిన కవి మేధలో పదాలు సజీవం. అవే పదాలు ఇతరులు వాడితే ఆ పదాలే మామూలుగా అనిపిస్తాయి. అయితే, చాలా మందికి అక్షరాల శక్తి గురించిన వగాహనలేదు. కవి వాడిన పదాలను నిర్దాక్షిణ్యంగా మార్చేస్తారు. రచనను నిర్వీర్యం చేస్తారు.

అక్షరాల శక్తి తెలియాలంటే విశ్వనాథవారి రచనలలో సందర్భానుసారంగా ఆయన కవిత పోయిన పోకడలు గమనించాలి. పదాల చిందులను అర్ధంచేఉకోవాలి. పదాల ద్వారా సినిమాను మించిన చలన చిత్రాలను సజీవంగా కళ్ళముందు నిలిపే కవిత్వ సరస్వతీ శక్తిని అనుభవించాలి.

కిన్నెరసాని నదిగా మారిపోయింది. జీవితంలో కొన్ని నిర్ణయాలు క్షణికావేశంలో తీసుకుంటాము. వెంటనే పొరపాటు గ్రహించినా వెనక్కి తిరిగి తీసుకునే వీలుండదు. కిన్నెరసాని అలాంటి నిర్ణయం తీసుకుంది. భర్త మీద ఆమెకు ప్రేమవుంది. కానీ, ఒక బలహీన క్షణంలో, ఆవేశానికి లోనయి తొందరపాటు నిర్ణయం తీసుకుంది. భర్తను వదిలి నదిగా మాఇంది.

నది నీటి లక్షణం ప్రవహించటం. వడిగా, దూకుడుగా, సుళ్ళు తిరుగుతూ కదలిపోతుంది నది. అయితే, కిన్నెరసాని మామూలు నది కాదు. ఒక నదిగా మారిన వనిత. భర్త రాయి అయిపోయాడు. అతడిని వదలలేదు. కానీ వదలి కదలక తప్పదు. నదిలా నడవక తప్పదు.

ఈ సందర్భంలో విశ్వనాథవారి కవిత నదీనీటి కదలిక భంగిని కదలుతుంది. సాంప్రదాయికంగా కవులకు చందస్సు ఒక వీలును కల్పిస్తుంది. సందర్భానికి తగ్గ కవిత గమనాన్ని ఎంచుకుని, అక్షరాలను కూరిస్తే, కవితకు స్వాభావికంగా రచయిత ధ్వనింపచేయాలనుకుంటున్న భావాం కవిత గతి ధ్వనింపచేస్తుంది.

ఆ సాంప్రదాయిక పద్ధతిని ఆధునికీకరణం చేసి తన కవితను విశ్వనాథ వెలయించిన తీరు పరమాధ్భుతం. గమనించండి.

కిన్నెర నడకలను, కవిత గతి, పదాల కూర్పు కళ్ళముందుంచే కవి ప్రతిభాపాటవాల మాయా ప్రపంచాన్ని అనుభవించండి.

కరిగింది కరిగింది
కరిగింది కరిగింది

కరిగి కిన్నెరసాని వరదలై పారింది
తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది
పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది.

అందరికీ అర్ధమయ్యే మామూలు పదాలకు లయలో వొదగగానే ఎంత శక్తి వచ్చిందో చూడండి. ఎలా చదివినా నదీ గమనాన్ని స్ఫురింప చేస్తుందీ కవిత.

కదిలింది కదిలింది
కదిలింది కదిలింది

కదిలి కిన్నెరసాని వొదుగల్లు పోయింది
సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది
ముదిత కిన్నెరసాని నురుసుల్లు గ్రక్కింది.

ఇక్కడ కవి సుదతి ఎందుకు వాడాడు? మహిళ అని అందరికీ అర్ధమయ్యేపదం వాడచ్చుకదా? అని అక్షేపించవచ్చు. ఇందువల్ల అర్ధం మారదు. గతి మారదు. కానీ సుళ్ళుగా కు సుదతికి సంబంధంవుంది. బుద్ధి గ్రహించలేని ఈ సంబంధం మనస్సు గ్రహిస్తుంది. స్పందిస్తుంది. ఇదే కవితను సుదతి బదులు మహిళ అని చదవండి. అక్షరాల శక్తి అర్ధమవుతుంది. ప్రతి పదం తనకే ప్రత్యేకమయిన జీవ లXఅణాన్ని కలిగి వుండటం బోధపడుతుంది.

కదలగా కదలగా
కాంత కిన్నెరసాని

పదుపుకట్టిన లేళ్ళకదుపులా తోచింది.
కదలు తెల్లని పూలనదివోలె కదలింది
వదలు తెల్లని త్రాచు పడగలా విరిసింది.

ఇక్కడ గతి తేడా గమనించండి. ఆరంభంలోని సంశయాలిప్పుడు కిన్నెరలో లేవు. నది తానని గ్రహించింది. కదలికలో వేగం వచ్చింది. ఒక ease వచ్చింది. కవిత దాన్ని ప్రతిబింబిస్తోంది. పదాలు ఆ భావాన్ని పూయిస్తున్నాయి. కదలు కిన్నెరసానిని కళ్ళముందు నిలుపుతున్నాయి.

ఇక్కడే కవి ప్రతిభ తెలుస్తుంది. నదీగతికి బండరాయి అడ్డొస్తే దాని చూట్టూ తిరిగి సుళ్ళుగా ప్రవహిస్తుంది. ఈ లక్షణాన్ని కథకు అన్వయించి, ఊహను నిజంగా అనుకునే రీతిలో కవి చూపటం తెలుస్తుంది.

కథ ఒక ఊహ. కానీ ఆ ఊహను నిజానికి దగ్గరావుంచి చెప్పటంవల్ల ఊహలో కల్పన మరుగునపడి కల్పన నిజమయి నిలుస్తుంది.

కిన్నెరసాని నది అయితే ఆమె భర్త రాయి అయ్యాడు. భర్తను వదలి వెళ్ళాలని లేదు. కానీ వెళ్ళక తప్పదు. దాంతో రాయి అయిన భర్త చుట్టూ తిరిగి తిరిగి వదలలేక వదలలేక వదలి కదలింది కిన్నెరసాని. నీటి లక్షణాన్ని, మహిళా మనస్త్వానికి అన్వయించి, సృజనాత్మకత రంగరించి కవి సాహిత్య ప్రపంచంలో పూయించిన పరిమళ భరితమైన పూవును మనసుతో చూడండి.

పతి రాయివలె మారి
పడియున్న చోటునే

పడతి కిన్నెరసాని విడలేక తిరిగింది
ముగుద కిన్నెరసాని వగచెంది తిరిగింది
వెలది కిన్నెరసాని గలగలా తిరిగింది

ఏదీ కఠిన పదం? ఏదీ కఠిన భావం? ఏదీ వెనుకబడినతనం? ఎందుకని విశ్వనాథ అంటే అంత ద్వేశం?

ఒక ఉత్తమ సాంప్రదాయాన్ని పనికి రాదనేబదులు, పూర్వీకులందించిన ఆస్తిని పదింతలు చేసి నూతన అంతస్థులు జోడించాలన్న ఔన్నత్యాన్ని ఆచరించి చూపుతున్నందుకా?

తామీ భావనా ఔన్నత్యాన్ని అందుకోలేమని గ్రహించి, ఆ ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించేబదులు, పైనున్నవాడిని క్రిందకులాగి, బురదచల్లి వాడిని దిగజార్చామని సంతృప్తిపడే నీచ ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది వీరి ప్రవర్తన.

తుదకేమి చేయగా
నెదవోక అలవోక

పతిరాయిగా మారి పడియున్న గుట్టపై
అతివ తన కెరటాల హస్తాలతో చుట్టి
వెతపొంది వెతపొంది బిట్టు ఘోషించింది

తాను నదిగా మారింది కాబట్టి భర్తనూ నదిలా మారి రమ్మని ప్రార్ధించింది. ఇద్దరం కలసి కెరటాలు కెరటాలు కౌగలిద్దామురా అని రమ్మంది.

ఆతరువాత ఏమి జరిగిందో రేపు.

      

2009-01-06

అర్జునుడి బాణాలు...: Telugu English Dictionary 0.4 Beta

2009-01-06 10:01 PM మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ (noreply@blogger.com)
My heartily thanks to all the users who have used dictionary versions 0.1, 0.2 and 0.3 Beta respectively. And with all the feedback I received till date and with some of my own ideas I’m releasing 4th version of the Telugu English dictionary. Can be downloaded from http://www.miriyala.in/dl/TE2EN.zip?attredirects=0 Write your views and ideas as comments or email. What’s new with 0.4

e-తెలుగు: విజయవాడ 20 వ పుస్తక ప్రదర్శనలో ‘e-తెలుగు’ సందడి

2009-01-06 05:08 PM chsprasad

విజయవాడలో జరిగే పుస్తక ప్రదర్శనలలో నాలుగో రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ రోజున పుస్తకప్రియులు నగరంలో పాదయాత్ర నిర్వహిస్తారు. పుస్తక పఠనం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజెప్పడం దాని లక్ష్యం. 2009 జనవరి 4 న జరిగిన పాదయాత్రలో ‘e-తెలుగు’ కూడా పాల్గొంది. ఆ రోజున ప్రదర్శనలోని ప్రతిభావేదికపై ప్రదర్శన కూడా ఇచ్చింది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పూర్తిగా చదవండి

తెలుగు పుస్తకం: పాఠకులున్నారు జాగ్రత్త!

2009-01-06 11:38 AM వీక్షణం

ఆంధ్రజ్యోతి నుండి…

పుస్తకప్రియులు పుస్తకాలను తులసి ఆకుల్లాగా కళ్ల కూ, హృదయానికీ అద్దుకుని మరీ కొనుక్కున్నారు. బహుశా తాము కారు కొన్న రాత్రి కంటే పుస్తకాలు కొన్న రాత్రి సుఖంగా నిద్రపోయి ఉంటారు.. మనిషికి మృత్యువు ఉంది కాని పుస్తకానికి చావులేదని, పుస్తకానికి చావురాదని, పుస్తకం చావదని మర్త్య మానవులు పుస్తకాన్ని దీవించిన సందర్భం ఇదేనని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ముమ్మారు నినదించింది.

పుస్తకం పట్టిన చేతులకు కృతజ్ఞతలు

పుస్తకాన్ని పట్టి ఇచ్చిన, పుస్తకాల పట్టీ ఇచ్చిన చేతులకు ధన్యవాదాలు

బుక్కులకు బుక్కైపోయిన మహనీయులు వర్ధిల్లాలి

పుస్తకాలకు లొంగిపోయిన మానవీయులకు జిందాబాద్‌

అనేక, అసంఖ్యాక గ్రంథాలముందు విధేయులై, వినమ్రులూ ఐ

నిలబడిన ఆ బాలగోపాలానికి హేట్సాఫ్‌

‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అనే పాటను కొద్దిగా మార్చి పాడుకోవాలనిపిస్తోంది.. “పిల్లలూ, దేవుడూ, పుస్తకప్రియులూ చల్లనివారే కల్లకపట మెరుగనీ కరుణామయులే” అని ఆలాపించాలనిపిస్తోంది.. 23వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నెక్లెస్‌ రోడ్‌కి అతి విలువైన గ్రంథ హారాన్ని ఓ పదిరోజులపాటు అద్దెకిచ్చింది. పది రోజులూ నెక్లెస్‌ రోడ్‌ మెడలో వేళ్లాడే పుస్తక హారం బరువుకి తల ఎటూ తిప్పలేక పుస్తకంలోకే తొంగిచూసింది.

ఇది నిజంగా పుస్తక తులాభారం. పుస్తకాలు సత్యభామ, రుక్మిణులై, రుక్మిణులై, పదారు వేలమంది గోపికలై వివిధ రూపాల పాఠక శ్రీకృష్ణ హృదయాన్ని అధివసించడానికి ప్రయత్నం చేసాయని అనటానికి నోరు రావటం లేదు. మనిషి పరమాత్ముడు, పుస్తకం ఆత్మ అయితే- ఈ ఆత్మలు పరమాత్మలో తనం కావడానికి, పరమాత్మను చేరుకోవడానికి తహతహలాడాయి అని అనాలి. తమ పరమాత్మను తామే వెతుక్కుని పుస్తకాత్మలు సేదదీరాయి. తమ వియోగానికిక తెర పడిందని, తమ ప్రియులకు తృప్తిని, తమకు మోక్షాన్ని సిద్ధింపజేస్తామని ప్రకటిస్తూ వెళ్లిపోయాయి.

పుస్తకప్రియులు పుస్తకాలను తులసి ఆకుల్లాగా కళ్లకూ, హృదయానికీ అద్దుకుని మరీ కొనుక్కున్నారు. బహుశా తాము కారు కొన్న రాత్రి కంటే పుస్తకాలు కొన్న రాత్రి సుఖంగా నిద్రపోయి ఉంటారు. ఎన్నో పుస్తకాలను పాఠక దేవుళ్లు కొన్నారని ఈ పుస్తక ప్రదర్శన తేల్చి చెప్పింది. ప్రజలు కార్లు మాత్రమే కాదు, పుస్తకాలు కూడా కొంటారని ఈ బుక్‌ ఫెయిర్‌ ఖరాఖండిగా చెప్పింది. మనిషికి మృత్యువు ఉంది కాని పుస్తకానికి చావులేదని, పుస్తకానికి చావు రాదని, పుస్తకం చావదని మర్త్య మానవులు పుస్తకాన్ని దీవించిన సందర్భం ఇదేనని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ముమ్మారు నినదించింది. పిల్లలు రంగురంగుల బొమ్మల పుస్తకాల వైపు, కథల వైపు, సి.డి.లవైపు లేత పూలలాగా ప్రవహించారు.

యువకులు వ్యక్తిత్వ నిర్మాణాలవైపు, ఉపాధి అవకాశాలను తెలిపే సమాచారమిచ్చే పుస్తకాలవైపు నడిచారు. మహిళలు వంటల పుస్తకంతో మొదలుపెట్టి లలితా సహస్రనామాల దగ్గర ఆగారు. అక్కడక్కడా గురువుల దగ్గర, గురు చరిత్రల దగ్గర నిలిచిపోయారు. పరిశోధకులు తమ తమ పరిశోధన అంశాలకు సంబంధించిన విషయ సేకరణ చేసుకున్నారు. పెద్దలు ఆధ్యాత్మిక, భక్తి గ్రంథాలను దేవులాడుకున్నారు. వృద్ధులు జీవితానుభవసారాన్ని వ్యాఖ్యానించే పుస్తకాలవైపు మొగ్గుచూపారు. విశ్రాంత ఉద్యోగులు పెన్షన్‌ డబ్బుల్ని తడిమి చూసుకుని, చూపు ఆనిన మేరకు ఒకటీ అరా పుస్తకాలను కొనుగోలు చేశారు. అధ్యాపకవర్గం ధరల విషయంలో చిరాకుపడింది. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు హుందాగా గ్రంథాలు కొన్నారు. అసిస్టెంట్‌- అసోసియేట్‌ ప్రొఫెసర్లు డిస్కౌంట్‌ ఎక్కువ ఇవ్వమని అడిగిచూశారు. కొనదలచిన పుస్తకాల్లో ఒకటీ అరా తగ్గించుకున్నారు.

ఐ.టి.ప్రొఫెషనల్స్‌ ఈసారి కొద్దిగా సంస్కృతి, సామాజిక పరిణామం, జీవిత చరిత్రలవైపు తొంగి చూసినట్లున్నారు. సాహిత్యాభిమానం గల పాత్రికేయులు ఆయా కవుల, రచయితల పుస్తకాలు కొనుగోలు చేశారు. అనువాదం, అనువాద సిద్ధాంతాలపై గ్రంథాలు స్వల్పంగా అమ్ముడయ్యాయి. భాష, సంస్కృతి, గిరిజనులపై మోనోగ్రాఫ్‌ల్లాంటివి కూడా కొన్ని అమ్ముడయ్యాయి. అరవింద అడిగ వైట్‌ టైగర్‌ పుస్తకం గురించి వాకబు ఎక్కువ జరిగింది. ఒబామా ప్రత్యేక ఆకర్షణ. హ్యారీ పోటర్‌ పిల్లల సంబరం. రజనీష్‌పై ఆసక్తి అదేవిధంగా కొనసాగుతోంది.

జిడ్డు కృష్ణమూర్తిపై కుతూహలం, సంశయం, పాఠకుల్లో.. ఇస్కాన్‌ ఎక్కడ? కొత్త పాఠకులు ఏర్పడుతూ ఉన్నారనడానికి సూచన. నాట్యం, చిత్రకళ, శిల్పం, సంగీతం పరిమిత సంఖ్యలో అమ్మకాలు. ఎడ్యుకేషన్‌పై గ్రంధాలు, సామాజిక శాస్త్ర గ్రంధాలు హాట్‌ కేకులు కాకపోయినా ఒక మాదిరిగా కదిలాయి. పెద్దబాలశిక్ష సూపర్‌ డూపర్‌ హిట్‌. వ్యసన సంస్కృతిని వదిలిపెట్టి అభ్యసన సంస్కృతివైపు వెళ్తున్నాం అనడానికిది నమ్మదగిన సూచన కాకపోవచ్చు. నేర్చుకోవటంలోని వెలితికి, నేర్చుకున్నది మరచిపోతున్న తక్షణ సంస్కృతికి కూడా గురుతు కావచ్చు. ఆర్‌.కె గారన్నట్లు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ తన కాస్మాపాలిటన్‌ కల్చర్‌ని విశిష్టంగానే పట్టిచూపింది. మంచి పుస్తకాన్ని ఎంచి మరీ కొంటున్నారు. పాఠకులున్నారు

జాగ్రత్త. పబ్లిషర్స్‌ ఎంచి మరీ మంచి పుస్తకాలే వేయాలేమో! పదిరోజుల పుస్తక ప్రదర్శన పది కాలాలపాటు పాఠకులకు ఎటువంటి పుస్తకాలు, ఏ యే ధరల్లో వేయాలో విడమరచి చెప్పింది. ద్రావిడ విశ్వవిద్యాలయానికి స్టాల్‌ నెం 13కు చేకూరిన లాభమిదే. ఈ ఎగ్జిబిషన్‌లు ఆంధ్రదేశంలోని కవులు, రచయితలు చాలామంది కలిశారు. మా ద్రావిడ విశ్వవిద్యాలయం స్టాల్‌ను దర్శించారు. కొన్ని పుస్తకాలు కూడా కొన్నారు. నేను మాత్రం వచ్చే సందర్శకులలో స్మైల్‌ను, జ్వాలాముఖిని వెతుక్కుంటున్నాను. ఈ ఇద్దరే కనిపించడం లేదు…!

- సీతారాం

      

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: మెయిల్ అక్కౌంట్ల దొంగలు

2009-01-06 10:25 AM nallamothusridhar
ఈ వ్యాసాన్ని అందించినవారు చిలకపాటి శివరామ ప్రసాద్ గారు. వారికి ధన్యవాదాలు. అప్పటివరకు బాగానే పనిచేసిన మన మెయిల్ ఐడి సడన్‌గా  invalid password అని మెసేజ్ చూపించి లోపలికి లాగిన్ అవ్వకుండా నిలిచిపోతుంది. Caps Lock ఆన్ అయిందేమో అని చూస్తే అది బాగానే ఉంటుంది. కీ‌బోర్డ్ పై ప్రతీ అక్షరాన్ని జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ పాస్‌వర్డ్ ఎంటర్ చేసినా రాంగ్ అనే మెసేజే వస్తుంది. ఇంకేముంది గోవిందా… మన ఇమెయిల్  ఐడి దొంగతనం చేయబడింది. ఎవరో [...]

రాతలు - కోతలు: విశ్వనాథ వారి కిన్నెరసాని!

2009-01-06 02:52 AM కస్తూరి మురళీకృష్ణ

తెలిసిన దాని నుంచి తెలియని దానికి ప్రయాణం చేయటం ఒక పద్ధతి. అందుకే, విశ్వనాథ వారి సహితీ సముద్ర పరిచయాన్ని కిన్నెరసాని పాటలతో ఆరంభిస్తున్నాను.

కిన్నెరసాని చాలామందికి తెలుసు. అవి చదవకున్నా, కనీసం, కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెలపైటేసీ, అనే పాట పుణ్యమాని అయినా తెలుసు.

కిన్నెరసాని కథ హృద్యమయినది.

భర్తపైన అలిగి కిన్నెరసాని వాగై ప్రవహిస్తుంది. అయితే, సంసారమనే రక్షణ కవచాన్ని త్యజించిన మహిళ పురుషులకు చులకన. పురుష హృదయానికి ప్రతీకలాంటి సముద్రుడు, కిన్నెరసానిని చూసి మోహిస్తాడు. ఆమెని కబళించేందుకు చెలియలికట్ట దాటేందుకు సుద్ధపడతాడు.

ఇది కిన్నెరసానిలో వేదన కలిగిస్తుంది. భయం కలిగిస్తుంది. ఆమె దయనీయ దుస్థితిని గమనించిన గోదావరి ఆమెక్ అభయాన్నిస్తుంది. ఆమెను తనలో కలిపేసుకుని సముద్రుడికి కనబడకుండా చేస్తుంది. రక్షణ నిస్తుంది. ఇదీ కథ.

ఆ కాలంలో, అప్పుడప్పుడే, సంసారమనేది అందమయిన అనుబంధంకాక, లోహ పంజరమన్న ప్రచారం మొదలయింది. మహిళా విముక్తి అంటే, స్త్రీ సంసార బంధనాలు, సామాజిక నియమ నిబంధనలు త్రెంచుకోవటమే అన్న ప్రచారం బలంగా సాగేది. ముందు వెనుకలు గ్రహించకుండా, తాత్కాలికాలపైనే దృష్టి వున్న సమాజం గుడ్డిగా అదే ఆధునికము, అభ్యుదయమూ అనుకుంది.

కవి ద్రష్ట అయివుండాలి. తాత్కాలిక ఆవేషాలకతడు లోను కాకూడదు. తన భావావేశానికి, సృజనాత్మక పరవశాన్ని జోడించి, విచక్షణను కలిపి కవిత ద్వారా ప్రజలను జాగృతులను చేయాలి. భూతకాలాన్ని అర్ధం చేసుకుని, వర్తమానాన్ని అవగాహన చేసుకుని, భవిష్యత్ దర్శనం చేస్తూ, ప్రజలకు మార్గ దర్శనం చేయాలి. అలాకాక మామూలు ఆవేశాలకు అక్షర రూపం ఇచ్చేవారు మామూలు రచయితలలా మిగిలిపోతారు. తాత్కాలికంగా పెరౌ సంపాదించినా, శాశ్వతంగా సమాజానికి నష్టం కలిగించిన వారవుతారు. ఎవరయితే, ఆవేశానికి విచక్షణ జోడించి, తాత్కాలికాలవైపు కాక శాశ్వతాలవైపు దృష్టి సారిస్తారో వారు ద్రష్టలవుతారు. అందుకే విశ్వనాథ ద్రష్ట!

అప్పుడు, మహిళలను రెచ్చగొట్టటం, అసంతృప్తులను ఎగదోయటం, తాళి తెంపి పారేసి బంధనాలను తెంచుకోమనటం ఫాషన్. అలా రాసివుంటే విశ్వనాథ వారికి సమాజామోదం లభించేది. పేరు ప్రఖ్యాతులు దక్కేవి. కానీ, అలా చేసి వుంటే ఆయన విశ్వనాథ వారయ్యేవారు కాదు. ఆయన గురించి ఈనాడు చర్చించేవారమూ కాదు.

ఎంతటి చేదు నిజమయినా తాను మంచి అనుకున్నదాన్ని, అన్ని వ్యతిరేకతలను తట్టుకుంటూ ప్రకటించేవాడు నిజమయిన రచయిత. అలాంటి అచ్చమయిన రచయిత విశ్వనాథ.

కిన్నెరసాని కథను గమనిస్తే కవి ప్రత్యక్షంగా చెప్తున్నదానికంటే ప్రతీకాత్మకంగా చూపిస్తున్నదే ప్రాధాన్యం అని అర్ధమవుతుంది.

కిన్నెరసాని భర్తను త్యజించింది. రక్షణను కాదంది. ఇప్పుడామె అరక్షిత. సముద్రుడు వెంటపడ్డాడు. ఒంటరి మహిళను చూస్తే సామాజిక స్థాయితో సంబంధంలేకుండా ప్తతి పురుషుడూ కౌటిల్య కడలిలాంటి వాడవుతాడు. ఇదీ మనం అనుభవిస్తున్నదే. అలాంటి మహిళకు రక్షణ నిచ్చేది తల్లి గోదావరి. ధర్మానికి, సామాజిక సూత్రాల అనుసరణకూ ప్రతీక గోదావరి. ఇప్పుడు, కిన్నెరసాని రచన స్వరూపమే మారి పోతుంది. ప్రస్తుత సమాజంలో మనము చూస్తూ, అనుభవిస్తున్న అనేక వికృతుల స్వరూప స్వభావాలు అర్ధమవుతాయి. ద్రష్టత్వం అంటే ఏమిటో బొధపడుతుంది. ఇది చూడలేని వారు, సముద్రం వొడ్దున దూరంగా కూచుని సముద్రంలోకి రాళ్ళు విసిరే అల్పులే తప్ప అన్యులు కారని అర్ధమవుతుంది.

తన కావ్యాన్ని విశ్వనాథ విలిఖించిన తీరు అత్యంత ఆధునికమూ, అమోఘమూను. ఇది, అర్ధంకాదని, కొరుకుడుపడదని, విశ్వనాథ పాతను పట్టుకుని వ్రేలాడతాడని విమర్శించేవారి అఙ్నానాన్ని, కుత్సితత్వాన్ని బట్టబయలు చేస్తుంది. కొన్ని ఉదాహరణలు చూడండి, మీరే నిర్ణయించుకోండి.

తన మీద కోపించిన భార్యను భర్త వేడుకోవటం చూడండి

ఇంత కోపమేమిటికే/ ఇంత పంత మేమిటికే/ ఇంతలు జగమున పతులకు/ నింతులు సేయుదురటే…. ఇందులో అర్ధం కానిదేమయినా వుందా? అర్ధం కాని వారికి తెలుగు రాక పోవటమే కాదు హృదయం కూడా లేదని వెర చెప్ప నేల?

నదిలా మారిన భార్యను చూస్తూ,

వెన్నెలవలె తెల్లని నీ/ సన్నని మేని పసందులు/ కన్నులకు కనిపించెను/ చిన్న తరగ చాలు వోలె,

నీ యొయ్యారపు నడకలు/ మాయురే! కనిపించెను పో/ మలకలుగా ప్రవహించిన సెలయేటి భవన్మూర్తిని..

నీనవ్వులు నురుగులుగా/ నీ వళులవి తరగలుగా/ నీ కన్నులు మీనులుగా/ నీ సరణిని ప్రవించెదు…

నీ జఘనము నిసుక తిన్నె/ గాజూచిన నా కన్నులు/ ఊడిపడవు నేల పైన/ నురిసిపోవు లోనె లోనె…

అంటాడు విలపిస్తూ.

ఇందులో అర్ధం కానిదేముంది?

వళులు అంటే బట్టకుచ్చు. ఇది ఇప్పుడు అంతగా వాడుకలో లేదు. ఇలా అర్ధం కానివి రాయొద్దనటం వల్ల అనేక పదాలు అదృష్యమయ్యాయి.

ఇక, కిన్నెరసాని నదిగా మారినప్పుడు నాథుని వర్ణన, వేదన చూడండి.

పరుగెత్తెడు నీ వేణీ/ బంధము పూనితి చేతను/ కరమున వేణికి బదులుగ/ కాళ్వగట్టె నీటి పొరలు…

అద్భుతం. పరుగెత్తుతున్న ఆమె జడ పట్టుకుంటే చేతిలో జడబదులు నీటి పొరలు కాలువయ్యాయట. జడ ఎలా ముడులు ముడులు వేసి వుంటుందో, నది నీరు అలా ప్రవహిస్తుంది. అందుకే స్త్రీ జడను వేణీ అంటారు. నదినీ వేణీ అంటారు. కవి ఊహ, సృజనాత్మక భావావేశం, ఔచిత్యం పాటిస్తూ అక్షరాలద్వారా దృష్యాన్ని సృజించే ప్రతిభాపాటవాలకిది తిరుగులేని నిదర్శనం.

ఇందులో కొరకరాని కొయ్య ఏముంది? అభ్యుదయ నిరోధక భావం ఏముంది? ప్రగతి నిరోధకమేముంది? ఎవరికయినా అవి కనిపిస్తే అవి వారిలో వున్నవే తప్ప విశ్వనాథవారిలో వున్నవి కావు.

ఎడమచేత నీకొంగును/ ఒడిచిపట్టుకుంటే చెలీ/ తడిచేతను కొంగు లేక/ తడబడితిని ప్రియురాలా! వివరణ అవసరమా?

నీవే యిట్లయితివిపో/ జీవములుందునే నామై/ నీవలె నేను ప్రవాహం/ బై వచ్చెద, రానీవే…

నిను కౌగిట నదిమిన నా/ తనువుపులకలణగలేదు/ కనువిప్పితినో లేదో/ నిను కానగలేనైతిని-

నీకై యేడిచి/ నా కంఠము సన్నవడియె/ నా కన్నులు మందగించె/ నా కాయము కొయ్యబారె…

ఈ యేడుపు రొదలోపల/ నా యొడలె నేనెరుగను/ నా యీ దేహమిదేమో/ రాయివోలె నగుచున్నది…

భర్తను విడచిన భార్య నది అయితే, భార్య దూరమయిన భర్త రాయి అయిపోయాడు. విచ్చిన్నమయిన వైవాహిక బంధం వ్యక్తుల మనస్సులపైన చూపే ప్రభావాన్ని ఇంతకన్న ప్రతిభావంతంగా ఎవరు చూపగలరు.

ఇది, కిన్నెర సానిలో తొలి అధ్యాయం మాత్రమే. మిగతా రేపు.

      

2009-01-05

THE iNSIDER: Complete Jail Note Book of Bhagat Singh

2009-01-05 03:09 PM Sridhar (noreply@blogger.com)
Jail Note Book of Shahid Bhagat Singh Publish at Scribd or explore others: Asian History jail note book indian freedom strug This Diary / Jail Note Book can be downloaded from here

రాతలు - కోతలు: శ్రీ విశ్వనాథ సత్యనారాయణ-ఒక పరిచయము.

2009-01-05 02:22 PM కస్తూరి మురళీకృష్ణ

నిజానికి విశ్వనాథ వారి సాహిత్యాన్ని పరిచయమ్ చేస్తూ సీరీస్ గా రాయాలని అనుకున్నాను. కానీ ఈలోగా ఇటీవలె ఒక బ్లాగులొ ఆయన గురించిన ఒక సమీక్శ చదివిన తరువాత ముందు అడుగు వేస్తే మంచిదనిపించింది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బ వేయాలి. చర్చలు వాడిగా వున్నప్పుడే వాదించాలి.

విశ్వనాథ వారిని విమర్శించటం చాలా సులభమ్. అందుకోసమ్ కొత్త పదజాలాన్ని వెతకనవసరంలేదు. కొత్తగా పరిశొధనలు చేయనవసరం లేదు. ఆయనను విమర్శించటమ్వల్ల లాభాలే తప్ప నశ్టాలేవే లేవు. ఆధునిక వాదిగా గుర్తింపు పొందవచ్చు. అభ్యుదయవాదిగా, కుల, మత, వర్గ, వర్ణ సంకుచిత భావాలు లేని విశాలహ్రు్దయుడిగా అందరినీ నమ్మించవచ్చు. ఆయనను దూశించటమ్వల్ల మన లోపాలను, పాపాలను కప్పిపుచ్చుకోవచ్చు.

అందుకే తెలుగు భాశ రానివారయినా సరే, తెలుగు గురించి ఏమీ తెలియనివారయినా సరే, ఎంత సంకుచిత భావాలకు దాసులయిన వారయినా సరే విశ్వనాథ వారిని తిడితే వారి పాపాలన్ని పోయి పుణ్యాత్ములయిపోతారు. సర్వ జనామోదాన్ని పొందుతారు.

అయినా సరే విశ్వనాథ వారి సాహిత్యాన్ని చదివినవారు ఆయనని అభిమానిస్తారు. ఆయనను ఆరాధిస్తారు. ఎన్ని అడ్డంకులను, ప్రతికూలతలను ఎదుర్కొంటూ కూడా ఆయనను సమర్ధిస్తారు.

ఆయనను చాలా మంది పండితుడని కొట్టేస్తారు. బూజు పట్టిన పాత భావాలను అనుసరిస్తాడని ఈసడిస్తారు. కఠిన గ్రాంథికమ్ రాస్తారని. ఎవారికీ అర్ధంకాని రాతలు రాస్తాడని వెక్కిరిస్తారు. ఒకటొ, రెండో ఆయన రచనలు చదివిన వారు అన్నీ చదివేసినట్టు, ఇక చదవాల్సినవేవీ లెఅనట్టు మాట్లాడతారు.

కానీ, ఆయన వల్ల ప్రెఅరణ పొందిన వారు మాత్రమ్ ఆయనను గురుతుల్యునిగా భావించి పూజిస్తారు. ఆయన బాట అనితరసాధ్యమ్ అని తెలిసినా ఆ బాటలో తప్పటడుగులు వేయాలని ప్రయత్నిస్తారు. ఆ తప్పటడుగులవల్ల వారి ప్రతిభకు మించిన గుర్తింపు పోందుతారు. అలాంటి వారిలో నేనూ ఒకడిని. అందుకే పనికట్టుకుని ఆయనను పరిచయమ్ చెఅస్తున్నాను.

అందరూ ప్రయాణించే దారిలో ప్రయాణం చాలా సులభం. కొత్తదారి కనుక్కోవటం చాలా కశ్టమ్. కానీ, పాత దారిలో ప్రయాణిస్తూ, ఆ దారిని కొత్త పుంతలు తొక్కించటం సామాన్యులకు సాధ్యమ్ కాదు. అలాంటి అసామాన్యుడు విశ్వనాథ.

ఆయన ఎవరికీ అర్ధం కాని భాశలో రాస్తాడనే వారు విశ్వనాథ వారిని చదవలేదు.

విశ్వనాథ వారి సాహిత్యాన్ని చదివితే, ఏకవీర నాటి, ఆయన తెలుగుకూ, నందిగ్రామ రాజ్యమ్ నాటి తెలుగుకూ ఎంతొ తేడా కనిపిస్తుంది. పురాణ వైర గ్రన్థమాల తెలుగుకూ, పులుల సత్యాగ్రహం తెలుగుకూ తెఅడా వుంటుంది. రాజతరంగిణి తెలుగుకూ, విశ్ణు శర్మ ఇంగ్లీశు చదువుకూ తెఅడా వుంటుంది. వరలక్శ్మి త్రిశతి తెలుగుకూ కిన్నెరసాని తెలుగుకూ తెఅడా వుంటున్ది. ఆయన్ మధ్యాక్కరలకూ, కల్ప వ్రుక్శానికి తెడా వుంటుంది. జేబు దొంగలు నవలకూ, దమయంతీ స్వయంవరానికీ, చెలియలికట్టకూ తెఅడా వుంటుంది. అంటే, వీళ్ళంటున్నట్టు, ఆయన ఎదుగుదల, కదలిక లేని, మురుకిగుంట కాదు, నిరంతరమ్ ప్రవహిస్తూ, పరిణామశీలి అయిన అనంత జల ప్రవాహం. ఇది తెలుసుకోకుండా, తెలుసుకున్నా, నిజం చెప్తె, ఎక్కడ తమ నైచ్యం బయట పడుతుందో నన్న భయమ్తో, ఈనాటికి కూడా ఆయనను అవే విమర్శలతో, అదే రకంగా దూశిస్తూనె వున్నారు. ఇది గమనిస్తేనే, ఆయన గొప్పతనమ్ తెలుసుకోవచ్చు. ఒక వ్యక్త్యి మరణించి ఇన్నేళ్ళయిన తరువాత కూడా, పేరు చెప్తేనే ఉలిక్కిపడే వారింత మంది వున్నారంటే ఇక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇది ఆరంభం మాత్రమే. ఇక వీలు వెంబడి విశ్వనాథ వారి రచనలను పరిచయం చెఅస్తాను.

ఆయనను కుల తత్వ వాది అనేవారెందరో అనేక సందర్భాలలో ఇతర కులాల పైన ద్వెఅశాన్ని, తక్కువ కులాలవారి పైన చులకనను, స్వకులం వారి పైన ప్రేమను బహిరంగంగా చూపారు. అయితే, విశ్వనాథ వైపు వేలు చూపించి, ద్రుశ్టిని తమ వైపు నుంచి మళ్ళించుకున్నారు.

మన దేశం లో కుల భావనకు అతీతంగా ఎవ్వరూ లేరు. కానీ, అందరో విశ్వనాథ వారి వల్ల తమ నేరాన్ని కప్పిపుచ్చుకోగలుగుతున్నారు. చివరికి, జాశువా కూడా, మతం మారినా కులం మారలేదని వాపోయాడు. క్రీస్తును ఆశ్రయించినా, మాలా క్రీస్తు వేరు, మాదిగ క్రీస్తు వేరు అని ఖండికలు రాసి, వేదనను వెళ్ళ గ్రక్కుకున్నాడు.

కాబట్టి, విశ్వనాథను తిట్టటం మాని ఆయన సాహిత్యం గురించి. తెలుసుకుని, చదివి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఆదిశగా, ప్రోత్సహించేందుకు, నేను, నా వ్యాసాల ద్వారా, ఆయన రచనల పరిచయాల ద్వారా నా వంతు ప్రయత్నాలు చేస్తాను. అందుకు ఇది నాందీ ప్రస్తావన మాత్రమే!

      

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: వర్డ్ డాక్యుమెంట్లని రిపేర్ చెయ్యడానికి …

2009-01-05 11:40 AM nallamothusridhar
సడన్‌గా కంప్యూటర్ క్రాష్ అవడం ద్వారా ఏవైనా వర్డ్ డాక్యుమెంట్లు ఓపెన్ అవకుండా కరప్ట్ అయినట్లయితే వాటిని రిపేర్ చేసి తిరిగి ఓపెన్ అయ్యేలా చెయ్యడానికి Doc Repair అనే ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్స్ ఉపయోగించి Word 6, Word 95, Word 97, 2000, XP, 2003  వంటి వివిధ word  వెర్షన్లతో డిజైన్ చెసుకున్న డాక్యుమెంట్లని రిపేర్ చేసి తిరిగి పని చేసేలా చేసుకోవచ్చు. The document name or file path [...]

తెలుగు పుస్తకం: ‘అట్ట’హాసం కాదు.. అక్షరాలకు అద్దం

2009-01-05 10:32 AM వీక్షణం

ఆంధ్రజ్యోతి నుండి…

ఇవాళ తెలుగు సాహిత్యంలో అసంఖ్యాకంగా వస్తున్న పుస్తకాల ముఖపత్రాలు అన్ని రకా లుగా బాగుంటున్నాయా?! ఆ ముఖపత్ర భాష ఎందరిని ఆకర్షించగలుగుతోంది? కొన్ని మంచి పుస్తకాలు సైతం పేలవమైన కవర్‌ పేజీతో చాలామంది దృష్టికి వెళ్లకుండానే మిగిలిపోవడం లేదూ..

కొన్ని పుస్తకాల్ని చూడగానే చేతిలోకి తీసుకోవాలనిపిస్తుంది. ముఖపత్రం పైన కాసేపు దృష్టి నిలిచిపోతుంది. పుస్తకంలోని ఆత్మ ముఖపత్రం ద్వారా మనలోకి ప్రసరిస్తుంది.. ఇవాళ తెలుగు సాహిత్యంలో అసంఖ్యాకంగా వస్తున్న పుస్తకాల ముఖపత్రాలు అలా ఉంటున్నాయా?! ఆ ముఖపత్ర భాష ఎందరు చదువగలుగుతున్నారు? అన్ని రకాలుగా అందంగా అమిరే ముఖపత్రాలు (కవర్‌లు) ఎన్ని? ఈ దృష్టితో పరిశీలిస్తే అత్యధికశాతం కవర్‌లు ఏదో ఒక లోపంతో కనిపిస్తుంటాయి.

కొన్ని మంచి పుస్తకాలు సైతం పేలవమైన డిజైన్‌తో పాలిపోయినట్లు కనిపిస్తాయి. పుస్తకంలోని కంటెంట్‌ బాగున్నా కవర్‌ పేజీ బాగుండక చాలామంది దృష్టికి వెళ్లని పుస్తకాలెన్నో.. ముఖ్యంగా బొమ్మ, పుస్తకం పేరు, రచయిత పేర్లతోపాటు బ్యాక్‌ కవర్‌ మ్యాటర్‌, మంచి పేపర్‌, చక్కటి రంగులు.. వీటన్నింటితో కూడిన కవర్‌ పేజీ పాఠకుడి దృష్టిని ఆకర్షించే అవకాశం వుంది. ఈ విషయమై డిజైనింగ్‌ కూడా చేస్తున్న కొందరు ఆర్టిస్టులను కదిపితే- మనదేశంలో అన్ని భాషల ముఖపత్రాల ‘డిజైన్‌’ కన్నా తెలుగు పుస్తకాల కవర్‌పేజీల డిజైనింగ్‌ చాలా బాగుంటోందని అంటున్నారు.

గతంలో ఆర్టిస్టే కవర్‌పేజి డిజైనర్‌. ఉదాహరణకు బాపు, శీలా వీర్రాజు, చంద్ర, బాలి, గోపి, ఉత్తమ్‌, మోహన్‌ టి.వి.ప్రసాద్‌, లక్ష్మణ్‌ ఏలే, రమణ జీవి, అక్బర్‌ వంటి చిత్రకారులు. క్రమంగా డిజైనర్‌ అనే ఒక పని కూడా ఎవాల్వ్‌ అయింది. ఇది బహుశా అడ్వర్జయిజింగ్‌ ఏజెన్సీస్‌ లేక విదేశాల ప్రేరణ కావొచ్చు. దానికి కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా తోడయి ఒక వృత్తి స్థాయిలో స్థిరపడింది. ఇందులో కేవలం ఒక ఆర్టిస్ట్‌ వేసిన బొమ్మలతోనే కాకుండా అనేక పద్ధతులతో కవర్‌పేజీలు చేసే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అసలు ఆ ఆర్టిస్ట్‌ వేసిన బొమ్మని ఆ ఆర్టిస్టే నమ్మలేనంత అద్భుతంగా ఎక్స్‌ప్లాయిట్‌ చేయగలిగే కంప్యూటర్‌ పరిజ్ఞానం డెవలప్‌ అయింది. కాబట్టి ప్రస్తుతం వస్తున్న కవర్‌పేజీలు ఎం తో విలక్షణంగా, ఎంతో విభిన్నంగా వుంటున్నాయి.

బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి కట్‌ కలర్‌ దాటి, మల్టీ కలర్‌ (4) ఇంకా ముందుకెళ్లి స్పెషల్‌ కలర్స్‌ (5,6,7) టెక్చర్‌ కలర్స్‌ దాకా.. మాప్‌లితో పేపర్‌ నుంచి 300 జిఎస్‌ఎమ్‌ ఫారిన్‌ మ్యాట్‌కార్డ్‌ దాకా.. లామినేషన్‌, మ్యాట్‌ లామినేషన్‌, స్పాట్‌ లామినేషన్‌ (యు.వి.) టెక్చర్‌ స్పాట్‌ లామినేషన్‌.. సైడ్‌ పిన్నింగ్‌ నుండి స్పైరల్‌ దాటి పర్‌ఫెక్ట్‌ బైండింగ్‌ క్రీజింగ్‌ దాకా.. ఇంక బొమ్మల విషయానికొస్తే.. ఇంక్‌ డ్రాయింగ్‌ నుండి వాటర్‌ కలర్‌, పోస్టర్‌ కలర్‌, చార్‌కోల్‌, పేస్టల్‌, పెన్సిల్‌ దాటి ఆక్రిలిక్‌ కలర్స్‌, ఆయిల్‌ కలర్స్‌ పెయింటింగ్స్‌ అట్ట మీద బొమ్మలుగా వస్తున్నాయి. ఇంకాస్త ముందుకెళ్లి డిజిటల్‌ డ్రాయింగ్స్‌ వస్తున్నాయి.. తొలిరోజుల్లో పుస్తకం పేరూ, రచయిత పేరు మాత్రమే కవర్‌ టైటిల్‌గా వుంటూ వచ్చింది. ఆర్టిస్టు వేసిన బొమ్మను అతను సూచించిన రీతినే బాక్సులోనో ఓపెన్‌గానో అట్టమీద పెట్టేసి అచ్చేసేవారు. తర్వాత్తర్వాత ఒకటీ రెండు రంగులు, లేదా మూడు రంగుల్లో కట్‌ కలర్స్‌ పద్ధతిలో బ్లాకులు చేసి అచ్చువేసేవారు. ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ రావడంతో మల్టీకలర్‌ ముఖచిత్రాలు విరివిగా వాడకంలోకి వచ్చాయి.

ఇవాళ సాహితీవేత్తలంతా మల్టీకలర్‌లో టైటిల్‌ వేసుకోడానికి యిష్టపడుతున్నారు. ఆర్టిస్టుతో బొమ్మ వేయించుకొని తమకిష్టమైన రీతిలో డిజైన్‌ చేయించుకుంటున్నారు. ఇక్కడ కొందరు కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ చేసే డిజైన్‌తోనే సరిపుచ్చుకుంటే మరికొందరు ప్రత్యేకంగా డిజైనర్లని ఆశ్రయిస్తున్నారు. బొమ్మ గీయడంతోపాటు డిజైన్‌ కూడా చేసిచ్చేవాళ్లు తక్కువ. ముఖ్యంగా డిజైనర్‌ స్వేచ్ఛకు వదిలిపెట్టకుండా రచయితలు పక్కన కూర్చుని విసిగించి తమ తెలియనితనాన్ని బైటేసుకుని పుస్తకాన్ని పాడు చేసే సందర్భాలు ఎక్కువ. ముందు డిజైనర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చి చూస్తే బాగుంటుందని ఆర్టిస్టులు అంటున్నారు. అయితే ఇక్కడ బొమ్మ గీసే ఆర్టిస్టుల్లోనూ వారి భావజాలాలు, వారు ఎరిగిన జీవితాలు వారి ‘లైన్‌’ని, ఆర్ట్‌ని ప్రభావితం చేస్తాయనేది అందరి గ్రహింపుకు వచ్చిన విషయమే.

కొందరి గీత ఒక వర్గపు జీవన రేఖను దాటి రాలేదని, మరొకరి గీత అట్టడుగు వర్గాల జీవితాల్ని మాత్రమే పట్టి ఇస్తుందనే విమర్శలున్నాయి. విభిన్న అస్తిత్వ వాదాల నేపథ్యంలో కొందరి బొమ్మలు అవుట్‌డేటెడ్‌గా కనిపించవచ్చు, మరికొందరివి కొన్ని వర్గాలకే పరిమితమైనట్లు అనిపించవచ్చు.. అర్థం చేసుకోవాల్సిందల్లా రచయిత తన భావాలకు తగ్గ ఆర్టిస్టును డిజైనర్‌ను ఎంచుకున్నాడా లేదా అన్నదే. మొత్తంగా ముఖపత్రం పుస్తకం మీద తప్పక ప్రభావం చూపుతుందనేదే ఆర్టిస్టుల అభిప్రాయం. తెలుగు పుస్తకాల కవర్‌పేజీల డిజైనింగ్‌ సైంటిఫిక్‌గా మరింత మెరుగుపడాల్సిన అవసరం వుందని వారు చెబుతున్నారు.. చివరగా, సాహితీ విమర్శకులు కవర్‌ పేజీ మీద కూడా స్పందిస్తుంటే బావుంటుందని అనిపిస్తున్నది..

- స్కైబాబ

అర్ధవంతంగానూ ఉండాలి

మార్కెట్లో విడుదల చేసే ఏ వస్తువునైనా ఆకర్షణీయంగా చూపే వ్యాపార సంస్కృతి ఛాయలు యిప్పుడు గ్రంథ ప్రచురణలోకీ చొరబడ్డాయి. పుస్తకం టైటిల్‌ అందంగా వుంటూనే అర్ధవంతంగా కూడా వుండాలి. ఇటీవల కొందరు సాహితీవేత్తలు- ముఖ్యంగా కవులు పోస్ట్‌ మోడ్రన్‌ ట్రెండ్‌లను విమర్శిస్తూనే తమ పుస్తకాల కవర్‌ పేజీల మీది చిత్రకళలో మాత్రం అదే ట్రెండ్‌ అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌ని అచ్చువేసుకుంటున్నారు. దీనిలో అందమూ ఆకర్షణలకన్నా ఇతరులకంటే భిన్నంగా వుండాలనే ధోరణి కనిపిస్తుంది.

‘విషయంతో సంబంధం వుంటే మంచిదే, లేకపోయినా పరవాలేదు, ముఖచిత్రం మాత్రం అద్భుతంగా అనిపించాలి’ అనే ధోరణి చాలామంది సాహితీవేత్తల్లో కనిపిస్తోంది. ముఖచిత్రంలో బేసిక్‌ కలర్స్‌- పసుపు, మెజంటా, నీలం, నలుపు- రంగులను నేరుగా వాడడంకన్నా మిక్స్‌డ్‌ కలర్స్‌లో అయితే గాడీగా వుండకుండా కళ్లకి ఆహ్లాదకరంగా వుం టుంది. ముదురు ఎరుపు పక్కన ముదురు నీలంగాని, ముదురు ఆకుపచ్చ రంగుగాని వాడితే కళ్లకి యిబ్బందిగా వుంటుంది. ముదురు రంగుల పక్కన లేత రంగులుంటే ఆ చిత్రం బాగా ఎలివేట్‌ అవుతుంది. లామినేషన్‌ చేయిస్తే బొమ్మ అందం మరికొంత పెరుగుతుంది. పుస్తకం పేరుగాని, రచయిత పేరుగాని బొమ్మని మింగేసేటట్టు పెద్దవిగా వుండకుండా చూసుకోవాలి.

అప్పుడు టైటిల్‌ అందంగా కనిపిస్తుంది. సింగిల్‌ కలర్‌లో వేసినా కొన్ని టైటిల్స్‌ అద్భుతంగా అనిపించినవి వున్నాయి. ఇది ఆర్టిస్టు వేసిన చిత్రంపై ఆధారపడి వుంటుంది. ఒకే రంగులో స్క్రీన్‌లు రకరకాలవి యిస్తూ ఎంతో ఎఫెక్టివ్‌గా బొమ్మని ఆఫ్‌సెట్‌ ప్రింటింగులో చూపించే సౌకర్యం వుంది. నా మట్టుకు నేను స్వేచ్ఛగానే డిజైన్‌ చెయ్యగలుగుతున్నాను. పూర్తి బాధ్యత ఆర్టిస్టు మీదే వేసినప్పుడు మరింత జాగ్రత్తగా చేయాల్సివస్తుంది. బాపు, మోహన్‌ లాంటి ఆర్టిస్టులు వేసే టైటిల్‌ కవర్స్‌ పుస్తకం తెరవాలనిపించేటట్టు చేస్తాయి. చాలామంది రచయితలు కవులు ఫలానావారే తమ పుస్తకాలకు ముఖచిత్రాలు వేయాలని కోరుకోవడం, వాటికోసం నెలల తరబడి ఎదురుచూడ్డం అందుకే.
- శీలా వీర్రాజు

ఆత్మ ప్రతిఫలించాలి

ఇవాళ పెయింటింగ్‌లను తీసుకొని కవర్‌ డిజైన్‌ చేయడం జరుగుతున్నది. కవిత్వంలో ఉండే మార్మికత (అబ్‌స్ట్రాక్ట్‌నెస్‌) డిజైనింగ్‌లోకి కూడా వచ్చింది. సమకాలీన  చిత్రకళను ఉపయోగించుకోవడం గమనించొచ్చు. కంప్యూటర్‌ విరివిగా ఉపయోగంలోకి వచ్చాక గ్రాఫిక్స్‌, ఫోటోషాప్‌ ఉపయోగం పెరిగింది. దాంతో డిజైనింగ్‌ పూర్తిగా మారిపోయింది. ఇవాళ గ్రాఫిక్‌ డిజైనింగ్‌నే చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

నా దృష్టిలో అందం అనేదానికి నిర్వచనం వేరు. నేను డిస్టార్షన్‌ బొమ్మల్ని ఎక్కువ ఇష్టపడతాను. కంటెంట్‌ను బట్టి దానికి సమాంతరంగా ఊహించి బొమ్మ వేస్తాను. ఆర్టిస్టుగా నా వ్యాఖ్యానం నేను చేస్తాను. రచనలోని భావమే కాకుండా అది చదివిన ఆర్టిస్టుగా తన ఇంటర్‌ప్రెటేషన్‌ ప్రత్యేకంగా ఉండాలనేది నా అభిప్రాయం.
నాకు సంతృప్తి కలిగినట్లుగానే చేస్తాను. వేరేవారి ఐడియాను తీసుకోను. నా సొంత ఐడియాను ఎవరైతే తీసుకుంటారో వారికే నేను డిజైన్‌ చేసిపెడుతుంటాను. రచయితతో మాట్లాడి, చదివి బొమ్మ వేస్తాను. రచన యొక్క ఆత్మ బొమ్మలో ప్రతిఫలించేలా ప్రయత్నిస్తాను. క్లిప్‌ ఆర్ట్‌ను తీసుకోను. గ్రాఫిక్‌ను గ్రాఫిక్‌ డామినేట్‌ చేయకుండా చూసుకుంటాను. ఒరిజినల్‌గా నేను డ్రా చేసినవే వాడుతాను. ఒక్కోసారి నా పెద్ద పెద్ద పెయింటింగ్స్‌నే ఆ పుస్తకానికి నప్పుతుందనుకున్నదాన్ని వాడతాను.

పాఠకుల్ని ఆకర్షించడం అనేది ఆర్టిస్టు చేసే డిజైన్‌ను బట్టి ఉంటుంది. మల్టీకలర్‌ అంటే అన్ని రంగులూ తప్పనిసరి వాడాలని అనుకుంటుంటారు. నేను కేవలం రెండు రంగులనే వాడి కూడా పెయింటింగ్‌ వేస్తాను. బ్లాక్‌ అండ్‌ బ్రౌన్‌, బ్లాక్‌ అండ్‌ రెడ్‌.. అలా! చాలామంది బ్లాక్‌ను కలర్‌ అనుకోరు. వైట్‌ను కూడా కలర్‌ అనుకోరు. సింగిల్‌ కలర్‌ను వాడి కూడా అద్భుతంగా మెప్పించవచ్చు. నా పెయింటింగ్స్‌ చాలా వరకు రెండు లేదా మూడు రంగులు మాత్రమే వాడినవి. వే ఆఫ్‌ ప్రెజెంటేషన్‌ అనేది చాలా ముఖ్యం. పోస్టర్‌ చూసి సినిమా చూసే సందర్భాలు చాలా ఉంటాయి. అట్లే పుస్తకం కవర్‌ చూసి చదివించే అవకాశమూ ఉంది.

- ఏలె లక్ష్మణ్‌

 చతుర్భుజమే అల్టిమేట్‌ కాదు

కవర్‌ అందంగా కనిపించాలంటే నేను చిత్రానికి ఎక్కువ స్పేస్‌ కేటాయిస్తాను. అక్షరాలను వీలయినంత సింపుల్‌గా ప్రయోగిస్తాను. ప్రధానచిత్రంలోంచే డామినెంట్‌ కలర్‌ను పిక్‌ చేసి దాన్నే అధికంగా వాడి ఎక్కువ కాంట్రాస్ట్‌ లేకుండా చేసుకుంటాను. డిజైన్‌ చేసేటప్పుడు రచయిత/కవి దగ్గర లేకుండా చూసుకుంటాను. కవర్‌ డిజైనింగ్‌ ఒక ఆర్టిస్టంత విస్తీర్ణమయిన ఆవరణ కాకపోయినా సంతృప్తికి సంబంధించిన మూలాలొకటే అనిపిస్తుంది రెండిటికీ. నాకయితే రంగులతో ఆడుకుంటున్నట్టుంది హాయిగా. నేను చాలా ఎంజాయ్‌ చేస్తాను. చేస్తున్న ప్రతి క్షణం సంతృప్తి చెందుతాను.

ఏ ఒకరో ఇద్దరో తప్ప నన్ను ఇలాగే చెయ్యమని, ఇలాగే కావాలని బలవంతం చేసినవాళ్లు లేరు. చాలామంది ఇది మీ పని మీకు నచ్చితే మాకు నచ్చినట్లే అన్నవాళ్లే. బ్లాక్‌ అండ్‌ వైట్‌ లేక సింగిల్‌ కలర్‌ కవర్లు పాఠకుల్ని తప్పకుండా ఆకర్షిస్తాయి. అందులో వుపయోగించే విజువల్‌ విలువని బట్టి. డిజైన్‌ చేసే పద్ధతిని బట్టి. నిజానికి పేరుకి మల్టీకలర్‌ ప్రింటింగ్‌ అయినా మోనోకలర్‌ వాల్యూస్‌తో చేసిన కవర్‌ పేజీలే చాలా హుందాగా వుంటాయి. ఒక వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయి, రంగులు రంగుల కవర్‌ పేజీల స్లిట్‌ పర్సనాలిటీలకంటే. సింగిల్‌ కలర్‌లో అంత డెప్త్‌ రాదు.

మల్టీ కలర్‌లో వచ్చే సింగిల్‌ కలర్‌ వాల్యూస్‌ బావుంటాయి. ముఖ్యంగా ఇవాళ కవర్‌ డిజైన్‌ ఎటు తిరిగీ చతుర్భుజంలోకి ఒదిగిపోవడమో, విస్తరించడమో జరిగింది. దాన్ని అధిగమించి డిఫరెంట్‌గా డిజైన్‌ చేయాల్సిన అవసరముంది. పాత పద్ధతుల్ని ప్రయత్న పూర్వకంగా వదులుకోవాల్సిందే. అందు కు కొత్తదనాన్ని స్వీకరించే మెత్తదనపు (్ఛ్ఠఞౌన్ఛ్చీఛజీజూజ్టీడ) ఆవశ్యకత చాలా అవసరం. కవర్‌ పేజి ప్రభావం కొత్త పుస్తకాల మీద తప్పకుండా వుంటుంది. కవర్‌పేజి అందంతోపాటు వెనక పేజీ మీద రాసివుండే ఆ పుస్తక సారాంశమో, లేక ఎవరివైనా ప్రముఖుల అభిప్రాయా లో కూడా పుస్తకం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఈ ప్రభావమంతా పుస్తకాన్ని తెరిపించేంత వరకే. తెరిచాక అందులో పుస్తకం ఆత్మ తప్పనిసరి. లేకపోతే అంతా వృధానే.
- రమణ జీవి

కవర్‌ డిజెనింగ్‌ ఒక సైన్స్‌

డిజైనింగ్‌ ఒక సైన్స్‌. ఆ అనుభవంతో కవర్‌ డిజైన్‌ చేయడం కళ. ముఖపత్రం అనేది పుస్తకం కంటెంట్‌ స్వభావాన్ని రిఫ్లెక్ట్‌ చేయాలి. విజువల్‌ ఈస్తటిక్‌ లాంగ్వేజ్‌ మీద అవగాహన, కొద్దో గొప్పో కంపోజిషన్‌ కుదురైన టైపోగ్రఫీ (అక్షరాలు రాయడం) మీద పరిజ్ఞానం వుంటే మంచి కవర్‌ పేజీ తయారవుతుంది. వీటితోపాటు సాహిత్యం మీద అభిరుచి కలిగివుండి, మనసుతో చేయగలిగివుంటే మంచి కవర్‌ డిజైన్లే వస్తాయి. నిజానికి నేను మొదట్లో.. కవర్‌ డిజైన్లు చేసేటప్పుడు పుస్తకం చదివి బొమ్మ వేసి డిజైనర్‌ దగ్గర కూర్చొని డిజైన్‌ చేయించేవాణ్ణి. కానీ నేననుకున్న ఫీల్‌ అంతగా కుదిరినట్లనిపించేది కాదు.

అందుకే నేనే గ్రాఫిక్‌ డిజైనింగ్‌ నేర్చుకుని బొమ్మ వేసుకుని డిజైన్‌ చేయడం వల్ల సరిగ్గా కావాలనుకున్న ఎఫెక్ట్‌తో చేయగలుగుతున్నాను. ఆధునిక పరిజ్ఞానం (కంప్యూటర్‌) అందించిన సౌలభ్యాన్ని కూడా అవసరం మేరకు వాడుకునే అవకాశం నాకు దీనివల్ల లభించింది. అది ఆర్టిస్టులకు అవసరం అనే భావిస్తాను. దీనివల్ల విజువలైజేషన్‌ విస్త ృతి పెరుగుతుంది. కంటెంట్‌ చేసిన డిమాండ్‌ మేరకు దీనిని వాడడం వల్ల కవర్‌ పేజీకి పూర్తి న్యాయం చేసిన వాళ్లం అవుతాం. కవర్‌ డిజైనింగ్‌లో లెజెండ్స్‌ అయిన ఆల్విన్‌ లస్టిగ్‌, పాల్‌రాండ్‌తోపాటు సమకాలీన ఇలస్ట్రేటర్‌ జాఫ్‌ గ్రాండ్‌ఫీల్డ్‌ అంటే నాకిష్టం.

పీటర్‌మెండల్‌సన్‌ డిజైన్స్‌ బాగుంటాయి. నేనెప్పుడూ కవి/రచయిత తనెక్కడ ముగించాడో అక్కడి నుంచి ఎక్స్‌టెండ్‌ అయ్యేలా బొమ్మ గీస్తాను. తను చెప్పదల్చుకున్నది ఏది వదిలేసాడో దాన్ని బొమ్మ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఇలస్ట్రేటర్‌ని. పెయింటర్‌ను. ఒక పెయింటింగ్‌ చేసినప్పటి అనుభూతి ఒక కవిత్వ పుస్తకానికో, కథల పుస్తకానికో బొమ్మ వేసినప్పుడు కలిగే అనుభూతి ఒకే విధంగా వుంటుంది. పుస్తకానికి పెట్టిన పేరు, కంటెంట్‌ను బట్టి నేను మీడియంను ఎన్నుకుంటాను. వాటర్‌ కలరా ? ఆక్రిలిక్‌ కలరా ? ఫిగరేటివ్‌ ఆబ్‌స్ట్రాక్ట్‌ వేయాలా ? చార్‌కోల్‌ డ్రాయింగ్‌ వేయాలా ? నిర్ణయించుకుంటాను

నేను చిత్రకారుడిగా ఎదిగే దశలోనే దళితవాద, స్త్రీవాద, ముస్లింవాద, తెలంగాణా, విప్లవోద్యమాలతో నడవడం వల్లే నా కవర్‌ బొమ్మలు గ్రామీణ జీవన మూలాల్నుంచి మాట్లాడతాయి. నేను ఒక సెట్‌ ఆఫ్‌ కలర్స్‌నే బొమ్మలో వాడతాను. కంటెంట్‌ డిమాండ్‌ను బట్టి కవర్‌ డిజైన్‌లో రంగులు వాడతాను. మోనో టోన్స్‌తో.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ తో చేసిన కవర్‌ పేజీలు బాగుంటాయి. డబుల్‌ కలర్స్‌ను కొందరు ఇష్టపడతారు. కవర్‌ మీదున్న రంగులు ఏ ఏజ్‌ గ్రూప్‌ వారికైనా అప్పీలింగ్‌లా వుండాలనేది నా అభిప్రాయం. ఆయా సమయాల్లో ఉద్యమాలు, కాల పరిస్థితులు కూడా కలర్స్‌ను డిమాండ్‌ చేస్తాయి. అదేవిధంగా అక్షరాలు, బొమ్మ చుట్టూ రిలీఫ్‌ బాగా వుండేట్లు చూసుకుంటాను.
- అక్బర్‌

      

తెలుగుదనం.కో.ఇన్ బ్లాగు: ఎందుకు, ఏమిటి, ఎలా ... - సీతాకోక చిలుక

2009-01-05 04:50 AM మురళీ కృష్ణ వలివేటి (noreply@blogger.com)
రంగు రంగు రెక్కలతో ఎగిరే సీతాకోక చిలుకను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది కదూ. అంతకు ముందు అది నల్లటి, పొడవైన వెంట్రుకలతో ఉన్న గొంగళిపురుగే అంటే అసలే నమ్మబుద్దికాదు. అదే మరి విచిత్రమంటే. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా ఎలా మారుతుంది అనేది మనం తెలుసుకుందాం. సీతాకోకచిలుకగా మారడానికి ముందు గొంగళిపురుగు ప్యూపా దశకు చేరుకుంటుంది. ఈ దశకు చేరుకోవడానికి గొంగళిపురుగు ఒక చెట్టు లేక మొక్కలోని అనువైన ఆకు కాండాన్ని

తెలుగుదనం.కో.ఇన్ బ్లాగు: పిల్లల ఆటలు - ద్రాక్షాపండు తియ్యానా? పుల్లనా? నాకేం తెలుసు

2009-01-05 04:37 AM మురళీ కృష్ణ వలివేటి (noreply@blogger.com)
ఎంతమందికావాలి : 10మంది. ఆటగాళ్ళ వయస్సు : 7సంవత్సరాల వయస్సు పై ఉండాలి. ఆడేస్థలం : ఆరుబయట. ముందుగా ఇద్దరు బాలురు / బాలికలు తమ పేర్లు ఏదైనా పండ్ల పేరు పెట్టుకోవాలి. ఉదా: ఒకరు ఆపిల్ పండు, ఇంకొకరు దానిమ్మ పండు అని పేరు పెట్టుకోవాలి. తర్వాత ఇద్దరూ చేతులు పైకెత్తి పట్టుకొని ఇంటి టాప్ లా చేసి నిలబడి ఈ ఇద్దరి చేతుల కింద నుంచి నడుస్తారు. ఆపిల్ పండు బాలుడు, దానిమ్మ పండు బాలుడు ఇద్దరూ ఇలా పాట పాడుతారు. "

తెలుగుదనం.కో.ఇన్ బ్లాగు: ఆహార పోషణ సూచిక - అన్నం - ఔషధం

2009-01-05 04:35 AM మురళీ కృష్ణ వలివేటి (noreply@blogger.com)
దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్ర దేశంలో సాధారణంగా అందరూ తినే ప్రధాన ఆహారం అన్నం. ప్రతి రోజూ తినే అన్నం గురించి, దానికోసం వాడే బియ్యం గురించి ఆలోచించం మనం. అంటే దానిలోని గుణాన గురించి, పోషక విలువల గురించీ ఆలోచించం. సాధారనంగా అందరూ ఆలోచించేది అన్నం అందంగా, తెల్లగా, విడివిడిలాడుతూ కనబడుతోందా లేదా అని మాత్రమే. అయితే కంటికి ఇంపుగా అన్నాన్ని తయారుచేసే పద్దహ్తిలో, అందులో ఉన్న పోషక విలువలు పోతున్నాయి.

2009-01-04

బ్లాగాడిస్తా!: పసిపాప నవ్వు

2009-01-04 03:36 PM రవి (noreply@blogger.com)
నిదురించే ప్రియురాలి పెదవిపైని ముద్దును దొంగిలించాను. అది ఎంత అందమైన దొంగతనం ! అంటాడు గాలిబ్. నిదురించే పసిపాప పెదవులపై చిరునవ్వును దొంగిలిస్తే? (మా పాప ౨ నెలల వయసులో ఉన్నప్పుడు, కెమెరా కన్నుకు చిక్కిన నిద్రలో నవ్విన నవ్వు. )

మనలోని మాట.. నా మనసులోని మాట: బ్లాగర్లలో ప్రత్యేకతలు-బ్లాగర్లకే అంకితం

2009-01-04 11:57 AM రమణి (noreply@blogger.com)
"తీపిరాగాల కోయిలమ్మకి నల్లరంగునలమిన వాడినేమి కోరేది? కడకు ఘర్జనల మేఘములకు మెరుపు రంగు పూసిన వాడినేమి అడిగేది?" సిరి వెన్నల సీతా రామశాస్త్రిగారి నిందా స్తుతి ఇది. పాట విన్నప్పుడల్లా, " ఎంత నిజమో కదా"! అని అనిపించక మానదు. కాని ఈ మధ్యో కొత్త ఆలోచన వచ్చింది. అదే చిన్నగీత - పెద్దగీ్త. స్కూల్లో మాష్టారు ఈ పెద్ద గీతని చెరపకుండా చిన్న గీతని చెయ్యమంటే, ఓ తెలివైన విద్యార్థి పక్కన చిన్నగీతని గీసాడట. అలా ఆ

రాతలు - కోతలు: బ్రహ్మ బుధ్ సూపర్ సినిమా చూశాడు!

2009-01-04 02:53 AM కస్తూరి మురళీకృష్ణ

మెదడు మగత మత్తులొకి జారుకుంటోంది. హాయిగా మత్తుగా వుంది. ఇంతలో హఠాత్తుగా మెదడు తలుపు భళ్ళున తన్ని, చెన్గున లోపలకు దోకాడు బ్రహ్మ బుధ్.

ఒరే అలా హఠాత్తుగా వచ్చి నన్ను చంపకురా, అని అందామనుకున్నా.

నాకు ఆ అవకాశమ్ ఇవ్వలేదు బ్రహ్మ బుధ్.

బహిర్భూమికి వెళ్ళె పొసిశన్ లోకూచుని, మల బద్ధకం తో బాధపడేవాడు అతి కశ్టంతో విసర్జిస్తూన్న ప్రయత్నాలు చెఅస్తున్నవాడిలా ముఖాన్ని ఎన్నెన్నో వంకరలు తిప్పుతూ, గొంతును కర్ణ కఠోరంగా అతి అసహ్యంగా, వొళ్ళు జలదరిన్చి వాంతి తన్నుకుని వచ్చేలా, చలి చలి గిలి గిలి ఎందుకో అసలేమిటో అని అదే పొసిశన్ లో వొళ్ళు ఊపుతూ పాడటం మొదలుపెట్టాడు.

చూడలేక, వినలేక, బ్రతకలేక, చావలేక, నిలవలేక, పరుగెత్తలేక చచ్చాను. కానీ చావలేదు.

ఏమిటిది, అని తన్నుకుని వస్తున్న వాంతిని అరచెఅత అడ్డుకుంటూ అడిగా.

ఇది డాన్సు, అది పాట. ఇది మాట. అది లోట.నాకు న్చ్చింది సూపర్ సినిమా అని మరో భయంకరమయిన పోస్ ఇచ్చాడు.

బాబూ, నువ్వు సినిమా చూసిన ప్రతిసారీ ఇలా నన్ను చంపటం బాగాలేదు. చెప్పాలనివుంటే కథ చెప్పిపో. అంతేకానీ ఇలా పాటలూ, పోసులతో నన్ను చంపకు, అని దీనంగా బ్రతిమిలాడుకున్నా.

నవ్వాడు నాగార్జునలా. అంతలో ఆయేశా తకియాలా కళ్ళు చికిలిన్చి, వొళ్ళు ఊపుతూ బంగారూ వీడేరా నా నిండు సెన్దురూడూ అంటూ పరుగెత్తటం మొదలుపెట్టాడు.

ఒక చోటా కూచుని చెప్పచ్చుకదా. ఇలా ఎందుకు పరుగులుపెడతావు, అని అడిగా.

పరుగులు పెడుతూనే వున్నాడు. ఆగి ఆగి బహిర్భూమి పోస్ ఇస్తూ, అసహ్యమ్గా బాధపడుతున్నట్టు చూపి, మళ్ళీ ఎటొఎందుకో తెలియకుండా పరుగులుపెడుతూనె వునాడు.

ఎఅమిటా పరుగులు నాయనా, ఎందుకా పరుగులు, అడిగా.

నాకు మోటార్ సైకిల్ కావాలి అడిగాడు.

ఎందుకని?

వీరుడిలా ఒక చక్రమ్ మీద నడపాలి. దారాలు కట్టుకుని ఎత్తునున్చి దిగి, కన్నుమూసి తెరిచేలోగా మోటార్ మీద ధూమ్ అంటూ పోవాలి.ఝూమ్ అంటూ ఎగరాలి అన్నాడు.

అవన్నీ ట్రిక్కులు, చేసేవి డూపులు, సినిమా అంటేనే భ్రమలు అన్నాను.

చీ పో, అన్నీ నన్ను నిరుత్సాహ పరచే ఆబద్ధాలు.. అసలా సినిమాలో ఇద్దరు వేరులున్నారు. ప్రధాన వీరుడు సూపర్. మోటార్ రేసులొ గెలిచి, ఓడిన వాడిని తన్ని నా బన్డి రిపేర్ చేసి తేసుకురా అనే గొప్ప సూపర్ వేరుడు. ఆడ వీరి డాక్టర్. మగవాడు మాటి మాటికీ శేక్ హాన్డ్ అంటూంటే ఎందుకొ తెలుసుకోలేదు. టీవీ కోసమై వీరుడి వలలో పడెనే పాపం పిచ్చి డాక్టర్, అయ్యో పాపం పిచ్చి డాక్టర్. అయ్యో పాపం తెలివి లేని డాక్టర్. ఇహిహి బుద్ధిలేని మొద్దు డాక్టర్ అని పాడాడు.

బాబూ డాక్టర్ చదవాలంటే ఎన్టొ తెలివి వున్డాలి. ఎంతో కశ్ఃట పడితే కానీ డాక్టర్ చదవలేరు తెలుసా, అనడిగాను.

అదే, తెలివంతా చదువులో పెట్టింది. వీరుడిని చోడగానే మతి పోయి. చలి గిలి అంటూ చెడ్డీ వేసుకుని బహిర్భూమికి పరుగుపెట్టింది, అన్నాడు.

సరే సినిమా కథేమిటి? అనడిగా.

కథా, అదెవరికి కావాలి? వేరుడున్నాడు. వీరుడున్నాడు. వీరి వుంది. వేరుడు దొంగతనాలు చేస్తాడు. కానీ వీరుడు కదా, పోలీసులు వదిలేస్తారు, అని గంభీరంగా నావైపు చూశాడు.

భయపడ్డా.

మేరు తీవ్రవాదుల దాడులు అరి కట్టాలంటే చట్టాలు కావాలని అడుగుతున్నారు. ఈ సినిమా చూడండి. దొంగలు వీరులు. గొప్ప గొప్ప పథకాలు వేస్తారు. అదే పోలీసులు చూడు. తనమీద వార్త రాసాడని జర్నలిస్టుని కొడతాడు. దొంగలు పిల్లలు ఉచ్చ పోస్తారు అని పిచ్చిగా మాట్లాడతాడు. ఇంకెవడొ సలహా ఇస్తూంటే వాడిని కొడతాడు. ఎవడొ దొంగను చూశానంటే వాడిని కొట్టి బొమ్మ గీయమని ఎదురుగా కూచుంటాడు. దొంగ జాడలు వెతకకుండా లాకప్ లో ఆ జోకర్ ని పెట్టి హింసిస్తాడు. మీ పోలీసులు ఇళా పరిశోధన వదలి జోకర్లని పట్టుకుని వేలాడుతూంటే దొంగలు మంచిగా దొంగతనాలు చేస్తున్నారు. మేరంతా చట్టాలు కట్టుదిట్టం చేయాలని ఏడుస్తారు.అన్నాడు.

ఏమిటీ హీరో దొంగనా? అడిగా.

గొప్ప దొంగ. వేరుడే కాదు, వేరుడి వేరుడూ దొంగే, వేరుడి ప్రేయసీ దొంగే. పోలీసులు తప్ప అందరూ దొంగలే. పోలీసులే వెర్రివాళ్ళు. హిహిహిహిహి

బాబో నీ సినిమా సూపర్ గా వుంది. నన్ను వదిలెయ్ అన్నాను.

అప్పుడేనా, ఇంకా కథ మొదలుకానేలేదు. అన్నాడు.

నేను స్ప్హహ కోల్పోయాను.

      

2009-01-03

తలపు: మంత్రుల రాజీనామాలు!

2009-01-03 08:02 AM సిరి (noreply@blogger.com)
అవినీతి వరదలై పారుతూనే ఉంది. ఆయేషాలు అన్యాయంగా బలై పోతూనే ఉన్నారు. యాసిడ్ వానల్లో స్వప్నాలు దగ్ధమౌతూనే ఉన్నాయి. రక్షక భటుల రాక్షస నీతి నిరాటంకంగా సాగుతూనే ఉంది. అన్నమో రామచంద్రా అంటూ రైతన్నలు, నేతన్నలు, మామూలు అన్నలు ఉరికొయ్యలు మోస్తూనే ఉన్నారు. అడపాదడపా బాంబులు ప్రేలుతూనే ఉన్నాయి. అక్కడక్కడా ఇంకా వంతెనలు కూలుతూనే ఉన్నాయి. ఎవడికి దొరికింది వాడు దోచేస్తూనే ఉన్నారు. కుంభకోణాల్లో ఎన్ని కోణాలో బయట

రాతలు - కోతలు: ఈ సినిమా తప్పక చూడండి-10.

2009-01-03 03:07 AM కస్తూరి మురళీకృష్ణ

కొన్ని సినిమాలు చూస్తూంటేనే మత్తిఉ లాంటి నిద్ర వస్తుంది. సినిమా పూర్తి కాకముందే సినిమాను మరచిపోతాము.
.opus
కొన్ని సినిమాలు చూసి, హాలు బయటకు వచ్చిన తరువాత మరచిపోతాము.

కొన్ని సినిమాలు కొన్ని రోజులవరకూ గుర్తుంటాయి.

కానీ, కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుంతాయి. ప్రతి క్ష?ణం మదిలో మెదలుతూ కలవర పెడుతూంటాయి. ఆలొచింప చేస్తూంటాయి. మానవ జీవితంలొని సున్నితమయిన అమ్షాలను అత్యంత హృద్యంగా ప్రదర్శించి, మనుషులలోని సున్నితత్వాన్ని తట్టిలేపుతాయి. జీవిత గమనంలో సందేహాలకు సమాధానాలిస్తాయి. మనిషిని మనిషిగా నిలపటంలో తమవంతు తోడ్పడతాయి. కళ అనేది మనిషిలోని మానవత్వాన్ని జాగృతంచేసి, అతడికి తాను, తనచుట్టూ వున్న సమాజం గురించి అవగాహన కల్పించేది అన్న నిజాన్ని నిరూపిస్తాయి.

అలాంటి అత్యద్భుతమయిన సినిమా మిస్టర్ హాలాండ్స్ ఓపస్.

సినిమా మొదటి దృష్యం నుంచీ కట్టిపడేస్తుంది.

ఇంకా పేర్లు ఆరంభమవుతూంటాయి, కథ స్వరూపాన్ని తెలియచెప్పుతూ నేపధ్య సంగీతం మొదలవుతుంది. తెరపైన పియానో వాయిస్తూ తన్మయత్వం చెందుతూ, సంగీతాన్ని సృజిన్స్తూ నాయకుడు కనిపిస్తాడు.

ఈ సినిమాలో కథానాయకుదు సంగీత విద్వాంసుడు. గొప్ప సంగీతకారుడయిపోవాలని కలలుకనేవాడు. కానీ, తప్పని సరి పరిస్థితులలో ఒక స్కూలులో సంగీతం మాస్టారు ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అయిష్టంగా ఉద్యోగంలో చేరతాడు. పిల్లలను చూస్తూంటే విసుగు వస్తుంది. వాళ్ళకు పాఠాలు చెప్పాలంటే చిరాకు వస్తుంది.

ఈ సందర్భంలో ఒక మంచి మాట వినిపిస్తుంది సినిమాలో.

నాయకుడు, స్కూలయిపోగానే ఇంటికి పరుగెత్తుతూంటాడు. ప్రిన్సిపాలు అతడిని పలకరిస్తుంది. పిల్లలకు తాను బాగానే చెప్తున్నాను కానీ వాళ్ళాకి ఆసక్తి లేదన్నట్టు మాట్లాడతాడు హీరో. దానికి ఆమె, ప్రతి అధ్యాపకుడికి రెండు విధులుంటాయి. ఒకటి పిల్లలకు విఙ్నానాన్ని అందివ్వటం. రెండు, ఆ ఙ్నానాకి ఒక దిశను ఇవ్వటం. దాన్ని విచక్షణ్భతో పిల్లలు ఉపయోగించుకునేట్టు చూడటం. నువ్వు మొదటి పని చేస్తున్నావు. రెండోది సరిగ్గా చేయటంలేదంటుంది. ఎంతో అర్ధవంతవయిన సంభాషణ ఇది.

ఇది హీరో ఆలోచనలో మార్పు తెస్తుంది. పిల్లలను గమనిస్తాడు. వారికి సంగీతంపైన ఆసక్తి వున్నా పాఠ్యామ్షాలు విసుగు కలిగిస్తున్నాయని అర్ధం చేసుకుంటాడు. వాళ్ళలోని తపనను, వారి ఆలోచనల దిశను గమనిస్తాడు. వారికి ఆసక్తి కలిగంచే అమ్షాల ఆధారంగా బోధన ప్రారంభిస్తాడు.

ఫలితాలు కనిపిస్తాయి. పిలలకు హీరో ప్రీతి పాత్రుడవుతాడు. పిల్లలకు బోధిస్తూ ఆయనకూడా ఆనందం అనుభవిస్తూంటాడు. అతని బోధన పద్ధతులు భిన్నంగా వుండటంతో వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. కానీ, ఏదయిన పని ఇతరులకు భిన్నంగా చేసే తెగువ వున్నవాడు, ఫలితంగా ఎదురయ్యే వ్యతిరేకతనూ ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలి. హీరో అన్ని నిరసనలను ఎదుర్కొంటాడు.

ఇంతలో అతని భార్య గర్భవతి అవటంతో, తప్పని సరిగా వ్య్ద్యోగంలో కొనసాగాల్సి వస్తుంది. అతడికి కనీసం తన కొడుకుని సంగీత కారుడిని చేయాలని వుంటుంది. కానీ, అతని కొదుకు చెవిటివాడవుతాడు. అత్యద్భుతమయిన సన్నివేశం ఇది.

స్కూలు ఫుట్ బాల్ ఆటకని మార్చింగ్ బాండ్ సంగీతం తయారు చేస్తాడు. వూరంతా ఆ బాణీకి నాట్యం చేస్తూంటుంది. హీరో జీవితంలో అత్యంత ఆనందకరమయిన ఘట్టం అది. ఇంతలో ఒక హాఋన్ కర్ణ కఠోర