2009-01-06
నా మదిలో ...: మా ఊరి గాలి ...
యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి: !
2009-01-05
మనిషి: సుషుప్తి - విముక్తి
సౌమ్య: ఎక్కడ్నుంచి ఎక్కడికి…
నిన్న ఓ స్నేహితురాలికి వీడ్కోలు ఇచ్చి పంపేశాక వద్దనుకున్నా ఆలోచనలెన్నో నన్ను చుట్టుముట్టాయి. “వీడుకోలే దేనికైనా..” అని మొదలై, “ఎవరూ నీ వారు కారు..” మార్కు వేదాంతానికి వచ్చి, చివరికి “ముసుగు వేయొద్దు మనసుమీద” అనుకుని వచ్చే ఉద్వేగాన్ని యధేచ్ఛగా తిరగనిచ్చాను. కట్ చేస్తే, ఇరవై నాలుగు గంటలు గడిచాక కూడా “Ah! parting!” భావన తాలూకా ఆలోచనా స్రవంతి నన్ను వదల్లేదని ఒకట్రెండు చిన్ని చిన్ని సింగిల్ ఫ్రేం ఘటనల తరువాత అర్థమైంది. ఆలోచిస్తూ ఉంటే “స్నేహానికన్న మిన్న లోకాన లేదురా” మార్కు ఉద్వేగాలను ఒక పక్కన పెడితే, అసలు స్నేహమంటే ఏమిటి? ఎలా పుడుతుంది? ఏ స్నేహం స్థిరమైన బంధమౌతుంది? ఏది నిలవదు? నిలవడం నిలవకపోవడం దేనిపై ఆధారపడి ఉంటుంది? - ఇలాంటివే ఎన్నెన్నో ప్రశ్నలు వచ్చాయి. అప్పటి నా ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చే ప్రయత్నం ఈ టపా.
- అని దాదాపు నెలక్రితం మొదలై బుట్టదాఖలైన టపా ఇది. డస్ట్ బిన్ అయితే శుభ్రం చేయకూడదా? అని “మెంటల్ కృష్ణ” మార్కు తెలివి తేటలతో ఆలోచించి మళ్ళీ దీనికి ఊపిరూదాలని నిశ్చయించాను. హుమ్… ఇప్పుడాలోచనలు అరక్షణానికో దారిలోకి తిరుగుతున్నాయి. స్నేహాలు ఎవరితోనన్నా కావొచ్చు, దేనితోనన్నా కావొచ్చు. స్నేహితుడనో, స్నేహితురాలనో ప్రత్యేకంగా ఎవరూ పుట్టరు-ఎవరైనా స్నేహపాత్రులు కావొచ్చు. ఓ పుస్తకమో, ఓ వస్తువో మనతో స్నేహాన్ని పంచుకోవచ్చు. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కనుకనే ’స్నేహానికన్న మిన్న..’ అన్నది. కానీ, వెంటనే - ఎలాగో చివరికి విడిపోవడమే కదా, ఎందుకిక ఈ నెయ్యాలూ, వియ్యాలూ వగైరా బంధాలూ? అనిపిస్తుందొక్కోసారి. అలా అలా దొరికిన ప్రతి దారి వెంబడి ఆలోచనలని తీసుకు వెళుతూ వెళుతూ “పుట్టుకేమిటి? చావేమిటి? మధ్యలో ఈ జీవితమేమిటి?” అన్న ప్రశ్నల ద్వారా మానసిక వ్యభిచారానికి గురవబోతూ తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా సుమారుగా గాయపడి, కాస్త కాస్తగా కోలుకుంటూ ఉండగా మళ్ళీ స్నేహమన్న పదం ప్రత్యక్షం!
నాలో నేను, నాతో నేను సంఘర్షించుకుంటూ, దెబ్బల్ని చూసుకోడానికి అద్దం వైపు తిరిగాను. అద్దంలో తెల్ల వస్త్రాల్లో నా అంతరాత్మ కనిపించి - “జిందగీ ఎక్ సఫర్ హై సుహానా..” అని పాడటం మొదలుపెట్టింది. ఇదేదో భలే ఉందే అనుకుంటూ నేను కాస్త దగ్గరగా జరిగి అద్దాన్ని చూస్తూ ఉంటే ఇంతలో బైకుపై మరో ఆకారం (ఎవరిదో మరి?) కిశోర్ కుమార్ శబ్దాలు చేస్తూ “యహ కల్ క్యా హో కిస్నే జానా..” అని అరుస్తూ హారన్ మ్రోగించింది. అది వినగానే మన ఆకారం “హహహహ” అని ఒక మాదిరి నవ్వు నవ్వేసి నాకు టాటా చెప్తూ ఆ బైకు వెనక సీటులో కూర్చునేసింది. నా కళ్ళ ముందే ఇద్దరూ ముందుకెళ్ళిపోయారు(యి). (ఆకారాలు కదా, అందుకని వెళ్ళిపోయయి అనాలేమో అన్న సందేహం వచ్చింది లెండి!). సంభ్రమంగా నేను వెనక్కి తిరిగి చూస్తే ఏముందీ? కొత్తగా సున్నమేసిన నా గది గోడ! జీవితం కూడా రోజూ ఓ తెల్లకాగితమేమో!
(అదంతే లెండి, ఒక్కోసారి అదంతే. అదేమిటో మరి. ఎందుకలాగో మరి. మరి… అది…అదండీ మరి… ఏమిటోనండి….ఒక్కోసారి నాకు ఎందుకలా రాయాలనిపిస్తుందో అర్థంకాదు.. ఏమిటోమరి! నేనేమిటో! నా రాతేమిటో!)

స్మృతి: అద్భుతం
2009-01-03
శ్రీ కృష్ణదేవరాయలు: 'హ్యూస్టన్' నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
దీప్తి ధార: శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
2009-01-02
దీప్తి ధార: ప్రేమా, పిచ్చి రెండూ ఒకటేనా?
దీప్తి ధార: స్పందన
దార్ల: విమర్శకుడుగా వల్లంపాటి వెంకట సుబ్బయ్య
2009-01-01
నాగన్న: 2009 సంవత్సర శుభాకాంక్షలు
దార్ల: జోగినీ వ్యవస్థను నిర్మూలించాలి.
కిన్నెరసాని: శ్రీవారికి (సత్యభామ) ప్రేమ లేఖ
సాక్షి: నూతన సంవత్సర శుభాకాంక్షలు
సౌమ్య: పుస్తకం.నెట్ ?
సరే, ఎలాగో మొదలుపెట్టాను కదా, స్వామి కార్యం-స్వకార్యం రెండూ ఐనట్లు ఉంటుంది, చరిత్ర మొదలెడతాను.
2006 లో ఈ బ్లాగు మొదలుపెట్టినప్పుడు నాది పచ్చి స్వార్థం. ఈ పుస్తకాలు చదువుతున్నామా… కొన్నేళ్ళ తరువాత వాటి గురించి గుర్తు లేకుంటే ఎలా? అనుకున్నప్పుడు ఇలా బ్లాగులో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు చదూకోవచ్చు కదా అనుకుని మొదలుపెట్టాను. కాస్త పరికించి చూస్తే ఈ బ్లాగులో దాదాపుగా మొదటి ఆర్నెల్లు పుస్తక సమీక్షలు తప్ప కనబడవు. తరువాత్తరువాత అదీ ఇదీ, ఆఖరుకి నాకేది తోస్తే అదీ అన్ని రకాల టపాలు రాస్తూ వెళ్ళాననుకోండి, సో, పుస్తక పరిచయాల కోసం మొదలుపెట్టిన బ్లాగు మరేదో అయింది.
వర్తమానం@2008: ఆ మధ్య పూర్ణిమ బ్లాగులో పుస్తకాల కోసం నవతరంగం వంటి సైటు ఉంటే బాగుండు కదా అన్న కోరిక వ్యక్తం చేసింది. అప్పుడు మళ్ళీ నాలో పాత ఆశలు చిగురించాయి. సై అంటే సై అనుకుని, బస్తీ మే సవాల్ చేసేస్కున్నాం ఇద్దరం. అలా అలా తోటి బ్లాగర్లనీ మిత్రులనీ ఈ విషయం గురించి అడుగుతూ, ఆసక్తి ఉన్నవారిని కలిపేసుకుంటూ, ఆసక్తి ఉండీ కలవని వారిని బెదిరిస్తూ (ఒక్కోసారి ఆ బెదిరింపులు ఫలించాయి కూడా).. అలా అలా చివరికి సైటుకి ఓ రూపం ఇచ్చుకునే ప్రయత్నం లో ఉన్నాము.
ఈ సైటు ఎందుకు? అంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే - పుస్తకాల కోసం, పుస్తక ప్రియుల కోసం, తెలుగు వారికోసం. ఈ సైటులో మీరు ఏ భాష పుస్తకం గురించైనా రాయవచ్చు. కాకుంటే, మీ వ్యాసం తెలుగులో రాస్తే బాగుంటుంది…ఆంగ్లమైనా పర్వాలేదు. పూర్ణిమ బ్లాగులోనూ, పుస్తకం.నెట్ సైటు “మా గురించి” పేజీ లోనూ కావాల్సినంత రాసేసారు. మీకేమన్నా సందేహాలుంటే, పుస్తకం.నెట్ చూడండి, అక్కడే మీ సందేహాలను తెలుపండి.
తెరవెనుక ఈ సైటు ఆరోగ్యాన్ని సంరక్షించేది “పొద్దు”. తెరపై దీన్ని నడిపించేవారు మీరందరూనూ. బహుశా కొన్నాళ్ళు పడుతుందేమో సైటు కుదురుకునే సరికి. ఈ సైటు మనందరికోసం, మనందరం ఏర్పరుచుకున్నది. Lets all make it a success.
మీ సలహాలు, సూచనలు editor@pustakam.net కి పంపగలరు.

కలగూరగంప: పొలమమ్మినాము-1
2008-12-31
దార్ల: ఇక వికీపీడియాలో ....
కలగూరగంప: విశాల ప్రాతిపదికం (broad-based) గా మతవిద్య
2008-12-30
"తెర"చాటు చందమామ: సిరివెన్నెలతో ఓ సాయంత్రం - 3
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిసిన అనుభవాలను వివరిస్తూ సాగుతున్న series లో ఇది ఆఖరి భాగం. ఇందులో గురువు గారు స్పృశించి వదిలేసిన కొన్ని అంశాలని క్లుప్తంగా వివరిస్తున్నాను.
సమాజ సేవ గురించి
మేము మొదటిసారి సిరివెన్నెలని కలిసినప్పుడు మా ముందు ఒక social service group ఆయన్ని కలిసింది. వాళ్ళ గురించి ఆయన ఆలోచిస్తూ మాతో ఇలా అన్నారు -
ఈనాటి యువతని చూస్తే ఎంత అయోమయంలో ఉన్నారో అనిపిస్తుంది. వీళ్ళ పేరు Adam అయ్యినట్టూ, ఇప్పటి దాకా అసలు సమాజ సేవ ఎవరికీ పట్టనట్టూ, వీళ్ళే మొదలుపెట్టినట్టూ మాట్లాడారు. established organizations లో ఒక అనామక సంఘ సేవకుడిగా పనిచెయ్యొచ్చు గా? లేదు. “నాకంటూ ఒక organization ఉండాలి. దాని ద్వారా చేసిన సేవే సంతృప్తినిస్తుంది.” అని నువ్వు అనుకుంటే ఈ సేవ అన్నది నీకోసం అన్నమాట, సమాజం కోసం కాదు!
సినిమా పాటలు ఎలా రాయాలి?
మా బృందంలో కొందరు ఔత్సాహిక సినీ గీత రచయితలు ఉన్నారు. వాళ్ళ కోసం సిరివెన్నెల గారు కొన్ని అమూల్యమైన సలహాలు ఇచ్చారు -
ముందు మీ గురించి మీకు తెలియాలి. పాటలు రాయగలిగే passion ఉందా, సినిమా పరిశ్రమలో ఉండే ఒడిదుడుకులని తట్టుకునే సామర్ధ్యం ఉందా, ఇలాటివి. తర్వాత మీ motivation గురించి మీకు clarity ఉండాలి. మీరు lyricist ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? పేరు కోసమా, డబ్బు కోసమా, సంతృప్తి కోసమా, ప్రజల కోసమా? ఇందులో ఏదో మీరు తెలుసుకోవాలి. సగం దూరం వెళ్ళాక వెనక్కి రావడం అంత సులభం కాదు”.
గురువుగారు చెప్పిన ఈ wisdom ఔత్సాహిక సినీ గేయ రచయితలకే కాక, job change అవ్వాలనుకుంటున్న వారికి, జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా చాలా అవసరం.
“మన భావాలని tune లో పలికించడం ఎలా? మీరు ఇది చాలా బాగా చేస్తారే. కొన్ని మెళకువలు నాకూ చెప్పరూ?” అని తెలిసీ తెలియని జ్ఞానంతో నేను అడిగిన ప్రశ్నని తీసి పారెయ్యకుండా -
“మెళకువలు ఏమీ లేవు! మెలకువగా ఉండడమే మెళకువ!”
అన్న సిరివెన్నెలకి మనసులోనే నమస్కరించుకున్నాను.
దీనికి కొంత ప్రతిభ అవసరమే. అయితే సాధన చాలా అవసరం. నేను అనుకున్న భావం tune లో పలికించుకునే దాకా నేను ఎంత కష్టపడతానో మీకు తెలియదు. ఒక పాట పల్లవికి 150 versions రాశాను రాత్రంతా కూర్చుని
అని ఆయన చెబితే బాగా రాయడానికి tricks and shortcuts లేవని మనకి తెలుస్తుంది. “బాగా రాయడం ఎలాగండీ?” అని ఒక రచయితని ఎవరో అడిగితే “రాయాలి” అని ఆయన చెప్పిన సమాధానం గుర్తుకు వస్తుంది.
సినిమా కవికీ స్వతంత్రుడు కాదు. తనకి నచ్చినట్టు రాసుకుంటే సరిపోదు. మరి ఎలా రాయాలి అన్న దాని గురించి చెబుతూ ఇలా అన్నారు -
ముందు పాట మీకోసం మీరు రాసుకోవాలి. స్పందంచగలగాలి. మీలో సమస్త మానవాళి దాగుంది కాబట్టి ఈ స్పందనలో universality అదే వస్తుంది. రాసే దానిని దర్శకుడికి నచ్చేటట్టు మలచగలగాలి.
యువతకి ఇచ్చే సందేశం
గురువుగారు చాలా విషయాల గురించి మాట్లాడారు. ఆఖరిగా ఆయన చెప్పాలనుకుంటున్నది ఏమిటో ఆయనే ఇలా చెప్పారు -
ప్రశ్నించుకోండి, మనిషిగా బ్రతకడం ఎలా అని? నిరంతరం ప్రశ్నించుకోండి. మనిషిగా బ్రతకట్లేదని సిగ్గుపడండి. ఆ guilty feeling తో మీరు ఇక్కడి నుంచీ వెళ్ళండి. మిమ్మల్ని మీరే విమర్శించుకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు సాగండి. నేను అదే చేస్తాను. నన్ను నేను తిట్టుకున్నట్టుగా ఎవ్వరూ నన్ను తిట్టలేరు, అలాగే నన్ను నేను మెచ్చుకున్నట్టుగా ఎవ్వరూ మెచ్చుకోనూలేరు !
ఆయన చెప్పిన మాటలు ఎదలో, మదిలో సొదచేస్తూ ఉండగా ఇక వెళ్ళడానికి ఉపక్రమించాం అందరం. కొందరు ఆయన autograph తీసుకున్నారు. నాకు అనిపించింది - ఆయన సంతకాన్ని ఇప్పుడు పుస్తకం మీద కాదు, మన మనసుపై తీసుకోవాలి అని! ఆయన మాటల్ని విని బాగుందని వదిలెయ్యకుండా మన నరనరాల్లో ఎక్కించుకోవాలని. అప్పుడే ఆయన ఆనందించేది. అప్పుడే ఆయన సగర్వంగా వీళ్ళు నా శిష్యులు, నా సైన్యం అనగలిగేది.
ఆ రాత్రి ఇంటికి వెళుతూ ఉండగా, ఆయన అన్న మాటలు గుర్తొచ్చాయ్ -
మీరు నా సైన్యం అనుకుంటున్నాను నేను. మీలో సత్తా ఉంది, చాలా సాధించగలరు, పూనుకుంటే. మీ లోపాలని అధిగమించండి. ఒక కుంటివాడూ, ఒక గుడ్డివాడూ తన సైన్యమైతే ఏ సేనాధిపతి గర్వించగలడు?
మీరు సిరివెన్నెలని గర్వించేలా చెయ్యగలరా?

2008-12-29
తెలుగులో తప్పటడుగులు: Madagascar 2
ఐతే OK: జ్యోతిలక్ష్మి దొరికింది - 2
శ్రీ కృష్ణదేవరాయలు: 'నేడే చదవండి' మీ అభిమాన సినీ'జాల'పత్రికలో...
శ్రీ కృష్ణదేవరాయలు: 'హోమియో' పని చేస్తుందా? మనం ఏం చేద్దాం?
2008-12-28
తెలుగులో తప్పటడుగులు: సెక్యులరిజము సొల్లు
2008-12-27
కలగూరగంప: సమాచార సాంకేతికత ( IT) కి దేశీయ ప్రాతిపదిక
సౌమ్య: డిసెంబర్ లో నవతరంగం
ఈ బ్లాగుది మరీ అనాథ బ్రతుకైపోయిందనిపించింది ఈరోజు పొద్దున్నే. అందుకే, కనీసం నేను రాయడమే మానేయలేదు…బ్లాగు మాత్రమే ఈ మధ్య రాయట్లేదు అని నిరూపించుకునే ప్రయత్నం - నవతరంగంపై ఈ నెల నేను ప్రకటించిన దాడిని గురించి ఇక్కడ డబ్బా కొట్టుకునే పని. గత నెల రోజుల్లో అక్కడ పది వ్యాసాలు రాసాను. అంటే, మూడ్రోజులకి ఒకటన్నమాట.
1. Aditya 369 పై.
2. రాజ్ కపూర్ సినిమా “ఆవారా” (1951) పై
3. చార్లీ ఛాప్లిన్ సినిమా “ది ట్రాంప్” (1915) పై
4. స్వర్ణకమలం - మొదటి భాగం
5. సాస్ బహూ ఔర్ సెన్సెక్ష్ - 2008 హిందీ సినిమా
6. స్వర్ణకమలం - రెండో భాగం
7. చార్లీ చాప్లిన్ - “ది కిడ్” (1921)
8. సారీ భాయ్ - 2008 హిందీ సినిమా
9. ఓ మై గాడ్ - 2008 హిందీ సినిమా
10. సావిత్రి స్మృతిలో

2008-12-26
తెలుగులో తప్పటడుగులు: Oye Lucky! Lucky Oye!
శోధన: ఇప్పుడు విండోస్ లైవ్ రైటర్ లో లేఖిని లభ్యం
2008-12-24
నాగన్న: కౌంటరోపాఖ్యానం - 2
2008-12-23
సాక్షి: కాకలు తీరిన వీరులు - 2(ఆ)
2008-12-22
యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి: కోదండరామాంజులు
చెప్పాలని ఉంది!: మీ కంప్యూటరు ద్వారా తెలుగు వినటము (”text to speech” for Telugu) ఎలా
మీ కంప్యూటరు ద్వారా తెలుగు వినటము (”text to speech” for Telugu) ఎలా
మన పుస్తక ప్రదర్శనలో కొంత మంది అడిగారు కంప్యూటరు లో తెలుగు చుడటము వ్రాయటము బాగానే వున్నది మరి వినటం ద్వారా కుదురుతుందా అని !
ఈ అంశం మీద రెండు సంవత్సరాల క్రితం ఒక టపారాశాను దానినే దుమ్ముదులిపి కొంచెం మార్చి మీముందుకు
ఇప్పటి వరకు కోన్ని ఉపకణాలు సీడాక్ వారు చేసివున్నారు కానీ అవి అంతగా ప్రచారానికి నోచుకోలేదు. మన తెలుగు వారందరము ఆంగ్ల వ్యామోహంవలన, సాంకేతిక పరిమితుల వలన వాణిజ్య పరమైన వెసులుబాటు లేక పోవుట వలన దీని వలన అయితేనేమి మరి దాని వలన అయితే నేమి మరిదేనివలన ఆయితేనేమి ఈ దిశగా ప్రయత్నాలు జరగలేదు .
అయితే కొద్దిపాటి ఉచిత ఉపకరణాలతో తెలుగును వినవచ్హు కానీ కోన్ని ఉచ్హారణా పరమైన లోపాలు కలవు.
ఉద్దేశ్యము : తెలుగు RTS Text ను చదివించటము Unicode to RTS Object : Generating Telugu sounds from Telugu phonetic script కావలసిన ఉపకరణములు
1) http://www.readplease.com/english/downloads/#rp2003 మరియు అదే పుట నందు ఇంకా కింది బాగమున ఇటలియన్ వాయస్ కూడా దిగుమతి చేసుకోనవలయును 3) TTS engine with 2 L&H Italian voices(Male & Female) కూడా దిగుమతి చేసుకోనవలయును
ఇప్పుడు మీరు వినాలనుకోన్న తెలుగు యునీకోడు ని http://lekhini.org/nikhile.html లేదా బహర / పద్మ ద్వారా లోకి మార్చుకోవాలి
దీనిని Cut చెసి Readplease lo paste చేయటమే
Imp note : In read please you have to select Italian voice ! ఇది ఎలా పలుకు తున్నదో వినవలె నంటే www.geocities.com/krupal_kasyap/okaraju.mp3
www.geocities.com/krupal_kasyap/telugu.doc ( with pics)

2008-12-21
నా మదిలో ...: మీ వెబ్‌సైటు గురించి మరింత తెలుసుకోండి ...
2008-12-20
స్మృతి: బుష్ కు పరాభవం
హరివిల్లు: ఈ రోజు (e-)తెలుగు వెలుగులు
2008-12-18
పూతరేక్స్: చిత్రమైన జీవితం…
2008-12-16
'సత్య'శోధన: తెలుగు బ్లాగుల దినోత్సవం - సింహావలోకనం - మిగిలిన కొద్ది భాగం
2008-12-15
స్మృతి: ఇందుకు అభినందనలా?
'సత్య'శోధన: తెలుగు బ్లాగుల దినోత్సవం - సింహావలోకనం
2008-12-14
హరివిల్లు: మనిషిలా ఆలోచించు
I stumbled on this blog by chance, when I was looking out for the book “Letters from a father to his daughter” for my son. I am equally impressed by the reviews of various books in a refreshing manner. Keep up the good work.
This book is available for purchase online here:
http://www.flipkart.com/letters-father-his-daughter-jawaharlal/0670058165-k3w3f915ib
Surya (Singapore)
రోజు రోజుకూ పెరుగుతున్న తెలుగు బ్లాగుల్లో మీది అత్యుత్తమ బ్లాగుల్లో ఒకటి. మీరు ఇలాగే కొనసాగించాలని అభిలషిస్తూ, మిమ్మల్ని అభినందిస్తూ ..
యోగి
“మానసిక వ్యభిచారం”.. ఈ పదం ఆలోచించే వాడారా?!
very good story NAAGANNA garu. . .


